బైరామల్‌గూడ
Appearance
బైరామల్‌గూడ | |
---|---|
నివాసప్రాంతం | |
Coordinates: 17°20′25″N 78°32′28″E / 17.340196°N 78.54124°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | రంగారెడ్డి |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 079 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
సివిక్ ఏజెన్సీ | హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ |
బైరామల్‌గూడ, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరానికి సమీపంలోని ఒక నివాస ప్రాంతం. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలంకు చెందిన గ్రామం.[1]
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
[మార్చు]2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
వాణిజ్య ప్రాంతం
[మార్చు]ఇక్కడ అనేక వస్త్ర దుకాణాలు, నగల దుకాణాలు ఉన్నాయి. శ్రీ నిలయం గార్డెన్స్, గజ్జల జంగారెడ్డి గార్డెన్స్, పిండి పుల్లారెడ్డి గార్డెన్స్, ఈదులకంటి రాంరెడ్డి గార్డెన్స్, కెకెకె గార్డెన్స్ వంటి ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి.
దేవాలయాలు
[మార్చు]- బంగారు మైసమ్మ తల్లి దేవాలయం
- శ్రీ శక్తి హనుమాన్ దేవాలయం
- శ్రీ శ్రీ శ్రీ గండమ్మ దేవాలయం
- చంద్ర మౌళీశ్వరస్వామి దేవాలయం
రవాణా
[మార్చు]తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుండి బైరమల్‌గూడకు బస్సులు (104ఆర్, 277, 293, 93 మొదలైనవి) నడుపబడుతున్నాయి. ఇక్కడికి సమీపంలో మలక్ పేట హైదరాబాదు ఎం.ఎం.టి.ఎస్. రైలు స్టేషను, ఎల్.బి. నగర్ మెట్రో స్టేషను ఉన్నాయి.
అభివృద్ధి పనులు
[మార్చు]- ఫ్లైఓవర్ లెవల్ 1: సికింద్రాబాదు నుండి ఓవైసీ రోడ్డు, శ్రీశైలం రోడ్డు, సాగర్ రోడ్డు మార్గాలకు సులువుగా వెళ్ళేందుకు బైరామల్‌గూడ జంక్షన్ దగ్గర స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) ఫేజ్-1లోని ప్యాకేజీ-2లో భాగంగా 26.45 కోట్ల రూపాయలతో 780 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పులో నిర్మించిన బైరామల్‌గూడ ఫ్లైఓవర్ (కుడివైపు) నిర్మించబడింది. 2020, ఆగస్టు 11న తెలంగాణ మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు, సబితా ఇంద్రారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు.[3][4]
- ఫ్లైఓవర్ లెవల్ 2: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆరాంఘర్, మిధాని మీదుగా వచ్చే ట్రాఫిక్ ట్రాఫిక్ నియంత్రణకు, నివారణకు 29 కోట్ల రూపాయలతో 780 మీటర్ల పొడవు, 400 మీటర్ల డక్ పోర్షన్, 380 ఆర్.ఈ వాల్, 12.50 మీటర్ల వెడల్పుతో మూడు లైన్లతో నిర్మించిన ఫ్లైఓవర్ ను 2022 మార్చి 16న తెలంగాణ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.టి. రామారావు ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, హైదరాబాదు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, మున్సిపాలిటీల చైర్మన్లు, కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.[5][6]
ఇతర వివరాలు
[మార్చు]- ఇక్కడికి సమీపంలో 400 సంవత్సరాల పురాతన హిందూ దేవాలయం కర్మాన్‌ఘాట్ హనుమాన్ ఆలయం ఉంది.
- ఇక్కడ అవేర్ గ్లోబల్ హాస్పిటల్ (మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్), తిరుమల హాస్పిటల్ ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ http://www.thehindu.com/todays-paper/tp-features/tp-downtown/article932647.ece
- ↑ "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.
- ↑ The New Indian Express, Hyderabad (11 August 2020). "Bairamalguda flyover opened". Archived from the original on 18 October 2020. Retrieved 18 December 2020.
- ↑ నమస్తే తెలంగాణ, హైదరాబాదు (10 August 2020). "బైరామల్‌గూడ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కేటీఆర్". Archived from the original on 18 December 2020. Retrieved 18 December 2020.
- ↑ telugu, NT News (2022-03-16). "ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకే ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు : మంత్రి కేటీఆర్". Namasthe Telangana. Archived from the original on 2022-03-16. Retrieved 2022-03-16.
- ↑ "KTR: ఆ నిధులు తెస్తే కిషన్‌రెడ్డిని సన్మానిస్తాం: కేటీఆర్". EENADU. Archived from the original on 2022-03-16. Retrieved 2022-03-16.