Jump to content

పంజాగుట్ట

అక్షాంశ రేఖాంశాలు: 17°26′12″N 78°26′38″E / 17.436793°N 78.443906°E / 17.436793; 78.443906
వికీపీడియా నుండి
పంజాగుట్ట
పంజాగుట్ట ప్లైఓవర్
పంజాగుట్ట ప్లైఓవర్
పంజాగుట్ట is located in Telangana
పంజాగుట్ట
పంజాగుట్ట
తెలంగాణలో ప్రాంతం ఉనికి
పంజాగుట్ట is located in India
పంజాగుట్ట
పంజాగుట్ట
పంజాగుట్ట (India)
Coordinates: 17°26′12″N 78°26′38″E / 17.436793°N 78.443906°E / 17.436793; 78.443906
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
వార్డు5
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికార భాషతెలుగు
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500082
Vehicle registrationటిఎస్
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

పంజాగుట్ట, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ఒక వాణిజ్య, నివాస ప్రాంతం.[1][2] ఇక్కడ ఐటి హబ్‌లు, వస్త్ర, గృహవసరాల, నగల దుకాణాలు ఉన్నాయి. అమీర్‌పేట, బంజారా హిల్స్, సోమాజిగూడ, ఖైరతాబాదు మొదలైన ప్రాంతాల రవాణాకు ప్రధాన రవాణా కేంద్రంగా ఉంది. ఈ జంక్షనులోవున్న జంట ఫ్లైఓవర్లు ట్రాఫిక్ నియంత్రణకు ఉపయోగపడుతున్నాయి.[3]

చరిత్ర

[మార్చు]

హైదరాబాదులోని రెండు విభిన్న ప్రాంతాలను పంజాగుట్ట కలుపుతోంది. దీనికి ఉత్తరం వైపు సికింద్రాబాదు, దక్షిణం వైపు ఓల్డ్ సిటీ ఉన్నాయి. పంజాగుట్ట పహాద్ కు వారసత్వం చరిత్ర ఉంది, ఇది కులీ కుతుబ్ షాహి కాలం నాటిది. పంజాగుట్ట అనగా చేతి పర్వతం అని అర్థం. ఇక్కడికి సమీపంలో ఇమామ్ అలీ చేతి ముద్ర ఉన్న బండరాయి ఉంది. దీన్ని మొదటగా పంజాఘుట్నా అనేవారు, తరువాతికాలంలో పంజాగుట్ట మారింది.

కుతుబ్ షాహి కాలం నాటి జనరల్ హజ్రత్ అలీకి ఈ కొండపై ప్రార్థనలు చేసినట్టు ఒక కల వచ్చింది. దాంతో అతను అక్కడకు వెళ్ళి పరిశీలించగా అతను రాతిపై ఈ అరచేతి, మోకాలి ముద్రను కనుగొన్నాడు. ఈ కొండ పైన ఉన్న ఆలం, అశుర్ఖానా కూడా 400 సంవత్సరాల క్రితం నాటివి.[4]

సమీప ప్రాంతాలు

[మార్చు]

ద్వారకాపురి కాలనీ, ఎర్రమంజిల్, బాలపుర బస్తీ, నిమ్స్ హాస్పిటల్, పంజాగుట్ట మార్కెట్, కేశవ్ నగర్, ప్రతాప్ నగర్, సుల్తాన్-ఉల్-ఉలూమ్ కళాశాల, వద్దారా బస్తీ, జర్నలిస్ట్ కాలనీ, ఎన్‌ఎఫ్‌సిఎల్. నాగర్జున సర్కిల్ మొదలైనవి.

సంస్థలు

[మార్చు]

వ్యాపార కేంద్రాలు

[మార్చు]
  1. హైదరాబాదు సెంట్రల్
  2. జాయ్ అలుక్కస్
  3. కళ్యాణ్ జువెల్లర్స్
  4. జి.ఆర్.టి. జువెల్లర్స్
  5. లలితా జువెల్లర్స్
  6. ఎంపిఎం మాల్
  7. క్రోమా స్టోర్

రవాణా

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి పంజాగుట్టకు బస్సులు నడుపబడుతున్నాయి. హైదరాబాద్ మెట్రోలో భాగంగా ఇక్కడ పంజాగుట్ట మెట్రో స్టేషను ఉంది.[5]

పాద‌చారుల వంతెన

[మార్చు]

పంజాగుట్ట జంక్ష‌న్ అనునిత్యం వాహ‌నాల రాక‌పోక‌ల‌తో ర‌ద్దీగా ఉంటూ, పాద‌చారులు రోడ్డును దాటేందుకు ఇబ్బందులు పడుతున్న సమస్యను దృష్టిలో ఉంచుకొని 5 కోట్ల రూపాయలతో హైద‌రాబాద్ సెంట్ర‌ల్ మాల్ వ‌ద్ద ఏర్పాటు చేసిన ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జి (foot over bridge) నిర్మించబడింది. 2022 మే 11న ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి క‌లిసి ఫుట్ ఓవ‌ర్ బ్రిడ్జిని ప్రారంభించారు.[6]

అంబేద్క‌ర్ విగ్ర‌హం

[మార్చు]

అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా పంజాగుట్ట కూడ‌లిలో డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్క‌రించాడు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు కొప్పుల ఈశ్వ‌ర్, మ‌హ‌ముద్ అలీ, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌, గ్రేట‌ర్ హైద‌రాబాద్ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, కార్పోరేట‌ర్లు, అధికారులు పాల్గొన్నారు.[7][8]

మూలాలు

[మార్చు]
  1. Punjagutta division
  2. Punjagutta Police Archived 5 జనవరి 2015 at the Wayback Machine
  3. Panjagutta flyover opened
  4. Telangana Today, Hyderabad (17 October 2019). "Twitterati dig into Panjagutta's history". Dennis Marcus Mathew. Archived from the original on 16 December 2020. Retrieved 16 December 2020.
  5. "Hyderabad: Panjagutta Metro walkway work trauma for commuters".
  6. telugu, NT News (2022-05-11). "పంజాగుట్ట‌లో పాద‌చారుల వంతెన ప్రారంభం". Namasthe Telangana. Archived from the original on 2022-05-11. Retrieved 2022-05-11.
  7. "KTR: అంబేద్కర్‌ లేకపోతే తెలంగాణ లేదు: మంత్రి కేటీఆర్‌". EENADU. Archived from the original on 2023-04-14. Retrieved 2023-04-15.
  8. telugu, NT News (2023-04-14). "KTR | బీఆర్ అంబేద్క‌ర్ లేక‌పోతే తెలంగాణ లేదు : మంత్రి కేటీఆర్". www.ntnews.com. Archived from the original on 2023-04-15. Retrieved 2023-04-15.