తెలంగాణ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ ఎక్స్‌ప్రెస్
Telangana Express
సారాంశం
రైలు వర్గంసూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
స్థానికతతెలంగాణ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే
మార్గం
మొదలుహైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషను
గమ్యంన్యూ ఢిల్లీ రైల్వే స్టేషను
ప్రయాణ దూరం1,677 కి.మీ. (1,042 మై.)
సగటు ప్రయాణ సమయం26 గం. 30 ని.
రైలు నడిచే విధంప్రతిరోజు
రైలు సంఖ్య(లు)12724 / 12723
సదుపాయాలు
శ్రేణులుఎసి ఫస్ట్ క్లాస్, ఎసి టూ టైర్, ఎసి త్రీ టైర్, స్లీపర్, ప్యాంట్రీ, జనరల్
కూర్చునేందుకు సదుపాయాలుఉంది
పడుకునేందుకు సదుపాయాలుఉంది
ఆహార సదుపాయాలుఉంది
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం63.28 km/h (39.32 mph) సగటుతో చేరుతుంది
మార్గపటం

బండి సంఖ్య 12723/12724 తెలంగాణ ఎక్స్‌ప్రెస్ (Telangana Express) (పూర్వపునామం "ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్") భారత రైల్వే యొక్క దక్షిణ మధ్య రైల్వే నడుపుచున్న ఒక ఎక్స్‌ప్రెస్ రైలుబండి. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి బయలుదేరి, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల ప్రధాన పట్టణాల ద్వారా ప్రయాణించి భారతదేశ రాజధాని క్రొత్త ఢిల్లీ చేరుతుంది.

ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్

ఈ రైలు 1976 సంవత్సరంలో అప్పటి రైల్వే మంత్రి మధు దండావతేచే ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ గా ప్రారంభించబడెను.[1] 2014 లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రెండుగా విభజింపబడగా, ఈ రైలు యొక్క ప్రారంభ స్థానమును, రాష్ట్రములో ఈ రైలు పయనించు మార్గమును, తెలంగాణ రాష్ట్రములో అంతర్భాగమాయెను. కనుక ఈ రైలు యొక్క పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అని మార్చబడెను.

సేవల వివరాలు

[మార్చు]

తెలంగాణ ఎక్స్‌ప్రెస్ (ఆంధ్రప్రదేశ్ ఎక్స్ ప్రెస్) రైలును పరిచయం చేసినప్పుడు దీనిలో 14 బోగీలు ఉండేవి. అప్పట్లో 2600 ఆశ్విక శక్తి (హెచ్.పి.) గల ALCO డీజిల్ లోకమోటివ్ WDM2 ఇంజిన్ ను ప్రవేశపెట్టారు. 1981లో దీని సామర్థ్యాన్ని 21 బోగీలకు పెంచి 2 ALCO (WDM2) మోడల్ గల 5200 అశ్విక శక్తి (హెచ్.పి.) ఇంజిన్లను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 7 ఏయిర్ కండీషన్డ్ బోగీలతో సహా మొత్తం 24 బోగీలతో ఈ రైలు నడుస్తోంది. దీనిని లాగేందుకు ప్రయాణ మార్గం మొత్తంలోనూ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ (WAP-7 / WAP4) ఇంజిన్లు ఉపయోగిస్తున్నారు.[2]

1978 లో దీని సేవలు ప్రారంభమైన నాటి నుంచి 1990 తొలి నాళ్ల వరకు ఈ రైలు కేవలం ఐదు ( ఝాన్సీ జంక్షన్, బోపాల్ జంక్షన్, నాగ్ పూర్, బల్లార్షా, కాజీపేట ) స్టేషన్లలో మాత్రమే ఆగేది. ఆ తర్వాత మరికొన్ని స్టేషన్లలో ఆగేలా అనుమతినిచ్చారు. అందువల్ల ఇది సుదీర్ఘంగా 27 గంటల పాటు ప్రయాణించి తన గమ్య స్థానాన్ని చేరుకుంటుంది.

ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ పేరు మార్పు

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రానికి రాజధాని అయ్యింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఎక్స్ ప్రెస్ పేరుతో నడుస్తోన్న ఈ రైలు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ గా మార్చారు. విభజన తర్వాత ఏర్పడిన కొత్త ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం- ఢిల్లీ మధ్య నడిచే కొత్త రైలుకు ఎ.పి.ఎక్స్‌ప్రెస్ పేరును ప్రవేశపెట్టారు.[3]

రైలు సమయసారిణి

[మార్చు]
తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రయాణ కాల పట్టిక [4]
నెం. స్టేషన్ పేరు (కోడ్) రాక పోక ఆగు కాలం (నిమి) ప్రయాణ దూరం (కిమీ) రోజు మార్గం
1 హైదరాబాద్ డెక్కన్ (HYB) ఆరంభం 06:25 0 0 1 1
2 సికింద్రాబాద్ జంక్షన్ (SC) 06:45 06:50 5 10 1 1
3 కాజీపేట జంక్షన్ (KZJ) 08:40 08:42 2 142 1 1
4 రామగుండం (RDM) 09:48 09:50 2 234 1 1
5 మంచిర్యాల (MCI) 10:01 10:02 1 248 1 1
6 బెల్లంపల్లి (BPA) 10:27 10:28 1 268 1 1
7 సిర్ పూర్ కాగజ్ నగర్ (SKZR) 10:54 10:55 1 306 1 1
8 బల్లార్షా (BPQ) 12:25 12:35 10 376 1 1
9 చంద్రాపూర్ (CD) 12:54 12:55 1 390 1 1
10 నాగపూర్ (NGP) 15:45 15:55 10 587 1 1
11 భోపాల్ జంక్షన్ (BPL) 21:50 22:00 10 976 1 1
12 ఝాన్షీ జంక్షన్ (JHS) 02:08 02:20 12 1267 2 1
13 గ్వాలియర్ (GWL) 03:29 03:32 3 1364 2 1
14 ఆగ్రా కంట్ (AGC) 05:20 05:23 3 1482 2 1
15 మధుర జంక్షన్ (MTJ) 06:06 06:08 2 1536 2 1
16 బల్లభ్ ఘర్ (BVH) 07:50 07:52 2 1641 2 1
17 హెచ్ నిజాముద్దీన్ (NZM) 08:38 08:40 2 1670 2 1
18 న్యూఢిల్లీ (NDLS) 09:05 ముగింపు 0 1677 2 1

ప్రయాణ మార్గం

[మార్చు]

తెలంగాణ

[మార్చు]

మహారాష్ట్ర

[మార్చు]

మధ్య ప్రదేశ్

[మార్చు]

ఉత్తర ప్రదేశ్

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
  • "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Retrieved 2014-05-30.
  • "IRCTC Online Passenger Reservation System". irctc.co.in. Archived from the original on 2007-03-03. Retrieved 2014-05-30.
  • "[IRFCA] Welcome to IRFCA.org, the home of IRFCA on the internet". irfca.org. Retrieved 2014-05-30.
  • http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
  • http://www.indianrail.gov.in/index.html
  • http://www.indianrailways.gov.in/railwayboard/view_section.jsp?lang=0&id=0,1,304,366,537
  • ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్

మూలాలు

[మార్చు]
  1. "24కాచెస్.కం". 24కాచెస్.కం.
  2. "ఇండియన్ రైల్ ఇన్ఫో బి ట్రవెల్ఖ్హన". ఇండియన్ రైల్ ఇన్ఫో బి ట్రవెల్ఖ్హన.
  3. "ఆఫ్ ఎక్ష్ప్రెస్స్ ' ఇస్ నో మోర్ !". ఆఫ్టొదయ్. 2 సెప్టెంబర్ 2014. ఋఎత్రిఎవెద్ 3 సెప్టెంబర్ 2014. Archived from the original on 2014-09-05. Retrieved 2015-03-14. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  4. "ఆంధ్రప్రదేశ్ ఎక్స్ ప్రెస్". చ్లెఅర్త్రిప్ .కం. Archived from the original on 2016-03-05. Retrieved 2015-03-14.