Jump to content

హయాత్‌నగర్ మండలం

అక్షాంశ రేఖాంశాలు: 17°19′37″N 78°36′17″E / 17.327042°N 78.604717°E / 17.327042; 78.604717
వికీపీడియా నుండి
హయాత్‌నగర్‌ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, హయాత్‌నగర్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, హయాత్‌నగర్‌ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి జిల్లా, హయాత్‌నగర్‌ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°19′37″N 78°36′17″E / 17.327042°N 78.604717°E / 17.327042; 78.604717
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండల కేంద్రం హయత్‌నగర్‌
గ్రామాలు 28
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 2,27,195
 - పురుషులు 1,16,368
 - స్త్రీలు 1,10,827
అక్షరాస్యత (2011)
 - మొత్తం 64.57%
 - పురుషులు 75.25%
 - స్త్రీలు 52.60%
పిన్‌కోడ్ 501505

హయత్‌నగర్‌ మండలం, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1] హయాత్‌నగర్, ఈ మండలానికి కేంద్రం. ఇది హైదరాబాదుకి 25 కి.మీ. దూరంలో హైదరాబాదు నుండి విజయవాడ వెళ్ళే దారిలో రామోజీ ఫిల్మ్ సిటీకి 5 కి.మీ. సమీపంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సరూర్‌నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 6 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 29 చ.కి.మీ. కాగా, జనాభా 80,336. జనాభాలో పురుషులు 41,246 కాగా, స్త్రీల సంఖ్య 39,090. మండలంలో 19,339 గృహాలున్నాయి.[3]

హయాత్‌బక్షీ మసీదు

[మార్చు]
హయాత్‌బక్షీ మసీదు

హైదరాబాద్ నగర శివారులోని హయాత్‌నగర్ లోని చారిత్రాత్మక కట్టడమే హయాత్ బక్షీ మస్జిద్. గోల్కొండను పాలించిన ఐదవ సుల్తాన్ మహమ్మద్ భార్య హయాత్‌బక్షీ బేగం. సుల్తాన్ తన భార్య కోరిక మేరకు ఈ మసీదు నిర్మించి ‘హయాత్‌బక్షీ మసీద్’గా నామకరణం చేశాడు. ఇదే పేరు మీద అక్కడి ప్రాంతాన్ని ‘హయత్‌నగర్’గా పిలుస్తున్నారు. మొత్తం ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ మసీదును అరబ్ శైలిలో నిర్మించారు. మసీదుకు 5 ఆర్చ్‌లు, 2 మినార్‌లు ఉన్నాయి. మసీదు చుట్టూ 140 ఆర్చ్ గదులున్నాయి. ఒకేసారి రెండు వేల మంది ఇక్కడ నమాజ్ చేయవచ్చు. ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన ఈ మసీదు పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. చాలా వరకు ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించేవారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జీవన విధానాల్లో మార్పులు వచ్చాయి. ప్రస్తుతం ప్రజలు అటు పట్టణ, ఇటు పల్లెటూరు జీవన విధానాలను అలవర్చుకున్నారు.

మండల సమాచారం

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం
  • భాషలు:తెలుగు/ఉర్దూ
  • సముద్ర మట్టం నుండి 505 మీటర్లు ఎత్తులో ఉంది.
  • టెలిఫోన్ యస్.టి.డి.కోడ్:08415
  • వాహన రిజిష్ట్రేషన్ సంఖ్యలు:AP- 28, AP- 29
  • ప్రాంతీయ రవాణా అధికారి కార్యాలయం:రంగారెడ్డి

మండలంలోని కళాశాలలు,ఇతర సంస్థలు

[మార్చు]
  • హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల
  • వర్డ్స్ అండ్ డీద్ జూనియర్ కళాశాల. హయత్ నగర్.
  • ప్రభుత్వ జూనియర్ కళాశాల. హయత్ నగర్.
  • విజయ కాలేజ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, రేడియో స్టేషన్ ఎదురుగా, సాయినగర్ కాలని, 2 వ ఫేస్.
  • ఆంధ్రా బాంకు, హయత్ నగర్ ( IFSC Code ANDB0001245, MICR Code 500011110) [4]

మండల గణాంకాలు

[మార్చు]
దస్త్రం:APvillage Hayathnagar 1.JPG
హయత్ నగర్ దృశ్యాలు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 2,27,195 - పురుషులు 1,16,368 - స్త్రీలు 1,10,827

రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఈ గ్రామం విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారి పైనున్నందున ఇక్కడినుండి అనేక ప్రాంతాలకు రోడ్డు వసతి కలిగి బస్సుల సౌకర్యము ఉంది. ఇక్కడికి 10 కి.మీ. లోపు రైల్వే స్టేషను లేదు. కాని మలకపేట రైల్వేస్టేషను, కాచిగూడ రైల్వే స్టేషనులు సమీపములో ఉన్నాయి. ప్రధాన రైల్వేస్టేషను సికింద్రాబాద్ ఇక్కడికి 18 కి.మీ దూరములో ఉంది.

మండలంలోని పట్టణాలు

[మార్చు]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అన్మగల్ హయత్‌నగర్‌
  2. బాఘ్ హయత్‌నగర్‌
  3. ఖల్సా హయత్‌నగర్‌
  4. సాహెబ్‌నగర్‌ కలాన్‌
  5. సాహెబునగర్ ఖుర్దు
  6. కాల్వంచ

మూలాలు

[మార్చు]
  1. https://web.archive.org/web/20190612075802/http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/250.Rangareddy-Final.pdf
  2. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. "Andhra Bank, Hayat Nagar branch - IFSC, MICR Code, Address, Contact Details, etc". Archived from the original on 2020-10-10. Retrieved 2020-10-08.

వెలుపలి లింకులు

[మార్చు]