బాలానగర్ (మేడ్చల్ జిల్లా)

వికీపీడియా నుండి
(బాలానగర్ (రంగారెడ్డి) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

బాలానగర్, తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా, బాలాపూర్ మండలానికి చెందిన పట్టణం.[1]ఇది హైదరాబాద్ పరిసరప్రాంతంలో ఉంది.ఇది మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజన్ పరిధిలోని బాలానగర్ మండలం పరిపాలనలో ఉంది.రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది రంగారెడ్డి జిల్లాకు చెందిన గ్రామం.ఈ గ్రామం మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం లోకసభ నియోజకవర్గంలోని, కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందింది.

గణాంకాలు[మార్చు]

2011 భారత జననగణన ప్రకారం బాలానగర్ రెవెన్యూ గ్రామ పరిధిలో మొత్తం 172 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం గ్రామ జనాభా 878 మంది కాగా వీరిలో 423 మంది పురుషులు, 455 మంది మహిళలు ఉన్నారు.[2]

బాలానగర్ గ్రామంలో 0 -6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 137, ఇది మొత్తం గ్రామ జనాభాలో 15.60%. బాలనగర్ గ్రామంలో సగటు సెక్స్ నిష్పత్తి 1076. బాలానగర్‌లో పురుషుల అక్షరాస్యత 55.17% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 29.52%.[2]

రవాణా[మార్చు]

ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్టాప్ ఉంది. ఇక్కడ హైదరాబాద్ మెట్రో ఆధ్వర్యంలోని బాలానగర్ మెట్రో స్టేషను కూడా ఉంది.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-06-03.
  2. 2.0 2.1 "Balanagar Village Population - Medak - Medak, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2020-06-19.

వెలుపలి లింకులు[మార్చు]