లక్ష్మీనగర్ కాలనీ (మెహదీపట్నం)
లక్ష్మీనగర్ కాలనీ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°23′13″N 78°25′44″E / 17.387081°N 78.428843°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 500 028 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | హైదరాబాదు |
శాసనసభ నియోజకవర్గం | కార్వాన్ |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
లక్ష్మీనగర్ కాలనీ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఒక గేటెడ్ కమ్యూనిటీ. హైదరాబాద్ నుండి బెంగుళూరుకు వెళ్ళే రింగ్ రోడ్‌లో మెహదీపట్నం సమీపంలోని గుడిమల్కాపూర్ క్రాస్‌రోడ్‌కు దగ్గరలో ఉంది. ఈ కాలనీలో 30–40 ఇండిపెండెంట్ బంగ్లాలు ఉన్నాయి. ఇక్కడికి పశ్చిమాన సరిహద్దులో పెద్ద భారతీయ సైనిక స్థావరం ఉంది.
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో వెంకటరావు నగర్, సప్తగిరి కాలనీ, ప్రకాష్ నగర్, సాయిబాబా నగర్ కాలనీ ఫేజ్-1, రామారావు నగర్ కాలనీ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[1]
వాణిజ్య ప్రాంతం
[మార్చు]మెహదీపట్నం, గుడిమల్కాపూర్‌కు సమీపంలో ఉన్నందున ఈ ప్రాంతంలో అనేక దుకాణాలు ఉన్నాయి. ఇక్కడినుండి నానల్‌నగర్‌కు రోడ్డుమార్గం కూడా ఉంది.
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- అయ్యప్పస్వామి దేవాలయం
- దుర్గ దేవాలయం
- షిర్డీ సాయిబాబా దేవాలయం
- యునాని మసీదు
- మస్జిద్-ఎ-గౌసియా
విద్యాసంస్థలు
[మార్చు]- శ్రీ చైతన్య మెడికల్ అకాడమీ
- సెయింట్ అల్ఫోనాస్ హైస్కూల్
- నేతాజీ ఉన్నత పాఠశాల
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఈ ప్రాంతం మీదుగా ఆల్విన్ కాలనీ, సికింద్రాబాద్, జగద్గిరిగుట్ట, ఇసిఐఎల్, లింగంపల్లి, భెల్, మెహదీపట్నం మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[2]
బ్యాడ్మింటన్ కోర్టు
[మార్చు]లక్ష్మీనగర్‌లో ఏర్పాటుచేసిన బ్యాడ్మింటన్ కోర్టును 2022 ఫిబ్రవరి 20న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రారంభించాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Laxminagar Colony Locality". www.onefivenine.com. Archived from the original on 2017-08-25. Retrieved 2022-10-14.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2022-10-14.
- ↑ telugu, NT News (2022-02-20). "Badminton court | షేక్‌పేట్ లక్ష్మీనగర్ కాలనీలో బ్యాడ్మింటన్ కోర్టు ప్రారంభం". Namasthe Telangana. Archived from the original on 2022-10-14. Retrieved 2022-10-14.