ఉప్పల్ ఖల్సా
ఉప్పల్
ఉప్పల్ కమాన్ | |
---|---|
Coordinates: 17°23′N 78°33′E / 17.38°N 78.55°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ |
నగరం | ఉప్పల్ |
Elevation | 455 మీ (1,493 అ.) |
భాష | |
• అధికారక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 500 039 |
ప్రాంతీయ ఫోన్‌కోడ్ | 91 040 |
Vehicle registration | TS-08 |
ఉప్పల్ ఖల్సా లేదా ఉప్పల్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలంలోని గ్రామం,[1]
ఇది పురపాలక సంఘం హాదా కలిగి ఉంది.ఉప్పల్ ఒక పురాతనమైన గ్రామం.
గ్రామ జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 3,84,835 - పురుషులు 1,95,649 - స్త్రీలు 1,89,186.పిన్ కొడ్:500039.
ప్రముఖ సంస్థలు
[మార్చు]- హైదరాబాదు ప్రజా పాఠశాల, రామంతాపూర్
- లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల.
- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.
- పెద్ద ఉప్పల్ లో సా.శ.నాలుగువందల సంవత్సరాలనాటి రామాలయం ఉంది. ఇది అతి పురతానమైనది.
- జెన్పపక్త్ లాంటి బహుళ జాతి కార్యాలయము ఉంది.
- ఈ గ్రామం 2009 ఎన్నికలలో శాసనసభ నియోజకవర్గము అయింది.
- ఉప్పల్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కూరగాయల విక్రయశాల పురాతనమైనవి.
మండలంలోని పట్టణాలు
[మార్చు]ఉప్పల్ కలాన్, ఉప్పల్ ఖల్సా, ఉప్పల్ బాగాయత్
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఉప్పల్ నుండి నగరంలోని వివిధ ప్రాంతాలకు సిటీ బస్సు సర్వీసులు నడుపబడుతున్నాయి. ఇక్కడ ఉప్పల్ మెట్రో స్టేషను కూడా ఉంది.
ఫ్లైఓవర్ థీమ్ పార్క్
[మార్చు]ఉప్పల్ జంక్షన్ లో రూ. 450 కోట్లతో ఏర్పాటచేసిన ఫ్లైఓవర్ థీమ్ పార్క్ ను 2022 మార్చి 11న తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ ప్రారంభించాడు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్మిక శాఖామంత్రి చామకూర మల్లారెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాశ్ రెడ్డి, హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఇత ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[2][3][4]
స్కైవాక్
[మార్చు]అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ జంక్షన్‌లో పాదచారుల భద్రతకు శాశ్వత భరోసా కల్పిస్తూ హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో 25 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కైవాక్ నిర్మించబడుతోంది.
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ telugu, NT News (2022-03-11). "వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లు : మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-03-11. Retrieved 2022-03-11.
- ↑ telugu, 10tv (2022-03-11). "KTR: ఉప్పల్‌లో అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన | Uppal Development programs started by Minister KTR". 10TV (in telugu). Archived from the original on 2022-03-11. Retrieved 2022-03-11.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Web, Disha (2022-03-11). "ఉప్పల్‌లో కేటీఆర్ కీలక ప్రకటన.. వారందరికి గుడ్ న్యూస్." dishadaily.com. Archived from the original on 2022-03-11. Retrieved 2022-03-11.
వెలుపలి లింకులు
[మార్చు]