Jump to content

నల్గొండ జిల్లా

అక్షాంశ రేఖాంశాలు: 17°03′N 79°16′E / 17.05°N 79.27°E / 17.05; 79.27
వికీపీడియా నుండి
(Nalgonda నుండి దారిమార్పు చెందింది)
  ?నల్లగొండ
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°03′N 79°16′E / 17.05°N 79.27°E / 17.05; 79.27
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 14,240 కి.మీ² (5,498 చ.మై)
ముఖ్య పట్టణం నల్లగొండ
జనాభా
జనసాంద్రత
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
34,83,648 (2011 నాటికి)
• 245/కి.మీ² (635/చ.మై)
• 1758061
• 1725587
• 57.84(2001)
• 70.19
• 45.07

నల్గొండ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి.[1] ఈ జిల్లా పరిపాలన కేంద్రం నల్గొండ.

పూర్వం నల్గొండకు నీలగిరి అని పేరు ఉండేది.నల్గొండ జిల్లాకు ఉత్తరాన యాదాద్రి జిల్లా, ఈశాన్యాన సూర్యాపేట జిల్లా, దక్షిణాన గుంటూరు జిల్లా, తూర్పున కృష్ణా జిల్లాలు, పశ్చిమాన శంషాబాద్ మండలం, నైఋతిన నాగర్ కర్నూలు జిల్లాలు సరిహద్దులు. ఉద్యమాల పురిటిగడ్డగా పేర్కొనే నల్గొండ జిల్లాలో ఎందరో కమ్యూనిస్టులు, దేశభక్తులు, స్వాతంత్ర్యసమరయోధులు, నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించిన పోరాటయోధులు జన్మించారు. రజాకార్లను ఎదిరించిన కోదాటి నారాయణరావు[2], గాంధేయవాది రావి నారాయణరెడ్డి, స్వాతంత్ర్య సమరయోధుడు పులిజాల రంగారావు, ఆర్యసమాజ ముఖ్యుడు నూతి విశ్వామిత్ర, కమ్యూనిస్టు యోధుడు బొమ్మగాని ధర్మభిక్షం, రజాకార్ల దురాగతాలను ఎదిరించిన మహిళ ఆరుట్ల కమలాదేవి,ఆరుట్ల రామచంద్రా రెడ్డి, బీమ్ రెడ్డి నారాయణరెడ్డి, మల్లు స్వరాజ్యం. నిజాం వ్యతిరేక పోరాట యోధుడు కాసాని నారాయణలు ఈ జిల్లాకు చెందినవారే. 1952 ఎన్నికల్లో 12 నియోజకవర్గ లలో 12 కమ్యూనిస్ట్ నాయకులే గెలిచారు. కవి, కమ్యూనిస్ట్ యోధుడు మగ్దుం మొహిణిద్దీన్ హుజుర్నగర్ మొదటి mla.అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో రావి నారాయణరెడ్డి గారు సీపీఐ నుండి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీ గెలిచాడు. నల్గొండ జిల్లాలో కమ్యూనిస్ట్ లు వేలాది ఎకరాల భూమిని ప్రజలకు పంచి సాయుధ పోరాట నికి ఊపిరి పోశారు.[3]

పటం
నల్గొండ జిల్లా

జిల్లా చరిత్ర

[మార్చు]

శాతవాహనుల కాలంలో నీలగిరిగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతమే కాలక్రమంలో నందికొండగా, నల్గొండగా మారింది. నల్గొండ జిల్లా పోరాటాలకు ప్రసిద్ధి, ఉద్యమాల ఖిల్లాగా ఈ జిల్లాకు పేరు. ప్రపంచ చరిత్రలో స్థానం సంపాదించిన వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి జిల్లా ఆయువుపట్టు.

జనాభా లెక్కలు

[మార్చు]
  • 2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జిల్లా జనాభా 34,83,648.అందులో పురుషులు 17,58,061 కాగా స్తీలు 17,25,587.
  • 2001 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత 57.84% నమోదైంది. పురుషులలో 70.19 %, స్త్రీలలో 45.07.%
  • 1981 నాటి జనాభా లెక్కల ప్రకారం నల్లగొండ జిల్లా జనాభా, 22,79,658, స్త్రీ, పురుషుల నిష్పత్తి:970:1000, అక్షరాస్యత 18.95 శాతం.(మూలం: అంధ్రప్రదేశ్ దర్శిని 1985)

భౌగోళిక స్వరూపం

[మార్చు]

నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణకు ముందు భౌగోళికంగా నల్లగొండ జిల్లా 59 రెవెన్యూ మండలాలతో కలిగి ఉంది.[4].

పూర్వపు 59 మండలాలతో ఉన్న నల్గొండ జిల్లా రేఖా పటం (కుడివైపు) ——→ ——→

నల్గొండ జిల్లా నుండి కొత్తగా ఏర్పడిన జిల్లాలు

[మార్చు]

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం / పునర్య్వస్థీకరణ చేపట్టింది.

అందులో భాగంగా నల్గొండ జిల్లా పరిధిలో పునర్య్వస్థీకరణ ముందు ఉన్న 59 పాత మండలాల నుండి 14 మండలాలతో భువనగిరి పరిపాలనా కేంధ్రంగా యాదాద్రి జిల్లా,18 మండలాలతో సూర్యాపేట జిల్లా కొత్తగా ఏర్పడగా 26 పూర్వపు మండలాలతో నల్గొండ జిల్లా పునర్య్వస్థీకరించారు.అధికారికంగా కొత్త జిల్లాలు ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

కొత్తగా ఏర్పడిన జిల్లాలలో చేరిన మండలాలు

[మార్చు]

సూర్యాపేట జిల్లాలో చేరిన మండలాలు

[మార్చు]

పూర్వపు నల్గొండ జిల్లాకు చెందిన 18 పాత మండలాలతో సూర్యాపేట జిల్లా కొత్తగా ఏర్పడింది.కొత్తగా 5 మండలాలు ఏర్పడినవి.[5]

యాదాద్రి - భువనగిరి జిల్లాలో చేరిన మండలాలు

[మార్చు]

పూర్వపు నల్గొండ జిల్లాకు చెందిన 14 పాత మండలాలతో యాదాద్రి భువనగిరి జిల్లా కొత్తగా ఏర్పడింది. కొత్తగా 2 మండలాలు ఏర్పడినవి.[6]

జనగామ జిల్లాలో చేరిన మండలాలు

[మార్చు]
  • గండాల మండలం 2016లో జరిగిన పునర్య్వస్థీకరణలో జనగామ జిల్లాకు మారింది.[7] తరువాత ఈ మండలం జనగామ జిల్లా నుండి, యాదాద్రి భవనగిరి జిల్లాకు మారింది.[8]

జిల్లాలో పునర్య్వస్థీకరణ తరువాత మండలాలు

[మార్చు]

పునర్య్వస్థీకరణలో 26 పాత మండలాల కాగా, కొత్తగా 5 మండలాలు కలిపి 31 మండలాలుతో జిల్లా ఏర్పడింది.[9]

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (5)

రెవెన్యూ డివిజన్లు

[మార్చు]

శాసనసభ నియోజక వర్గాలు

[మార్చు]

జిల్లాలో 6 శాసనసభ నియోజక వర్గాలు ఉన్నాయి.

లోక్‌సభ స్థానాలు

[మార్చు]

ముఖ్య సాగునీటి ప్రాజెక్టులు

[మార్చు]

ముఖ్యమైన జీవ నదులు,

[మార్చు]

ఆర్ధిక స్థితి గతులు

[మార్చు]

సున్నపురాయి నిల్వలు అత్యధికంగా ఉన్న జిల్లా కావడంతో సిమెంట్ ఉత్పాదనలో ఈ జిల్లా అసియాలోనే ప్రథమ స్థానంలో ఉంది.

రవాణా వ్వవస్థ

[మార్చు]
  • పగిడిపల్లి - నడికుడి రైలుమార్గం,
  • సికిందరాబాద్ - వరంగల్-ఖమ్మం-విజయవాడ రైలుమార్గం

విద్యాసంస్థలు

[మార్చు]

జిల్లాలో 2007 లో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం స్థాపించబడింది.

ఆకర్షణలు

[మార్చు]
యాదగిరి గుట్టలోని లక్ష్మీ నరసింహ దేవస్థానం
వేమలకొండ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయం
భువనగిరి కోట

బహుళార్థసాధక ప్రాజెక్టుకు సరైన నిర్వచనం చెప్పగల నాగార్జున సాగర్ ఈ జిల్లాకు ప్రధాన ఆకర్షణ. మానవ నిర్మిత ఆనకట్టలలో ఆసియాలోనే ఇది అతిపెద్దది. సా.శ. 2వ శతాబ్దంలో ఈ ప్రాంతంలో నివసించిన బౌద్ధమతాచార్యుడైన ఆచార్య నాగార్జునుని పేరుతో నిర్మించిన ఈ ప్రాజెక్టును 1955లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రారంభించాడు. జలాశయం మధ్యలోని నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకూ కృష్ణా నది పొడవునా 3568 చ.కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించిన రిజర్వు అడవి దేశంలో వన్యమృగ సంరక్షణ కేంద్రాలన్నింటికంటే పెద్దది.జిల్లాలోని యాదగిరి గుట్ట, తెలంగాణాలోని పర్వత ప్రాంత దేవాలయాల్లో ఎంతో పేరుపొందింది. ఇక్కడి లక్ష్మీనరసింహస్వామి గుడి అన్ని ప్రాంతాలవారికి దర్శనీయ పుణ్యక్షేత్రం. దేవాలయ నిర్మాణ రీతి ప్రాచీన ఆధునిక సంప్రదాయాల కలగలుపుగా ఉంటుంది. ఏటా రథోత్సవం జరుగుతుంది. ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవం, పెళ్ళిళ్ళు విరివిగా జరిగే ప్రదేశం. జిల్లాలోని ఆలేరుకు సుమారు ఆరుకిలోమీటర్ల దూరంలోని కొలనుపాక జైన మతానుయాయులకు ఒక పవిత్ర యాత్రాస్థలం. ప్రస్తుతం ఇక్కడ శ్వేతాంబర శాఖకు చెందిన ఒక జైన దేవాలయం నిత్య పూజారాధనతో విలసిల్లుతోంది. కాకతీయుల నాటి ప్రసిద్ధి చెందిన శివాలయాలు సూర్యాపీట మండలం లోని పిల్లలమర్రి గ్రామంలో ఉన్నాయి. వాడపల్లి తీర్థం ఈ జిల్లాలో అతి పెద్ద శైవ క్షేత్రము.శివరాత్రి నాడు పుణ్యస్నానాలు అచరించడానికి ప్రజలు అధిక సంఖ్యలో వస్తారు.ఇది కృష్ణా,మూసీ, అంతర్వేది సంగమం.

బుద్ధుడి శిల్పం

హైదరాబాదుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగార్జునసాగర్ ప్రధాన పర్యాటకకేంద్రం. ఈ చారిత్రాత్మ ప్రదేశానికి ఈ పేరు బౌద్ధసన్యాసి నార్జునుడి కారణంగా వచ్చింది. ఈ ప్రదేశంలో పండితుడైన ఆచార్య నాగార్జునుడు విద్యాకేంద్రాన్ని స్థాపించాడు. ప్రస్తుతం ఇక్కడ నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మించబడి ఉంది. నాగార్జున సాగర్ ఆనకట్ట ప్రపంచంలో పొడవైన మానవ నిర్మిత ఆనకట్టగా ప్రసిద్ధిగాంచింది. నాగార్జునసాగర్ ఆనకట్ట కింద 10 లక్షల కంటే అధికమైన ఎకరాల సాగుబడి జరుగుతుంది.

ఈ ఆనకట్ట నిర్మించే సమయంలో త్రవ్వకాలలో బౌద్ధసంస్కృతికి చెందిన శిథిలాల పురాతన అవశేషాలు బయటపడ్డాయి. వెలికితీసిన పురాతన అవశేషాలను సుందరమైన నాగార్జునకొండ మీద బధ్రపరిచారు. ఈ కొండ మానవ నిర్మిత సరస్సుకు కేంద్రంలో ఉంది. పవిత్రమైన బౌద్ధస్థూప అవశేష మిగులు భాగాలను స్థూప, విహారాలు, ఒక విశ్వవిద్యాలయం, పవిత్రమైన బలిపీఠం జాగ్రత్తగా రిజర్వాయర్‌కు తూర్పు భాగంలో ఉన్నాయి.

నాగార్జునకొండ

మానవ నిర్మిత సరస్సు మధ్య మనోహరమైన ద్వీపం ఉంది. నాగార్జునకొండ త్రవ్వకాలలో 2వ 3వ శతాబ్ధానికి చెందిన బౌద్ధసాంస్కృతిక స్థూపం బయటపడ్డాయి.ఈ కొండను చేరటానికి విజయపురి వద్ద ఉన్న జెట్టి అనేప్రదేశంలో బోటు సేవలు లభ్యం ఔతాయి.129 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాదు విమానాశ్రయం నుండి ఇక్కడకు వాయుమార్గంలో ప్రదేశానికి చేరవచ్చు.

చంద్రవంక జలపాతము

ఎత్తిపోతల జలపాతముకు దిగువగా 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుందరమైన కొండచరియలలో చంద్రవంక జలపాతము ఉంది. ఈ జలపాతము పచ్చని కొండల నుండి 21.3 మీటర్ల నుండి కింద ఒక మడుగులోకి పడుతూ ఉంటుంది. ఈ జలపాతాన్ని తరచూ పర్యాటకులు దర్శిస్తుంటారు.

ఈ సుందర జలపాతము 60 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్న చంద్రవంక నది నుండి ప్రవహించే జలాల వలన ఏర్పడింది. ఈ జలపాతం నాగార్జునకొండకు 21 కిలోమీటర్ల దూరంలో తూర్పున ఉంది. అక్కడ ధ్యానంచేసిన ఒక యతీశ్వరుడి వలన ఈ జలపాతానికి ఈ పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో కొన్ని కొండ గుహాలయాలు ఉన్నాయి. ఈ ప్రాంతం వారు ఇక్కడి దైవాలను పూజిస్తూ ఉంటారు. ఈ ప్రాంతం రహదారి మార్గంలో హైదరాబాదు నుండి 150 కిలో మీటర్ల దూరంలో ఉంది విజయపురి సమీపంలో ఉంది.

నందికొండ కోట

నందికొండ అంటే కృష్ణా నదీ తీరంలో ఉన్న చిన్న పల్లెటూరు. ఇది మిరియాలగూడకు 64.37 కిలో మీటర్ల దూరంలో ఉంది. చాలా ప్రముఖమైన ఈ నిర్మాణం ఇక్ష్వాకు వంశానికి చెందిన వారి చేత నిర్మించబడిన కోట. దృఢమైన గోడలు, కందకము, ద్వారాలు, బురుజులు కలిగిన ఈ కోటలో ఒక దీర్ఘచతురస్రాకార రంగస్థలం (స్టేడియం)ఉంది.

పోచంపల్లి

1950 లో ఆచార్యా వినోభాభావే ఇక్కడి నుండి తన ఉద్యమాన్ని ఆరంభించాడు. ఇది బోంగిర్ నుండి 14.48 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే బీబీనగర్ నుండి 9.66 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పిల్లలమర్రి

ఇక్కడ అద్భుతమైన చిత్రాలు, సున్నితంగా చెక్కబడిన స్తంభాలు కలిగిన పురాతన కాకతీయ ఆలయాలు ఉన్నాయి. ఈ చారిత్రాత్మక ప్రదేశం ప్రసిద్ధ కవి అయిన పిల్లల మర్రి పిన వీరభద్రుని పుట్టిన ప్రదేశం.

కొలనుపాక

ఇది హైదరాబాదు నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాలా చారిత్రక ప్రసిద్ధమైనది. ఇది 93.24 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఒకప్పుడు సమృద్ధి కలిగి ఉన్న ప్రదేశం. పాత కోట యొక్క శిథిలాలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి. ఒకప్పుడు ఎ.డి. 11వ శతాబ్దం ఇది కల్యాణి చాళుక్యులకు రెండవ కోటగా ఉన్నప్పుడు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది.

చెర్వుగట్టు

శ్రీపార్వతి జడలరామలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందిన చెర్వుగట్టు దేవస్థానం నల్లగొండ జిల్లా కేంద్రం నుండి 18 కి.మీ దూరంలో వెలిసింది.

ఇంకా కొన్ని ముఖ్య ప్రాంతాలు

[మార్చు]

రాచకొండ, గాజుల కొండ, ఏలేశ్వరం, ఫణిగిరి, భోంగిర్ ఫోర్ట్, మటంపల్లి, వడపల్లి, పంగల్, సుంకి

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]
  • రావి నారాయణరెడ్డి: ఈయన 1908 జూన్ 5 న భువనగిరి మండలంలోని బొల్లేపల్లి గ్రామంలో జన్మించాడు. అప్పటి నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలనపై తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించారు.
  • గవ్వా చంద్రారెడ్డి: వైద్యులు నల్లగొండ జిల్లాకు చెందిన వారు.
  • పెన్నా మధుసూదన్‌: సంస్కృత భాషలో రాసిన ప్రజ్ఞాచాక్షుషం కావ్యానికి 2019లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ప్రస్తుతం కవికుల గురు కాళిదాస్‌ సంస్కృత విశ్వవిద్యాలయానికి (రామ్‌టెక్‌, మహారాష్ట్ర) ఉపకులపతిగా నియమితులయ్యారు.
  • వట్టికోట ఆళ్వారుస్వామి: తెలంగాణ తొలి నవలాకారుడు. ప్రజలమనిషి, గంగు, రామప్ప రభస, పరిసరాలు వీరి కొన్ని రచనలు.
  • నర్రా రాఘవరెడ్డి: నల్లగొండ జిల్లాకు చెందిన నకిరేకల్ నియోజకవర్గానికి ముప్పైసంవత్సరాలకు పైగా శాసన సభ్యులుగా ఎన్నికై ప్రాతినిధ్యం వహించారు
  • నర్రా ప్రవీణ్ రెడ్డి: తెలంగాణ గ్రామ జీవితాన్ని, ఉద్యమాన్ని చిత్రించిన 'పొత్తి' నవల పలుమార్లు కేంద్ర సాహిత్య అకాడెమీ యువపురస్కారానికి పోటీ పడింది. అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్టు నవలా పురస్కారం - 2021, రాజావాసిరెడ్డి ఫౌండేషన్ పురస్కారం, వట్టికోట ఆళ్వారుస్వామి పురస్కారం పొందారు. కాగా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ గోల్డ్ మెడల్, డాక్టరేట్ డిగ్రీ పొందారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Nalgonda.pdf
  2. నల్లగొండ జిల్లా స్వాతంత్ర్య సమర చరిత్ర, రచన సీహెచ్ ఆచార్య, కాటం రమేష్, పేజీ సంఖ్య 167
  3. ఈనాడు, జిల్లా చరిత్ర. "నల్లగొండ జిల్లా చరిత్ర". Retrieved 30 December 2016.[permanent dead link]
  4. పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో నల్లగొండ జిల్లా తాలూకాల వివరాలు Archived 2007-09-30 at the Wayback Machine. జూలై 26, 2007న సేకరించారు.
  5. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 246, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  6. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 247, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  7. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 234, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  8. "జనగామ జిల్లా నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు మారిన గుండాల మండలం".[permanent dead link]
  9. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  10. "TS | కొత్తగా రెవెన్యూ డివిజన్‌గా చండూర్‌ .. మరో రెండు మండలాలు కూడా". Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-09-27. Retrieved 2024-01-30.

బయటి లింకులు

[మార్చు]