బృహదారణ్యకోపనిషత్తు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం


బృహదారణ్యకోపనిషత్తు (సంస్కృతం : बृहदारण्यक उपनिषद्) ఉపనిషత్తులలో ప్రాచీనమైనది, ముఖ్యమైనది. ఇది శతపత బ్రాహ్మణములో భాగము, అదే సమయములో దీనిని ఈ బ్రాహ్మణము నుండి సంగ్రహించబడినదని తెలుస్తున్నది. ఇది శుక్ల యజుర్వేదమునకు చెందినది. ముక్తికా సూత్రమునందున్న 108 ఉపనిషత్తులలో ఇది పదవ స్థానమునందు ఉంది. దీనికి ఆదిశంకరాచార్యులు భాష్యము రాశారు.ఇందు శ్వమేధమును గురుంచి చెప్పబడింది. ఆత్మనుండి ప్రపంచము సృష్టి అయినట్లుకలదు. 2వ భాగమందు వేదాంత చర్చలు ఉన్నాయి. బ్రహ్మ శాస్త్రములచే నగమ్యుడనియు, అభ్యాసము వలన బ్రహ్మను కనుక్కొనవచ్చునని తెలుపబడింది. యాజ్ఞవల్క్యజనకులకు జరిగిన చర్చ ఇందు ఉంది. యాజ్ఞవల్క్యుడు బ్రహ్మ యనగ అచ్యుతుడు నిరంజనుడు, నరాకారుడు, అచలుడు అని చెప్పియున్నాడు. జనకునకును యాజ్ఞవల్క్యునకును ఆత్మను గూర్చి చర్చయు, ఇందాత్మకు కల జాగ్రత్ స్వప్న సుషుప్త్యా వస్థలగురుంచి వివరింపబడింది. ఇట్టి గ్రంథము హైందవవాజ్మయమందు లేదనుట అతిశయోక్తి కాదు.యాజ్ఞవల్క్యనకును ఆతని భార్య మైత్రేయికిని జరిగిన సంభాషణము ఇందు గృహమును త్యజించి వాన ప్రస్థమును స్వీకరించుటకు గల విషయములు వర్ణితములు. ఇందు పునర్జన్మ గురుంచి చెప్పబడియున్నది. శుక్లయజుర్వేదములలో పెద్దది చాందోగ్యము, చిన్నది ఏశానోపనిష్యత్తు.

అంశాలు

[మార్చు]


అసతో మా సద్గమయ – అసత్తునుండి సత్తునకు గొనిపొమ్ము.
తమసో మా జ్యోతిర్గమయ – తమస్సునుండి జ్యోతిలోనికి తీసికొని పొమ్ము.
మృత్యోర్మా మమృతం గమయ – మృత్యువు నుండి అమృతత్వమును పొందింపజేయుము..
ఆత్మై వేద మగ్ర ఆసీత్ దేవ ఏవ ... సృష్టికి పూర్వం ఆత్మ ఒకటియే కలదు అంటే ఆదియందు (మొదట) ఆత్మ ఒకటియే ఉంది.
ద్వితీయద్వై భయం భపతి : రెండవ వస్తువు కాని వ్యక్తీకాని యున్నచో భయం కలుగును. (ఆత్మ తప్ప మరియొక వస్తువుకాని, వ్యక్తికాని ఈ ప్రపంచమున లేనందున ఇంక భయమేల కలుగును? కలుగదని భావము.)
ఆత్మ మిక్కిలి ప్రియమైనది. పుత్రునికంటేను, ధనముకంటెను, ఇంకను ఏయే పదార్థములు శ్రేష్టములైనవి కలవో వానికంటేను ఆత్మ ఎంతో ప్రియమైనది. ఆత్మ మన సమీపమందే మన స్వరూపమైయే యున్నది. అనాత్మను ప్రియమణి చెప్పు మనుజునకు, అత్మగ్నని ‘అయ్యా!’ మీరు ప్రియమణి తలంచు పుత్రాదులు నశించునవి కదా! అని చెప్పెను. ఈ సత్యమును తెలుపుటకు అతడోకడే సమర్ధుడు. అనాత్మరూపమైన దానికి అస్తిత్వము లేదు. అవిద్యచే వున్నట్లు కన్పించును. కావున ఆత్మ యను ప్రియవస్తువునే ఉపాసించవలయును. ఆత్మను ప్రియమని ఉపాసించువాని ఆనందము ఎప్పటికిని నశించదు.
సృష్టికి పూర్వము ఈ ప్రపంచము బ్రహ్మముగా నుండెను. బ్రహ్మము ‘నేనే బ్రహ్మమునై యున్నాను’ అని తలంచెను. కావున అది సమస్తమును అయినది.
ఎవడు తన అత్మకంటే వేరైనా దేవత కలదనియు, అది వేరు, తానూ వేరు అనియు భావించి అన్యదేవతోపాసన చేయుచున్నాడో అతడు అవివేకి.
ఎవడీ ప్రపంచమున తన స్వరూపమే అయియున్న ఆత్మ నెరుగక మృతినొందునో, అతనిని ఆత్మ (బ్రహ్మము) రక్షింపదు.అధ్యయనము చేయబడని వేదము మనుజుని రక్షింపనట్లు ఆత్మ అతనిని రక్షింపదు. కాబట్టి ఆత్మ నెరుగని వాడెట్టి మహత్తర పుణ్య మాచరించినప్పటికిని అది ఫలానుభోగాంతమున నశించిపోవును. కావున ఆత్మను తన ప్రపంచమని ఉపాసించవలయును. అట్టివానికి కర్మము అంటదు. ఇట్టి అత్మజ్ఞాని ఏదేది ఇచ్చగించునో, అదన్తయు ఆత్మచే ప్రాప్తమగును.
కామము, సంకల్పము, సంశయము, శ్రద్ధ, అశ్రద్ధ, ధైర్యము, అధైర్యము, లజ్జ, బుద్ధి, భయము – ఇవి అన్నియు మనస్సే (మనో రుపములే) అయియున్నవి.
(యాజ్ఞవల్క్యుడు – ఓ మైత్రేయి) భార్య తన భర్త యొక్క ప్రయోజనము నిమిత్తము ప్రియమైయుండుట లేదు. తన ఆత్మ యొక్క ప్రయోజనము నిమిత్తము ప్రియముగా నున్నది. అట్లే భర్త తన భార్యయందును, తండ్రి కుమారునియందును ఆ విధముగా సమస్తమును ఆత్మకోరకే కాని వేరుకాదు. ఆత్మయే చూడదగినది; ఆత్మయే వినదగినది; ఆత్మయే తలంచదగినది; ఆత్మయే ద్యానింపదగినది. ఆత్మయొక్క దర్శనము చేతను, స్మరణము చేతను, ధ్యానము చేతను సమస్తము బోధపడును.
ఆ ఆత్మయే (విశ్వాత్మయే, బ్రహ్మమే) ఈ ఆత్మ (జీవాత్మ). అది సమస్త ప్రానులకును అధిపతి. బండిచక్రముయొక్క నాభియందు అరములు (ఆకులు) గ్రుచ్చబడియున్నట్లు ఈ ఆత్మయందు సమస్తప్రానములు, సమస్త లోకములు, సమస్త దేవతలు, సమస్త భూతములు గ్రుచ్చబడియున్నవి.
ఆత్మ జలమువలె స్వచ్ఛమై, ఏకమై, ద్రష్టమై, అద్వైతమై యున్నది. అదియే బ్రహ్మలోకము, అనగా పరబ్రహ్మస్థానము. అదీ జీవునకు ఉత్తమగతి. అదియే సమస్త సంపదలకంటెను శ్రేష్టమైనది. అదియే పరమానందము. ఈ ఆనందముయొక్క ఒక్క అంశమున ఆధారపరచుకొని సమస్త ప్రానులును జీవించియున్నవి.
మనుజులలో ఎవడు సకల భోగములు అనుభావించుచు ఏదియు కొరతలేక యున్నదో, అందరికిని యజమానుడై యున్నాడో అట్టివాని ఆనందము ఒక్క మనుష్యానందమని చెప్పబడింది. దానికి నూరు రెట్లు కలది ఒక పితరుల ఆనందము. దానికి నూరింతలు కలది ఒక కర్మ దేవతల ఆనందము. దానికి నూరింతలు కలది ఒక ఆజానదేవతల ఆనందము.వేదాధ్యమును చేసినవాడును, పాపరహితుడును, కోరికలు లేనివాడును అజ్జనుదేవతల ఆనందముతో సమానమైన ఆనందము కలవాడై యుండును. ఆ ఆనందమునకు నూరు రెట్లదికమైన ఒక ప్రజాపతి ఆనందము. దానికి నూరు రెట్లు అధికమైనది బ్రహ్మానందము. శ్రోత్రియుడును, అకాముడును, పాపరహితుడను అగు మనుజుడు అట్టి బ్రహ్మానందమును అనుభవించుచున్నాడు. అదియే పరమానందము. ఈ పరమానందమే బ్రహ్మలోకము (పరబ్రహ్మ స్థానము) – అని యాజ్ఞవల్క్యుడు జనక మహారాజునకు బోధించెను.
జీవులలో సాధుకర్యము చేయువాడు సాధువైయుండును, పాపము చేయువాడు పాపియై యుండును, పుణ్యము చేయువాడు పుణ్యశాలియై యుండును. కావున జీవుడు పుణ్యపాపములకు తగిన శరీరమును గ్రహించుటకు కారణమైనవాడుగా నున్నాడు. ఎపుడతనికి ఒక సంకల్పము కలుగునో అపుడు ఒక నిశ్చయబుద్ధి కలుగుచున్నది. ఎపుడు నిశ్చయబుద్ధి కలుగునో, అపుడు కర్మము చేయనారంబించెను. తదుపరి ఆ కర్మఫలము అనుభావించవలసియున్నది.
జ్ఞాని అకాముడు, నిష్కాముడు, ఆప్తకాముడు, ఆత్మ కాముడు (ఆత్మకంటె వేరుగా మరొకదానిని కోరనివాడు). అట్టి వాణి ప్రాణములు ఎచటికిని పోవుటలేదు. అతడు ఇచటనే బ్రహ్మ స్వరూపుడగుచున్నాడు.
ఎపుడు జీవుని హృదయమందు కోరిక లన్నియు నశించి పోవునో, అపుడు మనుజుడు అమ్రుతుడగుచున్నాడు. ఇచటనే బ్రహ్మమును పొందుచున్నాడు.
అవిద్యను (అజ్ఞానమును) ఉపాసించువారు మనస్సును (అంధకారబందుర్గమగు సంసారమును) పొందుదురు. అజ్ఞానులు తమస్సుతోగూడిన లోకమున పొందుదురు.
అత్మసాక్షాత్కారమును బడసినవాడు విశ్వకృత్తు. అనగా సమస్తము అతని లోకమే (సమస్త లోకములు ఆత్మయందు కల్పింపబడి యుండుటవలన.
ఈ ప్రపంచమున మనము సాధనచే బ్రహ్మత్వమొందినవారము. లేనియెడల మహాకష్టము కలుగును. బ్రహ్మవిద్యచే మోక్షము కలుగును. అదిలేనిచో దుఃఖము కలుగును.
కలిగినట్టియు, కలుగబోవునట్టియు సమస్తమునకు అధిపతియైన పరమాత్మను ఎపుడు జీవుడు సాక్షాత్కరించుకోనుచున్నాడో అపు డాతడు ఇక దేనికిని భయపడవలసిన పనిలేదు.
నిర్మలమైన మనస్సుచేతనే ఆ బ్రహ్మము చూడదగును (సక్షాత్కారింపదగును).ఇచట అనేకత్వము ఒకింతైనను లేదు. సమస్తము బ్రహ్మమే.ఎవడించట అనేకత్వము చూచునో, అతడు ఒక ఒక మృత్యువు నుండి మరియొక మృత్యువును పొందును. (జనన మరణ రూప సంసారమున దగుల్కొనును).
ఈ బ్రహ్మమును ఈకముగా చూడవలెను. అది అప్రమేతమైనది; ధ్రువమైనది; నిత్యమైనది; మాలిన్యరహితమైనది. ఆకాశము కంటే సూక్ష్మమైనది.జన్మము లేనిది. సర్వ శ్రేష్టమైనది.నాశరహితమైనది.
ఇట్టి ఆత్మను (బ్రహ్మమును) దీరుడగు బ్రహ్మజ్ఞాని ఎరిగి ప్రజ్ఞను బడయవలెను. అనేక శబ్దములను ధ్యానింపరాదు. ఎలాయనిన అధిక శబ్దములు వాక్కునకు శ్రమయే యగును.
ఇట్టి ఆత్మనుగూర్చి వేదఋక్కుచే స్పస్టముగా చెప్పబడి యున్నది. ఆ ఆత్మ నిత్యమైనది. బ్రహ్మవేత్తయెక్క మహిమ అయి ఉంది. అది పుణ్య కర్మచే వ్రుద్దినిగాని, పాపకర్మచే క్షీణత్వమును గాని పొందుటలేదు. దాని మహిమ నేరింగినవాడు ఇక శాంతుడు. ఇంద్రియ నిగ్రహము కలవాడు, ఉపరతువు, తితిక్షువు, ఏకాగ్రచిత్తుడు. ఇతి సల్లక్షణములతో గూడి ఆ మహనీయుడు తనయందే ఆత్మను దర్శించుచున్నాడు.సమస్తమును ఆత్మగా చూచుచున్నాడు. అతనిని పాపపుణ్యములు అంటవు.అతడు పాపపుణ్యములను దాటుచున్నాడు.అతనిని కృతాకృత కర్మలు బాధించవు.అట్టి కర్మల నతడు భస్మముచేస్తున్నాడు. అతడు పాపరహితుడై, విరజ్జుడై, ఇచ్చారహితుడై, సంశయవర్జితుడై, బ్రహ్మము నేరింగినవాడై యుండు ఇదియే బ్రహ్మలోకము (అంటే ఇప్పుడు వున్నది మనము అంతయు పరమాత్మా లోకము) – అని యాజ్ఞవల్క్యుడు జనక మహారాజునకు బోధించెను.
ఈ ఆత్మ మహత్తరమైనది, జన్మరహితమైనది, వార్ధక్యములేనిది, మరణము లేనిది, అమృతమైనది, అభయమైనది. ఇట్లేరుగువారు ఆ అభయ బ్రహ్మమే (ఆత్మయే) అగుచున్నాడు.

ధనము చేత (సంపదల చేత) అమృతత్వము (మోక్షము) లభింపదు. లభించునను ఆశ వ్యర్ధన. అది ఒక్క సాధన ( ధ్యానము) ద్వారా మాత్రమే లభింపబడుతుంది.

మూలములు

[మార్చు]