శ్రీ లక్ష్మీనారాయణ మందిరం, కరాచీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ లక్ష్మీనారాయణ మందిరం, కరాచీ
Shri Laxmi Narayan Mandir
لکشمی نارائن مندر
పేరు
ఇతర పేర్లు:నారాయణ మందిరం, లక్ష్మీనారాయణ దేవాలయం
స్థానం
దేశం:పాకిస్తాన్ పాకిస్తాన్
రాష్ట్రం:సింధ్
ప్రదేశం:నేటివ్ జెట్టీ
ప్రదేశం:కరాచీ

శ్రీ లక్ష్మీనారాయణ మందిరం (ఉర్దూ: لکشمی نارائن مندر) పాకిస్తాన్ లోని కరాచీ లో ఉన్న ఒక హిందూ ఆలయం. పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ ప్రకారం, ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం [1] నిర్మించబడింది. ఈ దేవాలయం స్థానిక కమ్యూనిటీ యొక్క హిందువుల కోసం ఒక ముఖ్యమైన ప్రార్ధన, ఆరాధన ప్రదేశము. ఈ మందిరం సజీవంగా ఉన్న పురాతన ఆలయాలలో ఒకటి. కరాచీలో క్రీక్ ఒడ్డున ఉన్నటువంటి ఒకే ఒక ఆలయం ఇది. [2]

ప్రదేశం[మార్చు]

శ్రీ లక్ష్మీనారాయణ మందిరం పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్ నందలి కరాచీలోని ఒక స్థానిక జెట్టీ వంతెన క్రింద ఉంది. [1] ఈ దేవాలయం అరేబియా సముద్రము వైపుగా చూస్తూ ఉంటుంది. ఇది చాలా హిందూ ఆచారాలకు ముఖ్యమైన స్థలం. [2][3]

పండుగలు[మార్చు]

ఈ ఆలయం ప్రధానంగా హిందూ దేవత లక్ష్మి కి అంకితం చేయబడింది; ఏదేమైనా, హనుమంతుడు, షిర్డీ సాయిబాబా విగ్రహాలు కూడా ఉన్నాయి.[3] గణేష్ పుట్టినరోజు, రక్షా బంధన్ గణేష్ చతుర్థి ఈ ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగలు. దేవతలకు అర్పణలు చేయడానికి, మరణం తర్వాత కర్మకు సంబంధించిన ఆచారాలను నిర్వహించడానికి హిందువులు దేవాలయానికి వస్తారు. [1] ఈ ఆలయం శ్రద్ధను అందించడానికి, నవరాత్రి, గణేష్ చతుర్థీ పండుగల ముగింపులో; దుర్గా దేవత (తొమ్మిది రోజులు గర్బా నృత్యం ప్రదర్శించిన తరువాత) [4] , గణేశ విగ్రహాలను సముద్రంలో నిమజ్జనం చేయుటకు ఇది పవిత్ర ప్రదేశం. [1] కర్మ శుద్దీకరణ కోసం అరేబియా సముద్రపు నీటిలో హిందువులు స్నానం చేస్తారు. ఋతుపవన కాలంలో, హిందూ మహిళలు ఉపవాసం కోసం దేవాలయానికి వచ్చి, వారి భర్తల బాగోగుల కోసం ప్రార్థిస్తారు. [3]

రక్షణ[మార్చు]

ఈ ఆలయం సమీపంలో పోర్ట్ అభివృద్ధి కార్యకలాపాలు, నిర్మాణ పనుల కారణంగా, ఆలయం నుండి సముద్రపు నీటిలోనికి భక్తుల రాకపోకలకు వెళ్ళేందుకు నిరాకరించడం, మందిరం సమగ్రతకు కూడా బెదిరించడం జరిగింది. సెప్టెంబరు 2012 లో స్థానిక హిందూ సమాజం ద్వారా పిటిషను దాఖలు చేసిన తరువాత, సింధ్ హైకోర్టు కరాచీ పోర్ట్ ట్రస్ట్‌ను మందిరం పరదేశాన్ని నిర్మూలించకుండా ఒక ఆదేశాన్ని జారీ చేసింది. దేవాలయం స్థలం సమీపంలో నిర్మాణ బాధ్యతకు హిందూ పంచాయతీ సభ్యుడు, ఎక్సైజ్, పన్నుల శాఖ మంత్రి ముఖేష్ చావ్లా అని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. [5][6] "కార్పొరేట్ దురాశ, ఒక వివక్షత కుల వ్యవస్థ" కారణంగా బలవంతంగా తిరిగి హిందూ నాయకులు, నగర అధికారులచే స్థిరపడినట్లు హిందూ కుటుంబాలు పేర్కొన్నాయి. కొత్త అభివృద్ధి ప్రణాళికలో భాగంగా ఒక వినోద కాంప్లెక్స్ నిర్మాణాన్ని కలిగి ఉండి, ఇది ఆలయ ప్రాంగణంలోని స్థలాన్ని ఆక్రమించి ఉంటుంది.[2] 1993 లో, భారతదేశంలో బాబ్రీ మసీదు కూల్చివేసిన తరువాత ప్రతీకారంగా ఈ ఆలయం అపవిత్రం చేయబడింది.[2]

ఇవి కూడా చూడండి[మార్చు]


మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 "Laxmi Narain Temple At Native Jetty Bridge". Temples in Pakistan. Pakistan Hindu Council. Archived from the original on 15 August 2012. Retrieved 17 September 2012.
  2. 2.0 2.1 2.2 2.3 "Brick by brick they see it vanish – all over again". The News International. 17 September 2012. Archived from the original on 7 May 2016. Retrieved 17 September 2012.
  3. 3.0 3.1 3.2 "Fasting for love". Dawn News. Retrieved 17 September 2012.
  4. Anjali H. Desai, ed. (2007). India Guide Gujarat. India Guide Publications. p. 43. ISBN 9780978951702.
  5. "SHC restrains authorities from demolishing Hindu temple". Dawn News. 15 September 2012. Retrieved 17 September 2012.
  6. "PTI for action against temple demolition". Daily Times. 9 September 2012. Archived from the original on October 14, 2013. Retrieved 17 September 2012.