Jump to content

కర్మ

వికీపీడియా నుండి
(కర్మము నుండి దారిమార్పు చెందింది)

కర్మ [ karma ] or కర్మము karma. సంస్కృతం √ kri = to do.] n. An act or deed: action in general. పని.[1] Religious action, such as sacrifice; ablution. Actions, conduct, a course of procedure. Destiny; fate, that is, the allotment, to be enjoyed or suffered in the present life, of the fruit of the good and evil actions performed in former lives. Moral duty; obligation imposed by peculiarities of tribe, occupation, &c. Funeral rites. The object of a verb in Grammar. వాని కర్మము ఎవ్వరు చేసారు who performed his funeral rites? An art, as శిల్పకర్మము the art of statuary. Doing: ఇది నీ కర్మమే this is all your doing, it is your own fault. Ill hap, misfortune, hard lot: affliction. అయ్యో కర్మమా O dear! oh what a pity! కర్మము or పాపకర్మము a sinful deed.

  • కర్మజీవి See కర్మఠుడు.
  • కర్మఠము karmaṭhamu. [Skt.] n. Ceremonial precision. కర్మఠుడు karmaṭhuḍu. n. A formalist, a ritualist: one who is earnest in the performance of the rites of religion. కార్యమును చివరవరకు సాధించేవాడు.
  • కర్మణి క్రియ karmaṇi-kriya. n. A transitive verb. అకర్మ క్రియ an intransitive verb.
  • కర్మరంగము karma-rangamu. n. The five sided sour green plum called Averrhoa Carambola, or అంబాణవుకాయ.
  • కర్మసాక్షి karma-sākshi. n. A witness of all our acts, viz., the sun సూర్యుడు.
  • కర్మాంతరము karmāntaramu n. Funeral rites, obsequies.
  • కర్మి n. A doer, an agent, workman, a sinner; a formalist; one bound by the doctrine of works. సారంగధరుడటువంటి కర్మికాడు he is not a man likely to do this.
  • కర్ముడు karmuḍu. n. A doer, an agent.
  • కర్మేంద్రియములు karmēndriyamulu. n. The organs of action. The bodily members, or limbs, considered as the instruments of passion and hence agents of sin.
  • కర్మము జన్మము). కర్మములకు హేతువులు అహంకార మమకారములు. అహంకారము అనఁగా దేహమందు ఆత్మ అను బుద్ధి. మమకారము అనఁగా తనవిగాని వానియందు తనవి అను బుద్ధి. ఈఅహంకార మమకారములు "అవిద్య" అని చెప్పఁబడుచున్నవి. గృహారామాదులకును ఆత్మకును సంబంధము ఏమియు లేదు. అవి ఎల్ల దేహానుబంధములు అయినవి. అట్టివాని యందు అభిమానము ఉంచకూడదు. మఱియు సుఖదుఃఖములు పొందక సర్వోదాసీనులు అయి సర్వసముఁడు అయిన ఆపరమేశ్వరుని సేవించువారు మోహమును వదలి అతిశీఘ్రమున ఉత్తమపదము చెందుదురు. అన్యకామ్యధర్మములయందు విషమబుద్ధిచేత నేను నీవు నాకు నీకు అని వచియించుచు ఉండువారు విషమ ధర్మనిరతులు అయి క్షయింతురు. స్థావర జంగమ ప్రాణిసమూహములందు సమము ఐన భాగవత ధర్మమున వర్తించువారు దేహి దేహ స్వరూపములను ఎఱిఁగి నిరస్తాశులు అయి ఈశ్వరానుగ్రహము పడయుదురు.

మోక్షము పొందుటకు భగవద్భక్తి ముఖ్యసాధనము. అది భగవత్కథలయందలి శ్రద్ధ, భగవద్గుణచేష్టితములను చెప్పుట, సర్వమును భగదర్పణము చేయుట ఇత్యాదులవలన కాని కలగదు. మఱియు ఈశ్వరుఁడు ఎల్లభూతములయందు వర్తించుచు ఉన్నాఁడు అని ఎల్లభూతములను సమ్మానింపవలయును. అట్టి భగవద్భక్తి కలుగుటకు కొన్ని ప్రతిబంధములు ఉన్నాయి. అవి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు. వీని సముదాయమే అరిషడ్వర్గము అనఁబడును. అది ఇంద్రియములను వశపఱుచుకొని విషయములకు ఈడ్చుచున్నది. ఉదకములకు పల్లపు భూములందు ప్రవహించుట స్వభావము అయినట్లు, ఇంద్రియములకు దుర్విషయములయందు తిరుగుట సహజము. విషయాసక్తులకు భగవద్భక్తి కలుగఁజాలదు. సహజముగ మనుష్యులు ఇంద్రియములకు లోపడుచున్నారు. ఇంద్రియములు మనసును ఈడ్చుచున్నవి. మనసు ఆత్మను చెఱుచుచున్నది. అట్టి మనసును వశపఱచుకొనువాఁడే బుద్ధిమంతుఁడు. జీవుఁడు అను రథికుఁడు మనసు అను కళ్లెముతో ఇంద్రియములు అను గుఱ్ఱములను స్వాధీనము చేసికొని విషయములు అనెడు విషమ భూములయందు పోనీక నిలిపెనేని తనకు కలుగఁగల హానిని తొలఁగించి తానుపొందవలసిన మోక్షము అను దేశమును చేరి సుఖపడవచ్చును. అట్టి మనోనిశ్చయము మతప్రామాణములయందలి విశ్వాసమువలన కాని మనుష్యునకు కలుగదు. "మ. ఉపవాసవ్రతశౌచశీలమఖ సంధ్యోపాసనాగ్నిక్రియా, జపదానాధ్యయనాది కర్మముల మోక్షప్రాప్తి సేకూఱ ద, చ్చపుభక్తిన్‌ రమా, ధిపుఁ బాపఘ్నుఁ బరేశు నచ్యుతుని నర్థిం గొల్వ లేకుండినన్‌." ..... మూలం....http://www.andhrabharati.com/dictionary/#

కర్మము

[మార్చు]

కర్మములకు హేతువులు అహంకార మమకారములు. అహంకారము అనఁగా దేహమందు ఆత్మ అను బుద్ధి. మమకారము అనఁగా తనవిగాని వానియందు తనవి అను బుద్ధి. ఈఅహంకార మమకారములు "అవిద్య" అని చెప్పఁబడుచున్నవి. గృహారామాదులకును ఆత్మకును సంబంధము ఏమియు లేదు. అవి ఎల్ల దేహానుబంధములు అయినవి. అట్టివాని యందు అభిమానము ఉంచకూడదు. మఱియు సుఖదుఃఖములు పొందక సర్వోదాసీనులు అయి సర్వసముఁడు అయిన ఆపరమేశ్వరుని సేవించువారు మోహమును వదలి అతిశీఘ్రమున ఉత్తమపదము చెందుదురు. అన్యకామ్యధర్మములయందు విషమబుద్ధిచేత నేను నీవు నాకు నీకు అని వచియించుచు ఉండువారు విషమ ధర్మనిరతులు అయి క్షయింతురు. స్థావర జంగమ ప్రాణిసమూహములందు సమము ఐన భాగవత ధర్మమున వర్తించువారు దేహి దేహ స్వరూపములను ఎఱిఁగి నిరస్తాశులు అయి ఈశ్వరానుగ్రహము పడయుదురు.

మోక్షము పొందుటకు భగవద్భక్తి ముఖ్యసాధనము. అది భగవత్కథలయందలి శ్రద్ధ, భగవద్గుణచేష్టితములను చెప్పుట, సర్వమును భగదర్పణము చేయుట ఇత్యాదులవలన కాని కలగదు. మఱియు ఈశ్వరుఁడు ఎల్లభూతములయందు వర్తించుచు ఉన్నాఁడు అని ఎల్లభూతములను సమ్మానింపవలయును. అట్టి భగవద్భక్తి కలుగుటకు కొన్ని ప్రతిబంధములు ఉన్నాయి. అవి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు. వీని సముదాయమే అరిషడ్వర్గము అనఁబడును. అది ఇంద్రియములను వశపఱుచుకొని విషయములకు ఈడ్చుచున్నది. ఉదకములకు పల్లపు భూములందు ప్రవహించుట స్వభావము అయినట్లు, ఇంద్రియములకు దుర్విషయములయందు తిరుగుట సహజము. విషయాసక్తులకు భగవద్భక్తి కలుగఁజాలదు. సహజముగ మనుష్యులు ఇంద్రియములకు లోపడుచున్నారు. ఇంద్రియములు మనసును ఈడ్చుచున్నవి. మనసు ఆత్మను చెఱుచుచున్నది. అట్టి మనసును వశపఱచుకొనువాఁడే బుద్ధిమంతుఁడు. జీవుఁడు అను రథికుఁడు మనసు అను కళ్లెముతో ఇంద్రియములు అను గుఱ్ఱములను స్వాధీనము చేసికొని విషయములు అనెడు విషమ భూములయందు పోనీక నిలిపెనేని తనకు కలుగఁగల హానిని తొలఁగించి తానుపొందవలసిన మోక్షము అను దేశమును చేరి సుఖపడవచ్చును. అట్టి మనోనిశ్చయము మతప్రామాణములయందలి విశ్వాసమువలన కాని మనుష్యునకు కలుగదు. "మ. ఉపవాసవ్రతశౌచశీలమఖ సంధ్యోపాసనాగ్నిక్రియా, జపదానాధ్యయనాది కర్మముల మోక్షప్రాప్తి సేకూఱ ద, చ్చపుభక్తిన్‌ రమా, ధిపుఁ బాపఘ్నుఁ బరేశు నచ్యుతుని నర్థిం గొల్వ లేకుండినన్‌."

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కర్మ&oldid=3206137" నుండి వెలికితీశారు