రేణుకాదేవి
ధారావాహిక లోని భాగం |
హిందూధర్మం |
---|
హిందూమత పదకోశం |
ప్రసేనజిత్తు అనే ఇక్ష్వాకు వంశము రాజు కూతురు రేణుకాదేవి.
వివాహము
[మార్చు]రేణుకాదేవి భర్త జమదగ్ని..[1] జమదగ్ని పెరిగి పెద్దవాడైన అతను కఠోర అధ్యయనం, వేదాల మీద పాండిత్యానికి పట్టు సాధించాడు. తదుపరి అతను సౌర రాజవంశం లేదా సూర్యవంశం యొక్క, రాజు ప్రసేనజిత్తు వద్దకు వెళ్ళాడు, వివాహంలో ప్రసేనజిత్తు కుమార్తె రేణుక చేతిని తన చేతిలో పెట్టమని అడిగాడు. తదనంతరం, వారు వివాహం చేసుకున్నారు, జంటకు కలిగిన ఐదుగురు కుమారులను వాసు, విశ్వ వాసు, బృహుధ్యాను, బృహుత్వాకణ్వ, రాంభద్ర తరువాత ఇతనిని పరశురాముడు అని పిలుస్తారు.[1][2][3]
సంతానం
[మార్చు]రేణుకాదేవి, జమదగ్ని దంపతులకు అయిదుగురు సంతానం. పెద్ద కుమారుడు రుమణ్వంతుడు, చివరి కుమారుడు పరశురాముడు.
పరశురాముని జన్మవృత్తాంతం
[మార్చు]శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము ఆరవది[4]. త్రేతాయుగము ఆరంభములో జరిగింది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని భార్గవరాముడు, జామదగ్ని అని కూడా అంటారు[5]. కుశ వంశానికి చెందిన మహారాజు గాధి. ఒకసారి భృగు వంశానికి చెందిన ఋచీకుడు అనే మహర్షి గాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకొన్నాడు.[6] ఇలా జరుగుతుండగా ఒక రోజు సత్యవతి ఋచీకుని దగ్గరకు వచ్చి తనకు, తన తల్లికి పుత్రసంతానం ప్రసాదించమని కోరగా ఋచీకుడు యాగం చేసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సు, రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారుచేసి స్నానానికి వెళ్ళతాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకొని విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. ఋచీకునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తనకొడుకు సాత్వికుడిగ ఉండి, మనుమడు ఉగ్రుడు అవుతాడు అని పల్కుతాడు.[7] ఋచీకుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశతో జన్మించినవాడు పరశురాముడు[6]. గాధి కొడుకే విశ్వామిత్రుడు. భృగు వంశాను చరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు. ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొంది, పరశురాముడైనాడు.
రేణుకాదేవి వధ
[మార్చు]కాలం ఇలా నడుచుచుండగా ఒకసారి రేణుక నీటి కొరకు చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేళి చూస్తూ ఉండటం వల్ల తిరిగి రావడం ఆలస్యమౌతుంది. కోపించిన జమదగ్ని ఆమెను సంహరించవలెనని కొడుకులను ఆదేశిస్తాడు. పెద్దకొడుకులు అందుకు సమ్మతించరు. తల్లిని, సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముని ఆదేశించగా, అతడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు. జమదగ్ని సంతోషించి ఏమైనా వరము కోరుకొమ్మనగా పరశురాముడు తల్లిని, సోదరులను బ్రతికించమంటాడు. ఈ విధముగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకొంటాడు.
జమదగ్ని మరణం
[మార్చు]ఒకరోజు పరశురాముడు ఇంట్లోలేని సమయం చూసి, కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మాహిష్మతికి పట్టుకు పొతారు. పరశురాముని తల్లి రేణుక భర్త శవంపై పడి రోదిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులులను చంపి జమదగ్ని తలను తెచ్చి మెండానికి అతికించి బ్రతికిస్తాడు.
ఒక గ్రామదేవత. పరశురాముల తల్లి అగు పరాశక్తి అవతారము అయిన రేణుకాదేవిని ఈనామముచే అనేకదేశములయందు పూజింతురు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Subodh Kapoor (2004). A Dictionary of Hinduism: Including Its Mythology, Religion, History, Literature, and Pantheon. Cosmo Publications. pp. 185–. ISBN 978-81-7755-874-6.
- ↑ George Mason Williams (2003). Handbook of Hindu Mythology. ABC-CLIO. pp. 160–161. ISBN 978-1-57607-106-9.
- ↑ Yves Bonnefoy; Wendy Doniger (1993). Asian Mythologies. University of Chicago Press. pp. 82–83. ISBN 978-0-226-06456-7.
- ↑ Shahjahanpur – Etihasik Evam Sanskritik Dharohar
- ↑ Pai, Anant (November 29, 2010). Parashurama – Sixth Incarnation of Vishnu. Amar Chitra Katha – Volume 764. p. 33.
- ↑ 6.0 6.1 Rai, Kayyara Kinhanna (June 13, 2010). BhargavaParashurama. Litent ePublishing. p. 33.
- ↑ "Parashurama". Rai, Kayarra Kinhanna. November 22, 2012. Archived from the original on 2012-04-28. Retrieved November 22, 2012.