కుంభమేళా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కుంభ మేళా
కుంభ మేళా
2001 అలహాబాదువద్ద కుంభ మేళా
అధికారిక పేరుకుంభమేళా
జరుపుకొనేవారుహిందువులు
రకంహిందూమతము
ప్రారంభంపూజ పూర్ణిమ
ముగింపుమాఘ పూర్ణిమ
గంగా, యమునా, సరస్వతి నదులు సంగమమై భక్తులు అనేక పూజాపునస్కారాలు నిర్వహించే త్రివేణి సంగమం.

కుంభ మేళా (దేవనాగరి: कुम्भ मेला) అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కౄతీ పరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర.

సాధారణ కుంభ మేళా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగలలో జరుగుతుంది.[1]

పూర్ణ కుంభ మేళా అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి[2] ప్రయాగ, (అలహాబాద్), హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లలో జరుగుతుంది. పన్నెండు పూర్ణ కుంభ మేళాలు పూర్తి అయిన తరువాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్ లో మహా కుంభ మేళా నిర్వహించబడుతుంది.[2][3][4]

జనవరి 2007లో చివరగా ప్రయాగలో 45 రోజుల పాటు జరిగిన అర్ధ కుంభ మేళాలో 17 మిలియన్ లకు పైగా హిందువులు హాజరవగా అన్నింటిలోకి పవిత్రంగా భావించే మకర సంక్రాంతి అయిన జనవరి 15 ఒక్క రోజే 5 మిలియన్ లకు పైగా హాజరయ్యారని ఒక అంచనా.[5]

2001లో జరిగిన చివరి మహా కుంభ మేళాకు దాదాపు 60 మిలియన్ లకు పైగా ప్రజలు హాజరయ్యారు. ఎటువంటి సందర్భంలోనైనా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం.[6][7][8][9]

కుంభమేళా ఆవిర్భావము, సమయాలు

[మార్చు]

కుంభ అనేది కుండకు సంస్కృతంలో సమానమైన అర్ధం గల పదం. దీనికే కలశం అనే అర్ధం కూడా ఉంది. భారత ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని కూడా సూచిస్తుంది. ఈ రాశి లోనే ఈ పండుగను నిర్వహిస్తారు. మేళా అంటే కూటమి, కలయిక లేక జాతరగా భావించవచ్చు.

అనేక మంది హిందూ యాత్రికులు గంగా నది వద్దకు చేరుకొని చేసే వేడుకయే కుంభ మేళా. సూర్యుడు, బృహస్పతి (జూపిటర్) గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది. సూర్యుడు, బృహస్పతి సింహ రాశిలో ఉన్నప్పుడు ఈ కుంభ మేళాను నాసిక్ లోని త్రయంబకేశ్వర్ లోను, సూర్యుడు మేష రాశిలో ఉన్నప్పుడు హరిద్వార్ లోను, బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభ మేళాను ప్రయాగ లోను, బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోను నిర్వహించడం జరుగుతుంది.[10][11] ప్రతి స్థలం లోను కుంభ మేళా నిర్వహించే తేదీలను సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయించడం జరుగుతుంది.[12]

చారిత్రక విశేషాలు

[మార్చు]
సముద్రమథనంలో క్షీర సాగరాన్ని చిలుకుతుండగా వాసుకి చుట్టి వున్న మందర పర్వతం కింద కూర్మ అవతారంలో ఉన్న మహా విష్ణువు. 1870 నాటి పెయింటింగ్.
1850లో హరిద్వార్ లో జరిగిన కుంభమేళా

629-645 మధ్య హర్షవర్ధనుడి కాలంలో భారత దేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్ త్సాంగ్ లేక గ్జుయాన్జాంగ్ యొక్క రచనలలో మొదటగా కుంభ మేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది.[13][14][15] అయితే నదీ సంబంధిత పండుగలు నిర్వహించడం ప్రారంభమైన ప్రాచీన భారత వేద కాలం నుండే ఈ మేళాను నిర్వహించే ఆచారం ఉన్నట్లు భావిస్తున్నారు. హిందూ పురాణాలను గమనిస్తే పురాణ గాథలలో, హిందూ సిద్ధాంతాలలో, క్షీర సాగర మధన సందర్భంలో, భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో, మహా భారతంలో, రామాయణం లో కుంభ మేళాకు సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది.[16]

పురాణాలను పరికిస్తే దేవతలు తమ శక్తీని పోగొట్టుకుని దానిని తిరిగి పొందడం కోసం అమృతాన్ని సంపాదించాలని క్షీర సాగర (పాల సముద్రం) మధనానికి పూనుకుంటారు. దీనికి గాను వీరు అమృతం లభించాక చెరి సగం తీసుకోవాలనే ఒప్పందంతో తమ శత్రువులైన అసురుల లేక రాక్షసుల సహాయం కోరతారు.[17] అయితే అమృతాన్ని కలిగి ఉన్న కుంభం (కుండ) కనబడగానే పోట్లాట మొదలవుతుంది. పన్నెండు రాత్రులు, పన్నెండు పగళ్ళు పాటు (మనుషుల దృష్టిలో పన్నెండు సంవత్సరాలు) దేవతలు రాక్షసుల మధ్య అమృతపు కుండ కోసం భీకర పోరు జరుగుతుంది. ఈ యుద్ధ సమయంలో మహా విష్ణువు ఈ అమృతపు కుంభాన్ని తీసుకుని పారిపోతూ ప్రయాగ, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లలో కొన్ని అమృతపు బిందువులు చిలకరించాడని నమ్ముతారు.[18]

యాత్రిక సంఖ్య,ఏర్పాట్లు

[మార్చు]

ఇంపీరియల్ గెజట్ ఆఫ్ ఇండియా ప్రకారం హరిద్వార్లో 1892లో జరిగిన కుంభ మేళాలో పాల్గొన్నవారికి పెద్ద ఎత్తున కలరా సోకడం వలన తరువాతి కాలంలో అక్కడి అధికారులు నిర్వహణా ఏర్పాట్లను మెరుగు పరచడం, హరిద్వార్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ ఏర్పాటు కావడం జరిగింది. 1903 దాదాపు నాలుగు లక్షల మంది కుంభ మేళాకు హాజరైనట్లు తెలుస్తుంది.[11] 1954లో అలహాబాద్ లో జరిగిన కుంభ మేళాలో తొక్కిసలాట జరిగి దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోవడమే కాక అనేక మంది గాయపడడం కూడా జరిగింది. 1998 ఏప్రిల్ 14లో హరిద్వార్ లో జరిగిన కుంభ మేళాకు పది మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు.[13]

గంగా నది స్నానమాచారించేందుకు గాను 1998లో హరిద్వార్ కుంభ మేళాకు పది మిలియన్ లకు పైగా ప్రజలు హాజరయ్యారు.[19] 2001లో ప్రయాగ (అలహాబాద్) లో జరిగిన మహా కుంభ మేళాకు మొత్తం దాదాపుగా అరవై మిలియన్ల మంది హాజరు కాగా దాదాపు ఒక మిలియన్ పైగా ప్రజలు ప్రపంచం అంతటా ఉన్న ఇతర దేశాల నుండి హాజరు కావడం జరిగింది. ఆయా గ్రహస్థితుల ఆధారంగా జరిగే ఈ అరుదైన మేళా 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నిర్వహించడం జరుగుతుంది.[20]

ఆచార వ్యవహారాలు

[మార్చు]

ఎక్కడైతే ఈ మేళా నిర్వహించడం జరుగుతుందో అక్కడ నదీ జలాలతో పవిత్ర స్నానం ఆచరించడం అనేది ఈ పండుగ సందర్భంగా పాటించే అతి ముఖ్యమైన ఆచారం.ఇప్పటి వరకు అత్యధికంగా నాసిక్ లో నిర్వహించిన కుంభ మేళాకు 75 మిలియన్ లకు పైగా ప్రజలు హాజరయ్యారు. మతపరమైన చర్చలు, ఆధ్యాత్మిక గానాలు, పేదలకు, సన్యాసులకు అన్నదానాలతో పాటు మతం యొక్క ఆచార వ్యవహారాలను గూర్చి మత పెద్దల మధ్య జరిగే చర్చలు ఈ మేళాలో జరిగే కార్యక్రమాలు. అన్ని యాత్రా స్థలాలలోకీ కుంభ మేళాను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.[ఆధారం చూపాలి] వేల సంఖ్యలో సాధువులు, సన్యాసులు హాజరవడం ఈ మేళాకు ఒక ప్రత్యేకతను సంతరించి పెట్టింది. పురాతన సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ సాధువులు కాషాయ వస్త్రధారులై వొళ్ళంతా వీబూది రాసుకుని కనిపిస్తారు. నాగ సన్యాసు లని పిలవబడే కొందరు సాధువులు శీతాకాలంతో సహా అన్ని కాలాల్లోను దిగంబరులై కనిపిస్తారు.[ఆధారం చూపాలి]

1895లో కుంభ మేళాను సందర్శించిన మార్క్ ట్వైన్ ఇలా రాసారు:

It is wonderful, the power of a faith like that, that can make multitudes upon multitudes of the old and weak and the young and frail enter without hesitation or complaint upon such incredible journeys and endure the resultant miseries without repining. It is done in love, or it is done in fear; I do not know which it is. No matter what the impulse is, the act born of it is beyond imagination, marvelous to our kind of people, the cold whites.[21]

ఇటీవలి కుంభ మేళాలు

[మార్చు]
2001 లో అలహాబాద్ లో జరిగిన కుంభమేళాలో గంగా నది పైన నిర్మించిన వంతెనను దాటుతున్న అఖరాలు

పరమహంస యోగానంద రచించిన ఒక యోగి ఆత్మ కథ అనే పుస్తకం ప్రకారం 1894 జనవరిలో ప్రయాగలో జరిగిన కుంభ మేళా లోనే ఆయన గురువు శ్రీ యుక్తేస్వరులు మొదటి సారిగా మహావతార్ బాబాజీను కలుసుకున్నారు.[22]

2001లో కుంభ మేళాను ప్రయాగలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 60 మిలియన్ లకు పైగా ప్రజలు పవిత్ర గంగా నదిలో స్నానమాచారించారని అంచనా.

2003లో జూలై 27 నుండి సెప్టెంబరు 7 మధ్య నాసిక్ లో నిర్వహించిన కుంభ మేళాలో మొత్తం 39 మంది (28 మహిళలు, 11 మంది పురుషులు) చనిపోగా 57 మంది వరకు గాయపడ్డారు. ఆ సమయంలో అనేక మంది భక్తులు మహా స్నానం లేక పవిత్ర స్నానం ఆచరించేందుకు గోదావరి నది వొడ్డున వేచి ఉన్నారు. సాధువులు మొదట స్నానం ఆచరించేందుకు వీలుగా దాదాపు ముఫై వేల మంది భక్తులను రామకుండ్ అనే పవిత్ర ప్రదేశానికి వెళ్ళే ఇరుకు రోడ్డు లోకి నెట్టి బారికేడ్ లను అడ్డంగా ఉంచడం జరిగింది. ఆ సమయంలో ఒక సాధువు కొన్ని వెండి నాణాలను విసరడం వల్ల జరిగిన తోపులాట తొక్కిసలాటకు దారితీసిందని తెలుస్తుంది.[23][24]

ప్రయాగలో (దీనికే అలహాబాద్ అనేది మరో పేరు) జరిగిన అర్ధ కుంభ మేళాకు దాదాపు 30 మిలియన్ లకు పైగా ప్రజలు హాజరయ్యారు.

మకర సంక్రాంతితో (2010 జనవరి 14) ప్రారంభించి శాఖ పూర్ణిమా స్నానం (2010 ఏప్రిల్ 28) వరకు జరిగే పూర్ణ కుంభమేళాకు హరిద్వార్ ఆతిధ్యం ఇచ్చింది. మిలియన్ ల కొద్దీ హిందూ యాత్రికులు ఈ మేళాకు హాజరు కావడం జరిగింది. ఒక్క ఏప్రిల్ 14 వ తేది నాడే దాదాపు 10 మిలియన్ ప్రజలు గంగా నదిలో స్నానం ఆచరించడం జరిగింది.[25] అధికారిక లెక్కల ప్రకారం 2010 జనవరి 14 నుండి దాదాపు 40 మిలియన్ లకు పైగా ప్రజలు గంగలో స్నానమాచరించినట్లు తెలుస్తుంది.[26] ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యే మత వేడుకగా పిలిచే కుంభ మేళాకు భారతీయులతో పాటు విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతారు.[26][27] ఇంత పెద్ద సంఖ్యలో వెళుతున్న భక్తుల సౌకర్యార్ధం భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్ళను కూడా నడిపింది.[28] సాధువులకు, భక్తులకు మధ్య జరిగిన గొడవ వల్ల సంభవించిన తొక్కిసలాటలో ఐదుగురు వ్యక్తులు చనిపోవడం కూడా జరిగింది.[29]

భవిష్యత్తులో ఈ వేడుకులను మరింత సమర్దవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ హాజరైన ప్రజానీకం యొక్క శాటిలైట్ ఫోటోలను తీసుకోవడం జరిగింది.[30]

రాబోయే కాలంలో కుంభ మేళా వేదికలు

[మార్చు]
  • 2013 లో (జనవరి 27 నుండి ఫిబ్రవరి 25 వరకు) ప్రయాగలో తిరిగి పూర్ణ కుంభమేళా వేడుకలు జరగనున్నాయి.
  • 2015 (ఆగస్టు 15 నుండి సెప్టెంబరు 13 వరకు) లో జరగనున్న అర్ధ కుంభమేళాకు నాసిక్ ఆతిధ్యం ఇవ్వనుంది.
  • 2016 (ఏప్రిల్ 22 నుండి మే 21 వరకు- దీనినే ఉజ్జయినిలో సింహస్త్ అంటారు) లో పూర్ణ కుంభమేళా ఉజ్జయినిలో జరుగుతుంది.

మీడియాలో కుంభ మేళా

[మార్చు]

1982 దిలీప్ రాయ్ తీసిన బెంగాలి సినిమా అమ్రిత కుమ్భేర్ సంధానేలో కుంభమేళాను చూపించడం జరిగింది. 70 మిలియన్ లకు పైగా ప్రజలు హాజరైన కుంభమేళా భగవంతుని పై ప్రజలకు ఉన్న విశ్వాసానికి ప్రతీక అంటూ హిందూ పత్రిక సెప్టెంబరు 24న ప్రచురించింది. 2001లో మారిజియో బెనజో, నిక్ డే[31][32]లు తీసిన కుంభమేళా:ది గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్ [33] అనే డాక్యుమెంటరీతో పాటు నదీం ఉద్దిన్[34] యొక్క కుంభమేళా: సాంగ్స్ ఆఫ్ ది రివర్ (2004), ఇన్వొకేషన్, కుంభమేళా (2008) [35] వంటి అనేక డాక్యుమెంటరీలకు కుంభమేళానే కథ అంశంగా ఉంది.

అనేక బాలీవుడ్ సినిమాలలో ఆయా పాత్రలు తమ కవల సోదరి లేక సోదరున్ని కుంభమేళాలోనే పోగొట్టుకున్నట్లు సరదాగా చూపించడం జరిగింది.[ఆధారం చూపాలి] "హం బచ్పన్ మే కుంభ కే మేళా మే ఖో గయే థే" అనేది హిందీ భాషలో సాధారణంగా వాడే వాక్యం. గతంలో లాగే ఇటీవల సినిమాలలో కూడా ఈ తప్పిపోవడం, తిరిగి కలుసుకోవడం వంటి కదలనే పారడీగా తీయడం జరుగుతుంది.

ది CBS సండే మార్నింగ్ అనే ఒక ప్రముఖ అమెరికన్ మార్నింగ్ షో 2010 ఏప్రిల్ 18న హరిద్వార్ కుంభ మేళాను ప్రపంచంలోనే "అత్యధిక సంఖ్యలో యాత్రికులు హాజరయ్యే మత కార్యక్రమం"గా అభివర్ణించింది. భూమి పై అత్యద్భుతంగా నమ్మకాన్ని వ్యక్తీకరించే ఒక కార్యక్రమం గాను, పదుల మిలియన్ ల సంఖ్యలో యాత్రీకులను ఆకర్షించే అద్భుత ప్రయాణం గాను కుంభమేళాను ఈ షో అభివర్ణించింది.

ఏప్రిల్ 28,2010న BBC కుంభమేళా "గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్" పేరుతో కుంభమేళా పై ఒక ఆడియో, వీడియో రిపోర్ట్ ను వెలువరించింది.

వీటిని కూడా పరిశీలించండి

[మార్చు]

మరింత చదవటానికి

[మార్చు]
  • సుబాస్ రాయ్ రచించిన కుంభమేళా:హిస్టరీ అండ్ రెలిజియన్, ఆస్ట్రానమి , కాస్మోబయాలజీ గంగా కావేరి పబ్లిషింగ్ హవుస్ చే ప్రచురితము, 1993 ISBN 0-691-06962-X.
  • మార్క్ టుల్లీ (రచయిత), రిచర్డ్ లాన్నో (ఫోటోగ్రాఫర్) అశోక్ మహేంద్ర (ఫోటోగ్రాఫర్) ల యొక్క ది కుంభమేళా ఇండికా బుక్స్ 2002. ISBN 81-86569-22-7.
  • జాక్ హేబ్నేర్ రాసిన కుంభమేళా ట్రాన్సిషన్ వెండర్ ప్రచురణ, 2003 ISBN 1-886069-90-5.
  • గోవింద్ స్వరూప్ రాసిన నాసిక్ కుంభమేళా: ఎ స్పిరిచుయల్ సోజర్న్ ఇండియా బుక్ హౌస్ లిమిటెడ్ 2006 ISBN 81-7508-379-4.
  • కామా మక్లెన్ రాసిన పిలిగ్రిమేజ్ అండ్ పవర్: ది కుంభమేళా ఇన్ అలహాబాద్, 1765-1954 ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, USA. 2008. ISBN‌ 0-385-14348-6.

సూచనలు

[మార్చు]
  1. ఫిబ్రవరి 08,1960 న TIME లో వచ్చిన The Urn Festival Archived 2010-10-08 at the Wayback Machine.
  2. 2.0 2.1 జే.సి.రోడ్ద,లుసియో ఉబెర్టిని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హైడ్రలాజికల్ సైన్సెస్, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ వాటర్ రిసోర్స్ సిస్టమ్స్ (ఇటలీ)కుంభమేళా ది బేసిస్ ఆఫ్ సివిలిజేషన్- వాటర్ సైన్సు?:వాటర్ సైన్సు? ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హైడ్రలాజికల్ సైన్సు వారిచే ప్రచురితము 2004 ISBN 1-901502-57-0 పేజి 165 .
  3. indianembassy.org లో ది మహా కుంభమేళా 2001 Archived 2010-04-03 at the Wayback Machine
  4. kumbhamela.net లో కుంభమేళా తేదీలు
  5. జనవరి 15, 2007 వాషింగ్టన్ పోస్ట్ లోని మిలియన్స్ ఆఫ్ హిందుస్ వాష్ అవే దైర్ సిన్స్ అనే వ్యాసం
  6. జనవరి 3, 2007 న బిబిసి న్యూస్ లో వచ్చిన మిలియన్స్ బాత్ ఎట్ హిందూ ఫెస్టివల్ కార్యక్రమం.
  7. అంతరిక్షం నుండి తీయబడిన కుంభమేళా ఫోటోలు-బహుశా ప్రపంచ చరిత్రలో ఇంత మంది మనుషులు ఒక చోట కూడిన సందర్భం ఇదే కావచ్చు. బిబిసి న్యూస్ , జనవరి 26,2001
  8. కుంభమేళా:అతి పెద్ద మతకార్యక్రమం- ఫోటోలు:కరోకి లేవిస్ యొక్క కుంభమేళా Archived 2010-05-29 at the Wayback Machine ది టైమ్స్ , మార్చ్ 22,2008
  9. కుంభమేళా - 25 జనవరి 2001 - న్యూ సైంటిస్ట్
  10. డేల్ హోయిబెర్గ్ , ఇందు రామచందని ల కుంభమేళా స్టూడెంట్స్' బ్రిటానికా ఇండియా పాపులర్ ప్రకాషన్ ప్రచురణ, 2000. ISBN‌ 0-385-14348-6.పేజి 259-260 .
  11. 11.0 11.1 హరిద్వార్ ది ఇంపీరియల్ గజేటీర్ ఆఫ్ ఇండియా, 1909, v. 13, p. 52.
  12. కుంభమేళ 'Britannica.com.
  13. 13.0 13.1 కుంబ్ మేళ - టైం లైన్ హిందూయిజం టుడే మాగజైన్ ఎడిటర్ లచే వాట్ యీజ్ హిందూయిజం?: మోడరన్ అడ్వెంచర్స్ ఇంటు ఎ ప్రొఫౌండ్ గ్లోబల్ ఫైత్ హిమాలయన్ అకాడెమి పబ్లికేషన్స్ ప్రచురణలు, 2007. ISBN 1-934145-00-9. 242-243 .
  14. కుంభమేళా Archived 2009-07-27 at the Wayback Machine http://www.archaeologyonline.net.
  15. కుంభమేళా ఛానల్ 4.
  16. రామాయణ, బుక్ I; కాన్టో: XLV - ది క్వెస్ట్ ఫర్ ది అమ్రిత్ రామాయణ ఆఫ్ వాల్మీకి .
  17. ది హోలీఎస్ట్ డే ఇన్ హిస్టరీ Archived 2010-10-22 at the Wayback Machine టైం , జనవరి 31, 1977.
  18. Urn Festival Archived 2011-01-31 at the Wayback Machine TIME , మే 1, 1950.
  19. "Kumbh Mela, a study". Missouri State University.
  20. "Maha Kumbh Mela concludes". The Hindu. Archived from the original on 2010-10-19. Retrieved 2010-10-01.
  21. Mark Twain, "Following the Equator: A journey around the world"
  22. పరమహంస యోగానంద ఆత్మ కథలోని 36 వ అధ్యాయముపరమహంస యోగానంద యొక్క ఒక యోగి ఆత్మా కథ వికీసోర్స్
  23. 39 కిల్డ్ ఇన్ కుంభమేళా స్టంపేడ్ Archived 2008-11-04 at the Wayback Machine ది హిందూ , ఆగష్టు 28, 2003
  24. హోలీ మాన్స్ గిఫ్ట్ బ్లేమ్ద్ ఫర్ 39 డెడ్ ఇన్ స్టంపేడ్ ది గార్డియన్ , ఆగష్టు 28, 2003.
  25. Yardley, Jim; Kumar,Hari (2010-04-14). "Taking a Sacred Plunge, One Wave of Humanity at a Time". The New York Times. Retrieved 15 April 2010.
  26. 26.0 26.1 మిలియన్స్ డిప్ ఇన్ గాంజెస్ అట్ వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టివల్, ఏజెంస్ ఫ్రాన్స్-ప్రెస్, 2010-04-13
  27. ఫారినర్స్ జాయిన్ హ్యూజ్ క్రౌడ్స్ అట్ ఇండియాస్ హోలీ రివర్ ఫెస్టివల్ Archived 2010-07-02 at the Wayback Machine, ది గజెట్ (మాన్త్రేల్), 2010-04-14
  28. "More trains during Kumbh Mela". The Times of India. 2010-04-11. Retrieved 16 April 2010.
  29. ఫైవ్ డై ఇన్ స్టంపేడ్ అట్ హిందూ బాతింగ్ ఫెస్టివల్, బిబిసి, 2010-04-14
  30. ఇస్రో టేకింగ్ శాటిలైట్ పిక్చర్స్ ఆఫ్ మహా కుంభమేళా Archived 2010-04-16 at the Wayback Machine, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, 2010-04-13
  31. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Short Cut to Nirvana
  32. మేళా సినిమాలు
  33. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Kumbh Mela: The Greatest Show on Earth
  34. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Kumbh Mela: Songs of the River
  35. ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో Invocation, Kumbha Mela

బాహ్య లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కుంభమేళా&oldid=4321667" నుండి వెలికితీశారు