ఖాజాగూడ
ఖాజీగూడ | |
---|---|
సమీపప్రాంతం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 075 |
Vehicle registration | టిఎస్ 07 |
లోక్‌సభ నియోజకవర్గం | చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | శేరిలింగంపల్లి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
ఖాజాగూడ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. గచ్చిబౌలి శివారులో ఉన్న ఈ ప్రాంతం ప్రధాన వాణిజ్య, నివాస ప్రాంతంగా ఉంది.[1] ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం పరిధిలోకి వస్తుంది. హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని 104వ వార్డు నంబరులో ఉంది.[2]
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[3]
సమీప ప్రాంతాలు
[మార్చు]నానక్‌రామ్‌గూడ, గచిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, చైతన్య ఎన్క్లేవ్, సాయి ఐశ్వర్య లేఅవుట్, లక్ష్మి నరసింహస్వామి నగర్ మొదలైన ప్రాంతాలు ఖాజాగూడ సమీపంలో ఉన్నాయి. ఇవేకాకుండా అనంతస్వామి కొండలు, రాయదుర్గం పోలీస్ స్టేషను, బాస్కిన్ రాబిన్స్, ఎంజెఆర్ మాగ్నిఫిక్ వంటివి కూడా సమీపంలో ఉన్నాయి.
పర్యాటకం
[మార్చు]ఇక్కడ ఖాజాగూడ చెరువు ఉంది. దాని దక్షిణ ఒడ్డున ఖాజాగూడ కొండలలో హైకింగ్, బౌల్డరింగ్ వంటివి చేసుకోవడానికి అనువైన ప్రదేశం.[4][5]
పాఠశాలలు
[మార్చు]- ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్
- ఢిల్లీ పబ్లిక్ స్కూల్
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఖాజాగూడ నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో హెచ్‌సియు బస్ డిపో ఉంది.[6]
బస్సు సర్వీసులు
- 5పి (పప్పలగుడ - సికింద్రాబాద్ జంక్షన్)
- 5పికె (పుప్పలగుడ - సికింద్రాబాద్ జంక్షన్)
- 5కె/120 (సికింద్రాబాద్ జంక్షన్ - ఉస్మాన్ సాగర్ రోడ్)
- 6బి (రామ్ నగర్ - ఓషన్ పార్క్ )
- 65పి (పప్పలగుడ - చార్మినార్ బస్ స్టాప్)
మూలాలు
[మార్చు]- ↑ "Find Latitude And Longitude". Find Latitude and Longitude. Archived from the original on 2022-04-07. Retrieved 2021-01-11.
- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 15 జూన్ 2019. Retrieved 14 September 2021.
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.
- ↑ Hasib, Mohammed (2018-10-08). "Khajaguda Hills - relishing SUNSET at the summit". Atomic Circle. Archived from the original on 2021-01-13. Retrieved 2021-01-11.
- ↑ "Khajaguda Routes". Hyderabad Climbers - Rock Climbing - Hyderabad. Retrieved 2021-01-11.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-11.