ఘటకేసర్
ఘటకేసర్ | |
---|---|
Coordinates: 17°26′58″N 78°41′07″E / 17.4494°N 78.6853°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మోడ్చల్ |
Metro | ఘటకేసర్ |
Government | |
• Type | పురపాలక సంఘం |
• Body | ఘటకేసర్ పురపాలకసంఘం |
విస్తీర్ణం | |
• Total | 13.83 కి.మీ2 (5.34 చ. మై) |
జనాభా | |
• Total | 28,063 |
• జనసాంద్రత | 2,000/కి.మీ2 (5,300/చ. మై.) |
భాష | |
• అధికారక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ | 501301 |
Vehicle registration | TS 08 XX XXXX |
ఘట్‌కేసర్, తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, ఘటకేసర్ మండలానికి చెందిన గ్రామం.[2] ఇది ఘటకేసర్ మండలానికి పరిపాలనా కేంద్రం.దీనికి తూర్పున రంగారెడ్డి జిల్లా, నల్గొండజిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.ఇది మేజర్ గ్రామ పంచాయతి. తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న ఘటకేసర్ పురపాలకసంఘంగా ఏర్పడింది.[3]
2008 పంచాయతి ఎన్నికలు
[మార్చు]2008 అక్టోబర్ 6 న జరిగిన పంచాయతీ ఎన్నికలలో నలుగురు అభ్యర్థులు బరిలో నిలబడగా నవ తెలంగాణ ప్రజా పార్టీ బలపర్చిన మేకల సుజాత నర్సింగరావు గెలుపొందింది.[4] సుజాత 3840 ఓట్లు సాధించగా, తెలుగుదేశం పార్టీ బలపర్చిన అభ్యర్థి నాగమణికి 2653 ఓట్లు లభించాయి.[5] కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సుజాత దాసుకు 2255 ఓట్లు, విజయలక్ష్మికి 141 ఓట్లు లభించాయి.
ప్రజా పాలన
[మార్చు]- ఘట్‌కేసర్ మండలము 7-మల్కాజ్‌గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది.
- ఘట్‌కేసర్ మండలము 47-ఉప్పల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది.
గ్రామ జనాభా
[మార్చు]2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా మొత్తం 19763, పురుషులు 10167, స్త్రీలు 9596, ఆరు సంవత్సరాల లోపు పిల్లలు 2185, అక్షరాస్యులు 14288.
సమీప గ్రామాలు
[మార్చు]యానంపేట్ 2 కి.మీ., కొండాపూర్ 2 .కి., మీ., ఔషాపూర్ 3 కి.మీ., అంకుష్ పూర్ 4 కి.మీ., కొర్రెముల్ 4 కి.మీ., దూరంలో ఉన్నాయి.
విద్యాసంస్థలు
[మార్చు]- చైతన్య జూనియర్ కాలేజ్, ఘటకేసర్
- గురుకుల్ జూనియర్ కాలేజ్, ఘటకేసర్
- ఆనందజోతి జూనియర్ కాలేజ్, ఘటకేసర్
- శ్రీచైతన్య డిగ్రీ కళాశాల, ఘటకేసర్.
- విజ్ఞాన స్కూల్, ఘటకేసర్,
- అభూపతి హైస్కూల్, ఘటకేసర్
- మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల.ఘటకేసర్.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "District Census Handbook – Karimnagar" (PDF). Census of India. p. 58. Retrieved 6 November 2016.
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 1 April 2021.
- ↑ ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా ఎడిషన్, తేది 07-10-2008.
- ↑ సాక్షి దినపత్రిక, రంగారెడ్డి ఫుల్ అవుట్, తేది 07-10-2008