Coordinates: 13°54′00″N 79°54′00″E / 13.9000°N 79.9000°E / 13.9000; 79.9000

నాయుడుపేట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విశాఖపట్టణం → విశాఖపట్నం, లొ → లో (2), లో → లో , కి → కి (6), using AWB
చి →‎మూలాలు: {{commons category|Naidupeta}}
పంక్తి 119: పంక్తి 119:
==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

{{commons category|Naidupeta}}

{{శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రైల్వే స్టేషన్లు}}
{{శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రైల్వే స్టేషన్లు}}
{{నాయుడుపేట మండలంలోని గ్రామాలు}}
{{నాయుడుపేట మండలంలోని గ్రామాలు}}

19:52, 25 ఏప్రిల్ 2018 నాటి కూర్పు

నాయుడుపేట
—  మండలం  —
నెల్లూరు పటంలో నాయుడుపేట మండలం స్థానం
నెల్లూరు పటంలో నాయుడుపేట మండలం స్థానం
నెల్లూరు పటంలో నాయుడుపేట మండలం స్థానం
నాయుడుపేట is located in Andhra Pradesh
నాయుడుపేట
నాయుడుపేట
ఆంధ్రప్రదేశ్ పటంలో నాయుడుపేట స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°54′00″N 79°54′00″E / 13.9000°N 79.9000°E / 13.9000; 79.9000
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రం నాయుడుపేట
గ్రామాలు 33
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 68,631
 - పురుషులు 34,802
 - స్త్రీలు 33,829
అక్షరాస్యత (2001)
 - మొత్తం 69.98%
 - పురుషులు 77.93%
 - స్త్రీలు 61.82%
పిన్‌కోడ్ {{{pincode}}}

నాయుడుపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక మండలము,మరియు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఒక ముఖ్యపట్టణం.ఈ పట్టణ జనాభా సుమారు 50 వేలు.ఇది నెల్లూరు నగరమునకు సుమారు 57 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు చెన్నై నుండి 108 కిలోమీటర్లు, తిరుపతి నుండి 61 కిలోమీటర్ల దూరంలో ఉంది.నాయుడుపేట పట్టణం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ముఖ్యమైన కూడలి.ఈ పట్టణం గుండా చెన్నై,తిరుపతి,నెల్లూరు వంటి నగరములకు రోజూ అధిక సంఖ్యలో ప్రయాణీకులు వెల్తుంటారు.

వ్యవసాయం

ఈ మండలంలో ప్రధాన వానిజ్య పంట చెరకు.దీనితోపాటుగా వరిని కుడా సాగు చేస్తారు.

వ్యవసాయానికి కావలిసిన మొటర్శ్ నూ ఎ.కే.బీ బేరీపేట వారు తక్కువ దరకు అద్ద్సారు

విద్యా సౌకర్యాలు

దస్త్రం:College photo.jpg
కళాశాల వార్షికోత్సవ ద్రుశ్యము

నాయుడుపేటలో మొత్తం 15 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఎ.ఎల్.సి.ఎమ్ ఉన్నత పాఠశాల చాలా ప్రత్యేకత సంతరించుకుంది. కారణం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఈ పాఠశాలలో కొంతకాలం విద్యాభ్యాసం చేశాడు.[1] అలాగే ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, 1983లో స్థాపించిన ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు 6 ప్రైవేట్ జూనియర్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇక్కడ రెండుగ్రంథాలయాలు ఉన్నాయి. విద్యకు సంబంధించి నాయుడుపేట పట్టణమునకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంచి గుర్తింపు ఉంది.

రవాణా సౌకర్యాలు

నాయుడుపేట చెన్నై-కోల్ కతా జాతీయ రహదారి (NH-5) మీద చెన్నై-నెల్లూరు ల మధ్య ఉంది. తిరుపతి,నెల్లూరు, విజయవాడ, చెన్నై, హైదరాబాదు, కర్నూలు, కడప, అనంతపురం, ఒంగోలు, విశాఖపట్నం, బెంగళూరు .. మొదలగు ప్రదేశములకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు విరివిగా ఉన్నాయి. ఇక్కడ నుంచి చెన్నైకి ప్రతి 20 నిమిషాలకు బస్సు సౌవుకర్యం కలదు,మరియు బెంగళూరుకి కూడా ఆదిక సంఖ్యలో బస్సు సౌకర్యం ఉంది.ఇంకా ప్రముఖ నగరమైన తిరుపతికి ప్రతి 5 నిమిషములకు బస్సులు విరివిగా ఉన్నాయి.పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకు విరివిగా బస్సులు ఉన్నాయి.

నాయుడుపేట చెన్నై-విజయవాడ రైలు మార్గములో ఒక స్టేషను. ఇక్కడ నుండి విజయవాడ, చెన్నై, హైదరాబాదు, .. మొదలగు ప్రదేశములకు నిత్యం రైళ్ళ రాకపోకలు ఉన్నాయి. నాయుడుపేట స్టేషనులో ఆగు రైళ్ళు:

  • హైదరాబాద్ ఎక్స్ ప్రెస్.
  • చార్మినార్ ఎక్స్ ప్రెస్.
  • లక్నొ ఎక్స్ ప్రెస్.
  • సర్కార్ ఎక్స్ ప్రెస్.
  • జమ్ము-తావి ఎక్స్ ప్రెస్.
  • డెహ్రడూన్ ఎక్స్ ప్రెస్.

నదులు

ఈ ఊరు స్వర్ణముఖినది ఒడ్డున ఉంది. ఈ నది శ్రీకాళహస్తి మీదుగా నాయుడుపేట చేరి అటుపైన వాకాడు మీదుగా బంగాళాఖాతములో కలుస్తుంది.స్వర్ణముఖి నది ఒడ్డున పరమశివుని ఆలయం ఉంది.ఈ స్వర్ణముఖి నదిలో ప్రతి సంవత్సరం యేటి పండుగలు నిర్వహిస్తారు.

పరిశ్రమలు

నాయుడు పేటలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక బీడీ ఫ్యాక్టరీ, ఒక చక్కెర కర్మాగారము ఉన్నాయి. ఈ బీడీ ఫ్యాక్టరి వలన సుమారు 20000 మందికి పైగా ఉపాది పొందుతున్నారు.ఈ చక్కెర కర్మాగారము నుండి ఇతర దేశాలకు చక్కెర ఎగుమతి అవుతుంది. నాయుడుపేటకు సుమారు 7కి.మి దూరంలో బి.జె.టెక్సెటైల్స్ ఫ్యాక్టరి ఉంది.

బ్యాంకులు

సినిమాథియేటర్లు

  • సి.ఎస్.తేజ
  • మురారి

దేవాలయాలు

నాయుడు పేటలో మూడు శివాలయాలు, మూడు రామాలయాలు, మూడు ఆంజనేయస్వామి ఆలయాలు, మూడు వినాయకుడి గుడులు, రెండు సాయి మందిరాలు, ఒక కృష్ణ మందిరము, కన్యకా పరమేశ్వరి ఆలయము ఒకటి ఉన్నాయి. ఇంకా ఇక్కడ మూడు మసీదులు, రెండు దర్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి హజరత్ షా వలి దర్గా, ఇది పెద్దది. ఈ దర్గాకి ప్రతి సంవత్సరం చాలా వైభవంగా గంథమహొత్సవం (ఉర్సు) జరుగుతుంది.అలాగె ఒక కరిమాణిక్యస్వామి ఆలయం కూడా ఉంది.స్వర్ణముఖి నది ఒడ్డున పరమశివుని ఆలయం ఉంది.

గ్రామదేవతలు

నాయుడుపేట గ్రామ దేవత పోలేరమ్మ. ఊరిలో పోలేరమ్మ జాతర ఘనంగా చేస్తారు. ఇంకా ఇక్కడ అంకమ్మ గుడి, మూకాంబిక గుడి, మహాలక్ష్మి గుడి, పెద్దపాలెమ్మ గుడి, కావమ్మ గుడి ఉన్నాయి.

ఇతర గ్రామ విశేషాలు

నాయుడుపేట నుంచి తుమ్మురు 4కి.మి దూరంలో ఉంది.ఈ ఊరి జనాభా సుమారు 2500 మంది ఉన్నారు.

ఈ ఊరి విశేషాలు :

  • ఈ ఊరిలో చోళుల కాలంలో నిర్మితమైన కరిమాణిక్యస్వామి గుడి ఉంది.
  • మే నెలలో ఈ గుడిలో 11 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి.

కోడ్స్

  • పిన్ కోడ్: 524126
  • ఎస్.టీ.డీ.కోడ్:
  • వాహనం రిజిస్ట్రేషన్ కోడ్:

గ్రామాలు

మూలాలు

  1. టంగుటూరి ప్రకాశం పంతులు ఆత్మకథ నా జీవిత యాత్ర పుట 7