Coordinates: 16°56′N 82°13′E / 16.93°N 82.22°E / 16.93; 82.22

కాకినాడ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Blanked the page
ట్యాగు: తుడిచివేత
rv
పంక్తి 1: పంక్తి 1:
{{భారత స్థల సమాచారపెట్టె | ఆంధ్రప్రదేశ్ మండలం |
native_name = కాకినాడ |
type = city |
image = Bay of Bengal view at Kakinada.jpg|
image_caption = కాకినాడ వద్ద సముద్రతీరం|
latd = 16.93 | longd = 82.22|
locator_position = right |
state_name = ఆంధ్ర ప్రదేశ్ |
district = [తూర్పు గోదావరి]
| leader_title_1 = మేయరు
leader_name_1 = కె.సరోజ
| leader_title_2 = ఎం.పి
| leader_name_2 = తోట నరసింహం (తెదేపా)
| altitude = 2
| population_as_of = 2011
| population_total = 312748 <ref name=UA1Lakhandabove>{{cite web | url=http://www.censusindia.gov.in/2011-prov-results/paper2/data_files/India2/Table_2_PR_Cities_1Lakh_and_Above.pdf | format=pdf | title=Provisional Population Totals, Census of India 2011; Urban Agglomerations/Cities having population 1 lakh and above | publisher=Office of the Registrar General & Census Commissioner, India | accessdate=26 March 2012}}</ref>
| population_metro_footnotes = <ref name=Cities1Lakhandabove>{{cite web | url=http://censusindia.gov.in/2011-prov-results/paper2/data_files/India2/Table_3_PR_UA_Citiees_1Lakh_and_Above.pdf | format=pdf | title=Provisional Population Totals, Census of India 2011; Cities having population 1 lakh and above | publisher=Office of the Registrar General & Census Commissioner, India | accessdate=26 March 2012}}</ref>|
| population_density = 2658
| area_magnitude= 192.3 sq. km
| area_total =
| area_telephone = 91 884
| postal_code = 533 001
| sex_ratio = 0.98
| literacy = 75.20
| literacy_male = 80.14
| literacy_female = 70.38 |
unlocode = |
website = |
footnotes = |
}}

'''[[కాకినాడ]]''' [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[తూర్పు గోదావరి]] జిల్లా యొక్క ముఖ్యపట్టణం. కాకినాడ తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన పట్టణమే కాక భారత దేశ తూర్పు తీర ప్రాంతములోముఖ్యమైన రేవు పట్టణం. [[న్యూయార్క్]] నగరము మాదిరిగా [[వీధులు]] రూళ్ళకర్రతో గీసినట్టు సమాంతరంగా ఉండి, కూడళ్ళలో ఒకదానికొకటి లంబంగా ఉండడం ఈ నగర ప్రత్యేకత. ప్రణాళికా బద్ధంగా ఉన్న కారణంగా కో-కెనడా గానూ, ప్రముఖమైన ఓడరేవుగా ఉన్న కారణం చేత రెండవ [[మద్రాసు]] గానూ, [[చమురు]] అన్వేషణ, వెలికితీత కార్యక్రమాలు అధికంగా ఉన్న కారణంచేత మినీ [[ముంబయి]] గానూ, పిలుస్తూ ఉంటారు. ప్రశాంత వాతావరణానికి మారుపేరైన ఈ పట్టణం పెన్షనర్స్ పారడైస్గా పేరొందినది. [[ఆంధ్రప్రదేశ్]] పెట్రోలియం రసాయనాలు పెట్రోరసాయనాల పెట్టుబడి ప్రాంతం పరిధి [[కాకినాడ]]<nowiki/>ని ఆనుకొనే మొదలవుతుంది. ఈ మధ్యకాలంలో [[కృష్ణా గోదావరి బేసిన్‌|కె.జి బేసిన్]] రాజధానిగా విదేశాలలో ప్రాముఖ్యతని సంతరించుకొంటోంది.

==కాకినాడ పేరు వెనుక ఇతిహాసం==
[[File:Kakinada written in telugu 2013-12-31 13-26.jpg|thumb|250px|'''కాకినాడ''']]
కాకినాడ అనే పేరు వెనుక అనేక కథలు ఉన్నాయి.
* కాకినాడ పేరు మొదట '''కాకి నందివాడ''' అని ఉండేదని, అది కాలక్రమముగా కాకినాడగా నామాంతరం చెందిందని చెబుతారు. స్వాతంత్ర్యం రాక ముందు కొంతకాలం కాకినాడ పేరు కొకనాడగా చలామణి అయ్యింది.
* త్రేతాయుగంలో ఇది పెద్ద అరణ్యం దీన్నీ కాకాసురుడు అనే రాక్షసుడు పరిపాలిస్తూ ఉండేవాడు. వనవాసం చేస్తున్న సీతను కాకి రూపంలో వేధించినపుడు [[రాముడు]] అతనిని సంహరించాడు, అతని పేరున ఈ వనమ్ వెలిసినది.
* ఇక్కడకి మొదట [[డచ్]] వారు వర్తకం చేసుకొనడానికి వచ్చి వారి స్థావరం ఏర్పరచుకొన్నారు. వారి తరువాత [[ఆంగ్లేయులు]] వారి స్థావరం ఏర్పాటు చేసుకొన్నారు.తరువాత [[కెనడా|కెనడియన్‌]] బాప్తిస్టు [[క్రైస్తవ మతము|క్రైస్తవ]] మిషనరీలు ఇక్కడకి వచ్చారు. వారు కాకినాడ నగరాన్ని చూసి ఇది అచ్చు వారి కెనడ నగరాన్ని తలపించడంతొ వారు ఈ నగరాన్ని కోకెనడ అని పిలిచెవారు అది కాలక్రమంగా కాకినాడగా వాడుకలోకి వచ్చింది.
* బ్రిటీషువారి కాలంలో కాకెనాడ /కోకనాడ (Cocanada) గా పిలువబడి, [[స్వతంత్రం|స్వాతంత్ర్యం]] వచ్చాక పేరు కాకినాడగా మార్చబడింది. అయితే స్వాతంత్ర్యం రాక మునుపు [[బ్రిటిషు]] వారి పరిపాలన సమయంలో స్థాపించబడిన సంస్థల పేర్లు కోకనాడ గానే ఉన్నాయి. ఉదాహరణ- కోకనాడ చేంబర్ ఆఫ్ కామర్స్, జె ఎన్ టి యు లోని కొన్ని శిలాఫలకాలు, భారతీయ రైల్వేవారి స్టేషను కోడ్లు - కాకినాడ పోర్టు - COA, కాకినాడ టౌన్ - CCT.
* ఈ ప్రాంతం చెఱువులు ఎక్కువగా ఉండి, అవి ఎర్రకలువ (కోకనదము) లతో నిండి ఉండేవని చరిత్ర చెబుతోంది.
* బిటీష్‌ వాళ్ళు మనదేశంలోకి కొత్తగా వచ్చిన రోజులలో ఇక్కడ పండే [[పంట]]<nowiki/>ల్నీ, విలువైన వస్తువుల్నీ తమ దేశానికి చేరవేసేందుకు రవాణా సౌకర్యం కలిగిన అనువైన ప్రదేశం కోసం గాలిస్తూండగా ఈ ప్రాంతం వారి దృష్టిలోకి వచ్చింది. సర్వే అధికారులు, పై అధికారులకు రిపోర్టు పంపిస్తూ ` ఇక్కడ కాకులు ఎక్కువగా ఉండటంతో ‘కాకులవాడ’ అంటూ పేర్కొన్నారట! కాలక్రమంలో ‘కాకివాడ’గా, ‘కాకినాడ’గా మారిపోయింది!

==నైసర్గిక స్వరూపము==
[[File:Satellite kkd.jpg|thumb|ఉపగ్రహ చాయాచిత్రంలో హోప్ ఐలాండ్ మరియు కాకినాడ]]
కాకినాడ 16.93° ఉత్తర అక్షాంశం (latitude) దగ్గర, 82.22° [[తూర్పు రేఖాంశం]] (longitude) దగ్గర ఉంది. భారతీయ ప్రామాణిక కాలమానానికి (Indian Standard Time) అధారభూతమైన 82.5 [[ఉత్తర రేఖాంశం]] కాకినాడ మీదుగా పోతుంది. సగటున కాకినాడ ఊరంతా [[సముద్రమట్టానికి ఎత్తు|సముద్ర]]<nowiki/>మట్టానికి 2 మీటర్లు ఎత్తులో ఉన్నప్పటికీ, పట్టణంలోని చాలా ప్రాంతాలు సముద్రమట్టానికి తక్కువ ఎత్తులో ఉన్నాయి. సముద్రతీరానికి సమాంతరంగా, ఉత్తరం నుండి దక్షిణంగా ఒక దీర్ఘచతురస్రం మాదిరిగా నగరం ఉంటుంది. నగరం యొక్క సరాసరి వెడల్పు 6 కి.మీ కాగా, పొడవు 15 కి.మీలు.

స్థూలంగా, నగరం రెండు ప్రాంతాలుగా ఉంటుంది. దక్షీణ ప్రాంతమైన [[జగన్నాధపురాన్ని]], మిగిలిన నగరాన్ని విడదీస్తూ బకింగ్ హాం కాలువ ఉంటుంది. స్థానికంగా, దీనిని ఉప్పుటేరుగా పిలుస్తారు. డచ్ కోరమాండల్ వారి వలసల కాలంలో, [[జగన్నాధపురం]], [[డచ్]] ఈస్టిండియా కంపెనీకి చెందిన వాణిజ్య కేంద్రంగా ఉండేది. 1734 సం. నుండి 1834 సం. వస్త్ర వాణిజ్యం ఎక్కువగా జరిగిన ఈ ప్రాంతంలో డచ్చివారి కోట కూడా ఉండేది.

ఉత్తర ప్రాంతం అయిన కాకినాడ, శివారు గ్రామాలు ఇటీవలి కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఉత్తరం నుండి దక్షిణం వఱకూ ఉన్న పారిశ్రామిక గొలుసు, నగరం యొక్క తూర్పు ప్రాంతాన్ని సముద్రతీరం నుండి వేరుచేస్తోంది. కాకినాడకి అగ్నేయంగా కాకినాడ అఖాతం ఉంది. ఈ ప్రాంతంలోని మడ [[అడవులు]], [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో అతి పెద్ద మడ అడవులలో రెండవ స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. ఇదే ప్రాంతం [[కోరింగ వన్యప్రాణి అభయారణ్యం|కోరింగ అభయారణ్యానికి]] నెలవు. [[గోదావరి]]కి పాయలలో ఒకటైన 'గౌతమి', కాకినాడకి దక్షిణంగా బంగళాఖాతంలో కలుస్తోంది.

===హోప్ ఐలాండ్===
కాకినాడ తీర ప్రాంతం అంతా '''[[హోప్ ఐలాండ్]]''' (హోప్ ద్వీపం) ([http://wikimapia.org/#lat=16.971139&lon=82.346478&z=13&l=0&m=a&v=2 వికీమాపియాలో హోప్ ఐలాండ్]) చేత పరిరక్షింపబడుతున్నది. [[సముద్రం|సముద్రపు]] ([[బంగాళా ఖాతము]]) ఆటుపోట్ల నుండి తీరము కోత కొయ్యబడకుండా ఐదు వందల సంవత్సరాల క్రితం నుండి ఈ హోప్ ఐలాండ్ ఏర్పడిందని తెలుస్తున్నది. ఈ [[హోప్ ఐలాండ్]] తీరం వెంబడి 23 కి.మీల మేర విస్తరించి ఉంది. కాకినాడ సముద్రతీరంలో ఓడలు నిలిచినప్పుడు ఈ [[హోప్ ఐలాండ్]] వల్ల ఓడలు లంగరు వేసినప్పుడు స్థిరంగా ఉండగల్గుతున్నాయి.
మహాలక్ష్మీ పర్యాటకం, [[చొల్లంగిపేట]] వారి హోప్ ఐలాండ్ విహార యాత్ర మట్లపాలెంలో ఉంది.

{{Geographic location
|Northwest = [[వరంగల్]], [[కరీంనగర్]], [[పూణే]], [[ముంబయి]]
|North = [[రాయ్ పూర్]], [[పాట్నా]], [[లక్నో]], [[కాన్పూర్]], [[కొత్త ఢిల్లీ]]
|Northeast = [[విశాఖపట్నం]], [[భువనేశ్వర్]], [[కోల్ కత]]
|West = [[రాజమండ్రి]], [[హైదరాబాద్]], [[ఖమ్మం]], [[షోలాపూర్]], [[గోవా]]
|Centre = కాకినాడ
|East = [[బంగాళాఖాతం]]
|Southwest = [[ఏలూరు]],[[తెనాలి]], [[విజయవాడ]], [[గుంటూరు]], [[నెల్లూరు]], [[తిరుపతి]], [[చిత్తూరు]], [[చెన్నై]], [[బెంగుళూరు]]
|South = [[యానాం]], [[అమలాపురం]], [[భీమవరం]], [[నరసాపురం]], [[గుడివాడ]], [[పామర్రు]], [[ఒంగోలు]]
|Southeast = [[బంగాళాఖాతం]]
}}
===కాకినాడ నుండి ఇతర ప్రాంతాలకు దూరాలు (కిలోమీటర్లలో)===
*[[బెంగుళూరు]] 856
*[[చెన్నై]] 684
*హౌరా ([[కోల్కతా]]) 1028
*[[ముంబై]] 1234
*[[ఢిల్లీ]] 1848
*[[రాజమండ్రి]] 65
*[[ఏలూరు]] 163
*[[విజయవాడ]] 223
*[[విశాఖపట్నం]] 162

==వాతావరణం==
==పట్టణ చరిత్ర==
[[File:Gandhi statue at Kakinada 01.JPG|thumb|గాంధీనగర్ ఉద్యానవనంలో జాతిపిత విగ్రహం]]
ఇది రాష్ట్రములోని ప్రధానమైన ఓడరేవులలో ఒకటి. రెండు శతాబ్దాల క్రితం ఈ రేవు నుండి మల్లాది సత్యలింగ నాయకర్‌ అనే ఆసామీ ఓడ వ్యాపారం చేసేవాడు. ఆయన వారసులు మల్లాది సత్యలింగ నాయకర్‌ ఛారిటీస్ (MSN Charities) అనే స్వచ్ఛంద సంస్థని స్థాపించి ఇప్పటికీ విద్యారంగంలో ఎన్నో ప్రజోపయోగమైన పనులు చేస్తున్నారు.

భారతదేశంలో వాసయోగ్యమైన బహుకొద్ది నగరాలలో కాకినాడ ఒకటిగా ఉండేది. తిన్నటి విశాలమైన [[వీధులు]], విద్యుచ్చక్తి, నీటి సరఫరా, ఈశ్వర పుస్తక భాండాగారం వంటి [[గ్రంథాలయాలు]], కళాశాలలు మొదలైన హంగులన్నీ ఈ ఊళ్ళో దరిదాపు 1900 సంవత్సరం నుండి ఉన్నాయి. 1901 జనాభా లెక్కల ప్రకారం కాకినాడ జనాభా 48000. మద్రాసు రాష్ట్రంలోని అచ్చతెలుగు ప్రాంతాలలో అతి పెద్ద నగరం ఇదే. ఇప్పుడు కొత్త కొత్త కళాశాలలు, [[పరిశ్రమలు]], వ్యాపార సంస్థలు కూడా రావటంతో ఇంకా బాగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడి జె ఎన్ టి యు కళాశాల భారదేశంలోని అతి పురాతనమైన, అత్యుత్తమమైన ఏలెక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ శాఖలను కలిగి ఉంది.

ప్రశాంతమయిన పరిసరాలు కలిగి ఉండడము చేత రాష్ట్రం నలు మూలల నుంచి రిటైర్డ్ ఉద్యొగులు ఎందరో వచ్చి కాకినాడలో స్థిరపడుతున్నారు. అందుకే ఈ నగరాన్ని "పెన్షనర్స్ ప్యారడైజ్" అని కూడా పిలుస్తారు. అయితే ఇప్పుడు పరిస్థితి చాలా మారింది.అడ్డు ఆపు లేని నగరీకరణం వలన [[పర్యావరణము|పర్యావరణం]] పైన విపరీతమైన భారం కలిగి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వేసవిలో పరిస్థితి భరించలేని రీతిలో ఉంది. చెట్లు విపరీతంగా నరకడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చాలా మంది భావిస్తున్నారు.

===కొన్ని ముఖ్య సంఘటనలు===

* 19వ శతాబ్దంలో కాటన్ ఆనకట్ట పూర్తయ్యి [[ధవళేశ్వరం]] – కాకినాడ కాలువ ([[బకింగ్‌హాం కాలువ|బకింగ్ హామ్ కాలువ]]) వినియోగంలోకి వచ్చిన తర్వాత, కాకినాడ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. 1881నాటికి 17వేలుగా ఉన్న పట్టణ జనాభా, 1901 నాటికి 48వేలకి చేరి, సర్కారు జిల్లాల్లో అతిపెద్ద నగరంగా ఏర్పడి, [[చెన్నై|మద్రాసు]] – [[కలకత్తా]] మధ్యలో అత్యంత భద్రమైన, అత్యుత్తమైన ఓడరేవు (Safest and Best Port) గా, రెండవ మద్రాసుగా పేర్కొనబడింది. నిజాం ఏలుబడిలోని బీరార్ ప్రాంతంనుండి, గోదావరి నదిమీద, భద్రాచలం మీదుగా, కాకినాడ ఓడరేవుకి జలరవాణా అధికమయ్యింది. ఒకానొక స్థాయిలో, కాకినాడ రాజధానిగా సర్కారు జిల్లాలని మద్రాసు ప్రెసిడెన్సీనుండి వేరుచేసి, మఱో ప్రెసిడెన్సీగా ఏర్పాటుచేసే ప్రతిపాదనలు కూడా బ్రిటీషువారు చేసుకున్నారు. (ఆ కాలంనాటి ప్రధాన రైలు, “సర్కార్ ఎక్స్ ప్రెస్” ఇప్పటికీ, కాకినాడ – చెన్నై ల మధ్య నడుస్తోంది.) <ref>{{cite web
| url = http://books.google.co.in/books?id=CZEIAAAAQAAJ&printsec=frontcover&source=gbs_ge_summary_r&cad=0#v=onepage&q&f=false
| title = Descriptive and Historical Account of the Godavery District in The Presidency of Madras, By Henry Morris
| publisher =
| accessdate = 2014-05-10
}}</ref>
*1923సంవత్సరంలో అఖిల [[భారత జాతీయ కాంగ్రెస్]] సభలకు కాకినాడ వేదిక అయింది. ఎప్పటిలాగే, [[జాతీయగేయం|వందేమాతరం]] గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండగా, అప్పటి కాంగ్రెస్ ముస్లిం నాయకుడు మౌలానా ముహమ్మద్ అలీ జవహర్, అది ఇస్లాంకి వ్యతిరేకమని అభ్యంతరం వ్యక్తం చేసారు.అయితే, వందేమాతరం కాంగ్రెస్ సంప్రదాయమని, తక్కిన పెద్దలందరూ నచ్చజెప్పడంతో ఆయన ఊరుకున్నారు. వందేమాతరం గీతం పైన కొందరు ముస్లింలలో ఉన్న వ్యతిరేకతకి ఉదాహరణగా నిలిచిన తొలి ఘటనగా దీనిని పరిగణిస్తారు.<ref>{{cite web
| url = http://www.rediff.com/news/1998/dec/03vande.htm
| title = A Fatwa against the Idea of India
| publisher = www.rediff.com
| accessdate = 2014-05-10
}}</ref>
*అవే సభలకు, [[దుర్గాబాయి దేశ్‌ముఖ్]] వాలంటీరుగా పనిచేస్తూ, వద్ద టిక్కెట్ లేని కారణము చేత నెహ్రూను అనుమతించక, తన కర్తవ్య నిర్వహణకు గాను మహాత్ముని, [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]] నుండి ప్రశంసలను పొందింది.
* అప్పటి డి.ఎస్.పి, ముస్తఫా ఆలీ ఖాన్ ని హతమార్చడానికై, 1933 ఏప్రిల్ 6 న, ఏప్రిల్ 14 లలో [[ప్రతివాది భయంకర వెంకటాచారి]] కొన్ని విఫలయత్నాల అనంతరం, ఏప్రిల్ 15 న ఉదయం 6 గంటలకు కాకినాడ ఓడరేవులో మరో ప్రయత్నం చేసారు. ఈ ప్రయత్నం కూడా విఫలమయ్యింది కానీ, [[ప్రతివాది భయంకర వెంకటాచారి]], కామేశ్వర శాస్త్రి మరియు ఇతర విప్లవకారుల కుట్ర బయటపడింది. ఈ సంఘటన కాకినాడ బాంబు కేసుగా ప్రసిద్ధమైంది. (క్రీ.శ 1931 మార్చి 30న జరిగిన వాడపల్లి కాల్పుల ఘటన, 1932 జనవరి 19న [[సీతానగరం]] ఆశ్రమ ఘటన లకు ముస్తఫా అలీ ఖాన్ బాధ్యుడని అప్పటి విప్లవకారులు భావించారు) . చాలా కాలం అనంతరం, సెప్టెంబరు 11 న [[ప్రతివాది భయంకర వెంకటాచారి]]ని కాజీపేట రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు.
* రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, జపాన్ వైమానిక దళం, కాకినాడ మీద 1942 ఏప్రిల్ 6న దాడి చేసింది. ఈ దాడిలో రెండు ఓడలు పూర్తిగా ధ్వంసం కాగా, ఒకరు మృతి చెందారు<ref>{{cite web
| url = http://www.thehindu.com/news/cities/chennai/october-69-years-ago-when-madras-was-bombed/article3956159.ece
| title = October, 69 years ago, when Madras was bombed
| publisher = The hindu
| accessdate = 2014-05-09
}}</ref>
==పరిపాలన==
[[File:District Collector Office building at Kakinada.jpg|thumb|కాకినాడలోని తూర్పు గోదావరి జిల్లా కలక్టర్ కార్యాలయ సముదాయం]]
కాకినాడ పరిపాలన నిర్వహణని కాకినాడ నగరపాలక సంస్థ మరియు నగర కమిషనర్ నిర్వహిస్తారు. నగరంలో 50 వార్డులున్నాయి. ప్రతీ వార్డు నుండి ఒక కార్పొరేటర్, నగర పాలక సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తారు. తమలో ఒకరిని మేయరుగా కార్పొరేటర్లు ఎన్నుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం, ఐ.ఏ.ఎస్ స్థాయి అధికారిని నగర కమీషనరుగా నియమిస్తుంది. నగరంలో రెండు శాసన సభ స్థానాలు ఉన్నాయి. అవి కాకినాడ సిటీ, కాకినాడ రూరల్. పార్లమెంటులో ఈ ప్రాంత ప్రాతినిధ్యం కాకినాడ పార్లమెంటు స్థానం ద్వారా జరుగుతుంది.

37 పరిసర గ్రామాలను కాకినాడలో విలీనం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. తద్వారా నగర జనాభా 8 లక్షలకు చేరే అవకాశం ఉంది. ఆ గ్రామాలు<ref>{{cite web
| url = http://www.prabhanews.com/eastgodavari/article-290029
| title = గ్రామాల విలీన ప్రతిపాదన
| publisher = ఆంధ్ర ప్రభ
| accessdate = 2012-05-03
}}</ref>
1 రమణయ్యపేట 2 తిమ్మాపురం 3 వి వెంకటాపురం 4 పండూరు 5 నేమాం 6 పెనుమర్తి 7 తమ్మవరం 8 సూర్యారావుపేట 9 వాకలపూడి, 10 వలసపాకల 11 ఉప్పలంక, 12 గురజనాపల్లి, 13 చొల్లంగి, 14 చొల్లంగిపేట, 15 పెనుగుదురు, 16 కొరుపల్లి 17 నడకుదురు 18 జడ్‌ భావవరం, 19 అరట్లకట్ట 20 గొడ్డటిపాలెం, 21 కొవ్వూరు, 22 తూరంగి 23 కాకినాడ రెవెన్యూ విలేజ్‌, 24 కాకినాడ మేడలైన్‌, 25 ఇంద్రపాలెం, 26 చీడిగ, 27 కొవ్వాడ, 28 రేపూరు, 29 రామేశ్వరం, 30 గంగనాపల్లి, 31 స్వామినగర్‌, 32 ఎస్‌ అచ్యుతాపురం, 33 మాధవపట్నం, 34 సర్పవరం, 35 పనసపాడు, 36, అచ్చంపేట, 37 కొప్పవరం

==రవాణా సదుపాయాలు==
===రైలు సదుపాయం===
[[File:Kakinada Railway Station Bhanugudi Entrance.jpg|thumb|కాకినాడ టౌన్ రైలు సముదాయము]]
కాకినాడ మిగిలిన పట్టణాలతో [[సామర్లకోట]] -కాకినాడ లూప్-లైన్ ద్వారా కలుపబడి ఉంది. కాకినాడ స్టేషనులలో రైలుబళ్ళన్నీ కాకినాడ నుండే బయలుదేరుతాయి.
కాకినాడ నగరంలో నాలుగు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కాకినాడ పోర్ట్, కాకినాడ న్యూపోర్ట్, కాకినాడ టౌన్, సర్పవరం. ఇందులో కాకినాడ పోర్ట్ స్టేషను పూర్తిగా గూడ్స్ బళ్ళకు కేటాయించబడింది.
కాకినాడ రాష్ట్ర రాజధాని [[హైదరాబాదు]]కి 564 కి మీ ల దూరంలో ఉంది. [[చెన్నై]] - [[కోల్కతా]] రైలు మార్గంలో [[సామర్లకోట]] దగ్గర బండి మారాలి. ఈ మార్గంలో వెళ్లే బళ్ళలో సుమారుగా అన్నీ [[సామర్లకోట]] వద్ద ఆగుతాయి. [[సామర్లకోట]] నుండి కాకినాడ ప్రధాన బస్టాండ్ కి ఆం.ప్ర.రా.రో.ర.సం [[బస్సులు]] అన్ని వేళలా ఉంటాయి. దూరం 10 కి.మీ.

ప్రస్తుతం [[హైదరాబాదు]], [[చెన్నై]] (మద్రాసు), [[షిర్ది]], [[ముంబాయి]], [[బెంగుళూరు]] లకు నేరుగా రైలు సదుపాయముంది.

====కాకినాడ నుండి బయలుదేరే ద.మ రైల్వే ఎక్స్ ప్రెస్ రైళ్ళు====
* కాకినాడ టౌన్ - భావనగర్ ఎక్స్ ప్రెస్ /17204 (వయా [[విజయవాడ]], [[సికింద్రాబాద్]], [[వాడి]], [[పూణే]], కళ్యాణ్, [[సూరత్]], [[వడోదర]], [[అహ్మదాబాద్]])
* కాకినాడ టౌన్ - సాయినగర్ శిరిడీ ఎక్స్ ప్రెస్/17206 (వయా [[విజయవాడ]], [[సికింద్రాబాద్]], [[ఔరంగాబాద్]], [[మన్మాడ్]], [[సాయినగర్]])
* కాకినాడ పోర్ట్ - ముంబయి లోకమాన్య తిలక్ టర్మినస్ (వయా [[విజయవాడ]], [[సికింద్రాబాద్]], [[పూణే]])
* [[సర్కార్ ఎక్స్ ప్రెస్]] - కాకినాడ పోర్ట్ - చెన్నై /17644 (వయా [[విజయవాడ]], [[నెల్లూరు]])
* [[శేషాద్రి ఎక్స్ ప్రెస్]] - కాకినాడ టౌన్ - [[బెంగుళూరు]] సిటీ /17210 (వయా [[విజయవాడ]], [[తెనాలి]], [[రేణిగుంట]], [[తిరుపతి]], [[కాట్పాడి]])
* [[గౌతమి సూ.ఫా ఎక్స్ ప్రెస్]] - కాకినాడ పోర్ట్ - సికింద్రాబాద్ /12737 (వయా [[విజయవాడ]], [[వరంగల్]])
* కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ "కోకనాడ AC సూ.ఫా ఎక్స్ ప్రెస్"
* కాకినాడ - కొళ్ళాం స్పెషల్ /07211 (ప్రతీ ఏడాదీ వచ్చే స్పెషల్ రైలు)

====కాకినాడ నుండి బయలుదేరు పాసింజర్ రైళ్ళు====
* [[కాకినాడ - తిరుపతి ప్యాసింజరు]]/57458
* కాకినాడ పోర్ట్ - విజయవాడ ఫాస్ట్ పాసింజరు /57232
* కాకినాడ పోర్ట్ - విశాఖపట్నం పాసింజరు /57255
* 77271 [[కాకినాడ టౌన్ - కోటిపల్లి రైలు బస్సు]]

===రోడ్డు సదుపాయం===
[[File:Kkd Roads.JPG|thumb|right|alt=Four-lane road, with narrow grass median|నగరంలోని రహదారులు]]
214 నెంబరు [[జాతీయ రహదారి]] నగరం గుండా పోతుంది. [[రాజమండ్రి]], జిల్లాలోని ఇతర పట్టణలను కలుపుతూ రాష్ట్ర రహదారులు ఉన్నాయి. కాకినాడ ఓడరేవు, శివారు పారిశ్రామిక ప్రాంతాలైన [[వాకలపూడి]], వలసపాకల, [[సామర్లకోట]], [[పెద్దాపురం]] లను 5వ నెంబరు జాతీయ రహదారికి అనుసంధానిస్తూ ఆసియా అభివృద్ధి బ్యాంకు (Asian Development Bank) నిధులతో నిర్మించిన ADB రోడ్డు ఉంది. కాకినాడ నుండి [[ద్వారపూడి]], [[రాజమండ్రి]], [[జంగారెడ్డిగూడెం]], [[ఖమ్మం]] మీదుగా [[సూర్యాపేట]]కి పోయే రాష్ట్ర రహదారిని, జాతీయ రహదారిగా గుర్తించి, నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేసే ప్రతిపాదనలున్నాయి.<ref>{{cite web
| url = http://www.prabhanews.com/nalgonda/article-29272
| title = జాతీయ రహదారులు కానున్న రాష్ట్ర రహదారులు
| publisher = ఆంధ్ర ప్రభ
| accessdate = 2014-05-07
}}</ref>

ఇవే కాకుండా, [[విశాఖపట్నం]] - కాకినాడ చమురు సీమ ప్రాజెక్టులో భాగంగా, కాకినాడ నుండి [[విశాఖపట్నం]] వరకూ, సముద్ర తీరం వెంబడి నాలుగు-ఆరు వరుసల రహదారిని నిర్మించే ప్రతిపాదన ఉంది.<ref name=APPCPIR>{{cite web | url=http://www.incap.co.in/images/presentations/16pcpir-apiic.pdf | format=pdf | title=Advantage Andhra Pradesh, Petroleum, Chemical & Petrochemical Investment region - PCPIR; Visakhapatnam - Kakinada Corridor | publisher=Andhra Pradesh Industrial Infrastructure Corporation Ltd | accessdate=07 May 2014}}</ref>

===విమాన సదుపాయం===
కాకినాడకు 65 కి మీ దూరంలో [[రాజమండ్రి విమానాశ్రయం]] ఉంది. ఇది [[చెన్నై]], [[హైదరాబాద్]], [[విజయవాడ]], [[బెంగుళూర్]] లకు విమానయాన సేవలను కలిగి ఉంది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, జెట్ ఎయిర్ వేస్ మరియు స్పైస్ జెట్ ఇక్కడ ఆపరేటింగ్ ఎయిర్ లైన్స్. ఇతర సమీప ప్రధాన విమానాశ్రయం కాకినాడ నుండి 145 కి మీ దూరంలో విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.

విశాఖపట్నం - కాకినాడ చమురు సీమ ప్రాజెక్టులో భాగంగా, [[పిఠాపురం]] వద్ద కార్గో రవాణా కోసమై మరో విమానాశ్రయాన్ని నిర్మించే ప్రతిపాదనలున్నాయి.<ref name="APPCPIR"/>

==ఆర్థిక వ్యవస్థ==
1940 ల వఱకూ కాకినాడ చుట్టుపక్కల పరిశ్రమలు చాలా తక్కువగా ఉండేవి. స్థానిక ఆర్థిక వ్యవస్థ అంతా వ్యవసాయం, చేపల వేట పైననే ఎక్కువగా ఆధారపడి ఉండేది. 1980 లలో ఎరువుల కర్మాగారాలు స్థాపించిన తర్వాతి నుండి పరిశ్రమలు ప్రారంభమైనాయి. ఓడరేవు అందుబాటులో ఉండడం వలన, ఓడరేవు ఆధారిత పరిశ్రమల స్థాపన జరుగుతోంది

===ఓడరేవు===

[[File:Kkd lighthouse.JPG|thumb|right|alt=Red-and-white lighthouse at night|వాకలపూడి లైట్ హౌస్.]]
కాకినాడ తీరం నుండి 5 కి.మీ ల దూరంలో ఉన్న హోప్ ఐలాండ్, వలన కాకినాడ సహజసిద్ధమైన ఓడరేవు అయ్యింది. ప్రస్తుతం కాకినాడలో రెండు ఓడరేవులు పనిచేస్తున్నాయి.
* కాకినాడ లంగరు రేవు
* కాకినాడ డీప్ వాటర్ రేవు
కాకినాడ డీప్ వాటర్ రేవు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం ఓడరేవు తర్వాత రెండవ పెద్ద ఓడరేవు మరియు ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మించిన మొదటి ఓడరేవు. ఇది కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ సంస్థ ద్వారా నిర్వహింపబడుతోంది. డీప్ వాటర్ పోర్ట్ నిర్మించక ముందు నుండి ఉన్న కాకినాడ లంగరు రేవు, భారతదేశంలోని 40 చిన్న ఓడరేవులలో అతిపెద్దది. సింగపూర్ కి చెందిన సెంబవాంగ్ షిప్ యార్డ్ మరియు కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ లు సంయుక్తంగా, కాకినాడలో నౌకానిర్మాణకేంద్రాన్ని నిర్మిస్తున్నాయి.

కాకినాడ నుండి జరిగే ప్రధాన ఎగుమతులు; వ్యవసాయ ఉత్పత్తులు (వరి, గోధుమ, నూనెదినుసులు, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్) మరియు సముద్ర ఉత్పత్తులు ([[చేపలు]], [[రొయ్యలు]], [[పీతలు]]) . అంతేగాకుండా రసాయనాలు, ఇనుప ఖనిజం, సైబాక్టు, జీవ ఇంధనాలు కూడా ఎగుమతి అవుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు, వంటనూనెలు మొదలైనవి ప్రధాన దిగుమతులు.

ఇవి కాకుండా, విశాఖపట్నం - కాకినాడ చమురు సీమ ప్రాజెక్టులో భాగంగా, కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి కోసం ప్రత్యేకంగా మఱో ఓడరేవుని నిర్మించే ప్రతిపాదనలున్నాయి.<ref name="APPCPIR"/>
===పరిశ్రమలు===

====ఎరువులు====
[[File:Nagarjuna fertilizers.JPG|thumb|left|నాగార్జున ఎరువుల కర్మాగారం]]
[[File:Godavari fertilizers.JPG|thumb|right|alt=Factory with two smokestacks|కోరమాండల్ ఎరువుల కర్మాగారం]]
కాకినాడని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రపు "ఎరువుల నగరం (Fertilizer City) "గా కూడా పిలుస్తారు. నాగార్జున ఎరువుల కర్మాగారం (కోస్తా ఆంధ్రలో అత్యధికంగా యూరియా ఉత్పత్తి చేసే కేంద్రం), కోరమాండల్ ఎరువుల కర్మాగారం (డై అమ్మోనియం హైడ్రోజన్ ఫాస్పేట్ ఉత్పత్తి జరుగుతోంది) ఉన్నాయి.
====కొబ్బరికాయలు====
కాకినాడ పరిసర ప్రాంతాల నుండి, కొబ్బరికాయలను ఎగుమతి చేసే సంస్థలు చాలా ఉన్నాయి.
====పంచదార====
మురుగప్ప గ్రూపువారి ఈద్ పారీ (ఇండియా) మరియు కేర్గిల్ ఇంటర్నేషనల సంస్థల ఉమ్మడి పంచదార కర్మాగారం అయిన సిల్క్ రోడ్ సుగర్స్, 600, 000 టన్నుల సామర్థ్యం కలది. ఇది, ప్రధానంగా ఎగుమతి ఆధార పరిశ్రమ (Export Oriented Unit)
<ref>{{cite news|url=http://www.hindu.com/2006/04/25/stories/2006042503791900.htm |title="EID Parry teams up with Cargill for sugar EoU", ''The Hindu'' (25 April 2006) |work=The Hindu |location=India |date=25 April 2006 |accessdate=10 May 2014}}</ref>
====పెట్రోలియం మరియు సహజవాయువు====
[[File:ONGC Kkd.JPG|thumb|alt=Glass-block office building at night|ఓ.ఎన్.జి.సి ఇండియా— కాకినాడ కార్యాలయం]]

ఓ.ఎన్.జీ.సీ సంస్థ యొక్క తూర్పుతీర క్షేత్రాలకు కేంద్రస్థానం కాకినాడ. బేకర్ హ్యుగెస్, స్లంబర్జర్ వంటి కంపనీలు కాకినాడ సముద్ర తీరంలోని చమురు క్షేత్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దేశంలోని అతి పెద్ద సహజవాయు క్షేత్రంగా కృష్ణ-గోదావరి హరివాణం పేరుగాంచింది. ఓ.ఎన్.జి.సీ, జి.ఎస్.పీ.సి, రిలయన్స్ వంటి సంస్ఠలు నిర్వహించిన గాలింపు కార్యక్రమంలో విస్తారంగా సహజవాయు నిక్షేపాలు లభించాయి.

కాకినాడ నుండి 24 కి.మీ దూరంలో నున్న గాడిమొగ వద్ద రిలయన్స్, ఆన్ షోర్ టర్మినల్ ను నిర్మించింది. కె.జి డి6 లో లభించిన సహజవాయుని శుద్ధిచేసి, దేశంలోని ఇతర ప్రాంతాలకు పంపిణీ చేయడం జరుగుతోంది. రిలయన్స్ గ్యాస్ ట్రాన్స్ పోర్టేషన్ లిమిటెడ్, కాకినాడ నుండి భరూచ్ (గుజరాత్) వఱకూ పైపులైన్లను నిర్మించింది. రోజుకి 120 మిలియన్ క్యూబిక్ మీటర్ల సహజవాయువు, కాకినాడ నుండి భారతదేశపు పశ్చిమ తీరానికి సరఫరా చేయబడుతోంది.

2010 సంవత్సరంలో చమురు & సహజవాయువుల నియంత్రణా మండలి, కాకినాడ గ్యాసు సరఫరా వ్యవస్థని భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కు అప్పగించింది. ఈ సంస్ఠ మొదటి దశలో కాకినాడతో బాటు [[హైదరాబాదు]], [[విజయవాడ]] నగరాలలో ఇంటింటికీ గ్యాసు పైపులైన్లని నిర్మిస్తోంది. తద్వారా కాకినాడ నగరంతో బాటు, శివారు పట్టణాలైన [[సామర్లకోట]], [[పెద్దాపురం]] మరియు [[పిఠాపురం]] లలో కూడా గ్యాస్ సరఫరా పైపులు నిర్మించబడుతున్నాయి.

విశాఖపట్నం నుండి కాకినాడ వఱకూ ఏర్పాటు చేయదలచిన ఆంధ్రప్రదేశ్ చమురు సీమ (APPCPIR) లో భాగంగా కాకినాడ వద్ద భారీ రిఫైనరీలను నిర్మించడానికి జి.ఎం.ఆర్, రిలయన్స్ వంటి సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.<ref name="APPCPIR"/>. తద్వారా, ఈ ప్రాంతం గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందని భావిస్తున్నారు. కేవలం చమురుసీమ ద్వారా 7-8 లక్షలమందికి ప్రత్యక్ష ఉపాధి, 50 లక్షలమందికి పరోక్ష ఉపాధి లభిస్తాయని అంచనా.<ref>{{cite web | url=http://www.prabhanews.com/vishakapatnam/article-227437 | title=పెట్రో కారిడార్‌ ద్వారా ఉపాధి అవకాశాలు మెండు పిసిపిఐఆర్‌ వర్క్‌షాపులో పురంధేశ్వరి | publisher=ఆంధ్రప్రభ | accessdate= 10 May 2014}}</ref>. కాకినాడ సముద్రతీరం వద్ద, ద్రవరూప సహజవాయువు (Liquified Natural Gas - LNG) ని నిలువజేసేందుకు, షెల్ సంస్థ (Shell), గెయిల్ సంస్థ (GAIL) లు సంయుక్తంగా, ఎల్.ఎన్.జి టర్మినల్ ను నిర్మిస్తున్నాయి.<ref name = LNG>{{cite web | url=http://www.business-standard.com/article/companies/shell-to-join-gail-s-kakinada-lng-project-with-30-stake-113112400407_1.html | title=Shell to join GAIL's Kakinada LNG project with 30% stake | publisher=Business Standard | accessdate= 10 May 2014}}</ref>.
====వంట నూనెలు మరియు జీవ ఇంధనాలు====
2002 సంవత్సరంలో, కాకినాడ పరిసరాల్లో అనేక వంటనూనె కర్మాగారాలు స్థాపించబడ్డాయి. అదానీ విల్మార్, రుచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, నిఖిల్ రిఫైనరీ, భగవతి రిఫైనరీ, మొదలైనవి రోజుకి 3000 టన్నులకి పైగా వంటనూనెలను ఉత్పత్తి చేయగలవు. ఈ కర్మాగారాలకి అవసరమైన ముడి పామాయిల్, సోయాబీన్ నూనె, ఓడరేవునుండి దిగుమతి అవుతున్నాయి.<ref>{{cite web|url=http://www.thehindubusinessline.com/2002/03/29/stories/2002032900211300.htm |title=Nikhil, Acalmar edible oil refineries go on stream |work=The Hindu |date=29 March 2002 |accessdate=10 May 2014}}</ref>

వాకలపూడిలోని పారిశ్రామిక వనం, జీవ ఇంధన కంపెనీలనుండి $10 మిలియన్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఇక్కడ పెట్టుబడులు పెట్టిన వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్, నేచురోల్ బయో ఎనర్జీ, యూనివర్సల్ బయోఫ్యూయల్స్<ref>{{cite web|url=http://www.universalbiofuelsltd.com/ |title=Universalbiofuelsltd.com |publisher=Universalbiofuelsltd.com |accessdate=10 May 2014}}</ref><ref name=autogenerated1>{{cite web|url=http://www.moneycontrol.com/india/news/business/bio-fuel-is-next-big-bet-if-crude-continues-to-rise/17/26/345655 |title=>> News >> Business >> Bio-fuel is next big bet if crude continues to rise |publisher=Moneycontrol |accessdate=10 May 2014}}</ref> మొదలైనవి ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, జత్రోఫా సాగు కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. నాణ్యమైన జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు వాడే ఈ జత్రోఫా పంటని సాగుచేసేందుకు, కాకినాడ పరిసరాల్లో 200 ఎకరాలను కంపెనీ సేకరించింది.<ref>{{cite web|url=http://www.livemint.com/2008/07/20232412/Reliance8217s-new-biofuel-b.html |title=Reliance's new biofuel business model to provide fuel with food |publisher=Livemint.com |date=20 July 2008 |accessdate=10 May 2014}}</ref>
====విద్యుదుత్పత్తి====
కాకినాడ పరిసర ప్రాంతాలలో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు చాలా ఉన్నాయి. ఉప్పాడ బీచ్ రోడ్డునందు, స్పెక్ట్రం పవర్ జనరేషన్ సంస్థకి 208 మెగావాట్ల కేంద్రం ఉంది. భారతదేశంలోని వాణిజ్య విద్యుదుత్పత్తి కేంద్రాలలో ఇది ఒకటి. ఉత్పత్తి సామర్థ్యాన్ని 1350 మెగావాట్లకి పెంచుకునేందుకు సంస్థ సిద్ధపడుతున్నది<ref>{{cite web|url=http://www.spgl.co.in |title=SPGL.co.in |publisher=SPGL.co.in |accessdate=10 May 2014}}</ref>. [[సామర్లకోట]]లో రిలయన్స్ ఎనర్జీ సంస్థకి చెందిన 220 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రం<ref>{{cite news| url=http://articles.economictimes.indiatimes.com/2011-01-22/news/28429445_1_power-plant-samalkot-plant-turbines |work=The Times of India |location=India |title= Anil Ambani monitors progress at Samalkot Plant |date=22 January 2011}}</ref>, [[పెద్దాపురం]]లో జి.వి.కే సంస్థకి చెందిన 469 మెగావాట్ల (కంబైన్డ్ సైకిల్) గౌతమి విద్యుదుత్పత్తి కేంద్రం పనిచేస్తున్నాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందం ద్వారా, ఈ సంస్థలు ఏ.పి ట్రాన్స్ కో కి, విద్యుచ్ఛక్తిని విక్రయిస్తాయి. రిలయన్స్ సంస్థ, [[సామర్లకోట]]లో 2400 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నది. 2010 నవంబరులో భారతదేశ పర్యటనకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, [[సామర్లకోట]] విద్యుదుత్పత్తి కేంద్రానికి టర్బైన్లను నిర్మించే ఇచ్చే కాంట్రాక్టుని, అమెరికాకు చెందిన జి.ఈ సంస్థకి కుదుర్చుకున్నాడు<ref>{{cite news| url=hhttp://www.thehindu.com/news/international/samalkot-on-obamas-strategic-map/article1116488.ece |work=The Hindu |location=India |title= Samalkot on Obama’s strategic map |date=22 January 2011}}</ref>. జి.వి.కె సంస్థ, గౌతమి విద్యుదుత్పత్తి కేంద్ర సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తోంది<ref>{{cite news| url=http://profit.ndtv.com/news/market/article-l-t-bags-rs-827-crore-orders-for-thermal-power-plant-construction-96921 |work=ND TV |location=India |title= L&T bags Rs. 827 crore orders for thermal power plant construction |date=25 November 2011}}</ref>.

అయితే, గెయిల్ సంస్ఠ సరఫరా సరిగా లేకపోవడం వలన, రిలయన్స్ అధీనంలో ఉన్న కె.జి-డి6 బేసిన్లో ఉత్పత్తి మందగించడం వలన, ఈ విద్యుత్ కేంద్రాలకి గ్యాసు అందడం లేదు<ref>{{cite news| url=http://www.thehindu.com/todays-paper/tp-national/gasbased-power-projects-shutting-down-units/article4621868.ece|work=The Hindu |location=India |title= Gas-based power projects shutting down units |date=13 April 2013}}</ref>. అందువలన, ప్రస్తుతం ఈ కేంద్రాలలో విద్యుదుత్పత్తి బహుకొద్దిగా జరుగుతున్నది. కాకినాడ సముద్రతీరం వద్ద నిర్మిస్తున్న ఎల్.ఎన్.జి టర్మినల్, వినియోగంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ సరఫరా ఇబ్బందులని అధిగమించవచ్చునని ఈ సంస్థలు ఆశిస్తున్నాయి<ref name="LNG"/>.. అంతేగాకుండా, మరిన్ని గ్యాసు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు వచ్చే అవకాశం ఉంది.
====సమాచార సాంకేతిక విజ్ఞానం (ఐ.టీ)====
ఆంధ్రప్రదేశ్ ఐ.టీ పరిశ్రమలో కాకినాడ ద్వితీయ శ్రేణి నగరంగా పరిగణింపబడుతోంది. 2007 సంవత్సరంలో [[కంప్యూటర్ సాఫ్ట్‌వేర్|సాఫ్ట్ వేర్]] టెక్నాలకీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఐ.టీ పార్కుని స్థాపించినప్పటి <ref>{{cite web|url=http://www.kkd.stpi.in/ |title=Software Technology parks of India, Kakinda |publisher=www.kkd.stpi.in |accessdate=09 May 2014}}</ref> నుండి, కాకినాడలో వివిధ ఐ.టీ కంపెనీలు పనిచేయడం ప్రారంభించాయి.

ఉభయ గోదావరి జిల్లాలోని ఐ.టీ కంపెనీల సంఘం అయిన "గోదావరి ఐ.టీ అసోసియేషన్" (GITA), కాకినాడ కేంద్రంగా పనిచేస్తోంది<ref>{{cite news| url=http://articles.timesofindia.indiatimes.com/2011-02-14/india/28542408_1_kakinada-talent-pool-engineering-colleges |work=The Times of India |location=India |title=Kakinada zooms ahead as an IT hub- |date=14 February 2011}}</ref>. ఇందులో దాదాపు 35 కంపెనీలు ఉన్నాయి. 2012-13 సంవత్సరంలో కాకినాడ నుండి రూ 35 కోట్ల విలువైన సాఫ్ట్ వేర్ ఎగుమతులు జరిగాయి. ఈ ఎగుమతులలో హైదరాబాదు, విశాఖపట్నం తర్వాత కాకినాడది మూడో స్థానం.<ref>{{cite web
| url = http://www.thehindu.com/todays-paper/tp-national/kakinada-making-strides-in-it-industry/article3252470.ece
| title = Kakinada making strides in IT industry
| publisher = The hindu
| accessdate = 2014-05-08
}}</ref>

కాకినాడలో, రూ 180 కోట్లతో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ (Indian Institute of Information Technology - IIIT) ని నిర్మించడానికి శంకుస్థాపన జరిగింది.<ref name = IIITK>{{cite web
| url = http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/pallam-raju-lays-foundation-for-iiit/article5625575.ece
| title = ఐఐఐటీ కి పల్లంరాజు శంకుస్థాపన
| publisher = ది హిందూ
| accessdate = 2014-05-09
}}</ref> తద్వారా మరిన్ని ఐ.టీ కంపెనీలు రావడానికి అవకాశం కలుగుతోంది.
కాకినాడలో పనిచేస్తున్న కొన్ని ప్రముఖ కంపెనీలు
* ఇన్ఫోటెక్ ఎంటర్ ప్రైజెస్<ref>{{cite web|url=http://www.infotech-enterprises.com/ |title=Infotech-enterprises.com |publisher=Infotech-enterprises.com |accessdate=20 November 2011}}</ref>
* అవినియాన్<ref>{{cite web|url=http://www.avineon.com/ |title=Avineon.com |publisher=Avineon.com |accessdate=20 November 2011}}</ref>
* ఫస్ట్ ఆబ్జెక్ట్ టెక్నాలజీస్ <ref>{{cite web|url=http://firstobjectindia.com/ |title=Firstobjectindia.com |publisher=Firstobjectindia.com |accessdate=09 May 2014}}</ref>
* క్రిఫీ <ref>{{cite web|url=http://www.krify.com/ |title=Krify.com |publisher=Krify.com |accessdate=09 May 2014}}</ref>
* ప్రొమినెర్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్<ref>{{cite web|url=http://www.prominere.com/ |title= SEO & Web Designing and Development Company |publisher=www.prominere.com |accessdate=09 May 2014}}</ref>
* 3ఒన్ టెక్నాలజీస్<ref>{{cite web|url=http://www.3one.in/ |title=3one.in |publisher=3one.in |accessdate=09 May 2014}}</ref>
* ట్రివ్యూపోర్ట్ టెక్నాలజీస్<ref>{{cite web|url=http://www.trewport.com/ |title=Trewport.com |publisher=Trewport.com |accessdate=09 May 2014}}</ref>
* ఆస్పైర్ టెక్నాలజీస్<ref>{{cite web|url=http://www.aaspiretechnologies.com/ |title=Aaspiretechnologies.com |publisher=Aaspiretechnologies.com |accessdate=09 May 2014}}</ref>
* ట్రేస్ అవుట్ టెక్నాలజీస్ <ref>{{cite web|url=http://www.traceout.com/ |title=Traceout.com |publisher=Traceout.com |accessdate=09 May 2014}}</ref>
* ఫోర్ టెల్ టెక్నాలజీస్ <ref>{{cite web|url=http://www.fore-tell.com/ |title=Fore-tell.com |publisher=Fore-tell.com |accessdate=20 November 2011}}</ref>
* మైత్రి సొల్యూషన్స్<ref>{{cite web|url=http://www.mythrii.com/ |title=Mythrii.com |publisher=Mythrii.com |accessdate=09 May 2014}}</ref>
* నైరోస్ టెక్నాలజీస్ <ref>{{cite web|url=http://www.nyros.com/ |title=Nyros.com |publisher=Nyros.com |accessdate=09 May 2014}}</ref>
* మెకాంజీ ఇన్ఫోటెక్ & సాఫ్ట్ వేర్ సర్వీసెస్<ref>{{cite web|url=http://www.meconzee.com/ |title=Meconzee.com |publisher=Meconzee.com |accessdate=09 May 2014}}</ref>
* ఈస్టీ సొల్యూషన్స్

====ఎలక్ట్రానిక్స్====
కాకినాడలో ఉన్న ఆంధ్రా ఎలక్ట్రానిక్స్ లి. సంస్థ, 1977 నుండి ఎలక్ఱ్రానిక్ వస్తువులను తయారుచేస్తోంది.<ref>{{cite web|url=http://www.andhraelec.com/ |title=Andhraelec.com |publisher=Andhraelec.com |accessdate=17 August 2014}}</ref> కాకినాడ రేవు, పరిసర ప్రాంతాలలో ఎగుమతి ఆధారిత ఎలక్ట్రానిక్ వస్తు పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు, 2014-15 కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రసంగం, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.<ref>{{cite web|url=http://www.sakshi.com/news/top-news/hardware-park-to-set-up-in-kakinada-147171 |title=కాకినాడ కేంద్రంగా హార్డ్ వేర్ పార్క్ |publisher=www.sakshi.com|accessdate=17 August 2014}}</ref>
==ఆసుపత్రులు==
కాకినాడలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. వాటిల్లో కాకినాడ [[ప్రభుత్వ ఆసుపత్రి]], అపోలో హాస్పిటల్స్, శ్రీబాల ఈ.ఎన్.టీ కేర్, క్రిస్టియన్ కేన్సర్ హాస్పిటల్, కేర్ ఆసుపత్రి, సాయిసుధ ఆసుపత్రి, డి. వి రాజు కంటి ఆసుపత్రి, నయన ఐ కేర్ మొదలైనవి ఉన్నాయి.

==విద్యాసంస్థలు==
కాకినాడలో ఉన్న విద్యా పీఠాలు:
[[File:C B M Simpson Memorial Aided School at Kakinada.jpg|thumb|C B M సింప్సన్ స్మారక ప్రాథమికోన్నత పాఠశాల, కాకినాడ]]
* పిఠాపురం రాజావారి కళాశాల (P. R. College), ఇది చాల రోజులబట్టి ఉన్న కళాశాల. [[రఘుపతి వేంకటరత్నం నాయుడు|రఘుపతి వెంకటరత్నంనాయుడు]], [[వేమూరి రామకృష్ణారావు]] వంటి ఉద్దండులు ఇక్కడ పని చేసేరు. పిఠాపురం రాజావారి కళాశాల అత్యంత ప్రాచీనమైన కళాశాలగా ప్రాముఖ్యత సంతంరించుకున్నది. ఈ కళాశాలలో ఇంటర్, డిగ్రీ, పి.జి.విభాగాలలో అభ్యసించవచ్చును.
* జవాహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఇంజనీరింగు కళాశాల (JNTU Engineering College) . ఇది ఆంధ్రాలో మొట్టమొదటి ఇంజనీరింగు కళాశాల. మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రా విడిపోయినప్పుడు, విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో పెట్టాలన్న ఉద్దేశంతో గిండీ ఇంజనీరింగు కాలేజీ నుండి దీనిని విడదీసేరు. మొదట్లో గిండీలో ఉన్న ఆచార్యబృందాన్నే ఇక్కడికి బదిలీ చేసేరు. కాని వాల్తేరులో వనరులు లేక కాకినాడలో తాత్కాలికంగా పెట్టేరు. అది అలా అక్కడే 'ప్రభుత్వ ఇంజనీరింగు కళాశాల, కాకినాడ' (Government College of Engineering, Kakinada) అన్న పేరుతో స్థిరపడి పోయింది. తరువాత [[జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం]] (Jawaharlal Nehru Technological University) స్థాపించిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగు కళాశాలలన్నిటిని ఈ కొత్త విశ్వవిద్యాలయానికి అనుబంధించేరు.
* భారతీయ సమాచార సాంకేతిక విద్యాసంస్థ (Indian Institute of Information Technology) కి శంకుస్థాపన జరిగింది.<ref name="IIITK"/>
* ఆంధ్రా పాలీటెక్నిక్‌
*[[యమ్.యస్.యన్ ఛారిటీస్]]
* ఆంధ్ర విశ్వవిద్యాలయం - స్నాతకోత్తర విద్యా కేంద్రం (Andhra University - Post-graduate Extension Center)
* రంగరాయ వైద్య కళాశాల
[[File:Entr.JPG|thumb|right|alt=Two gateways next to white building|రంగరాయ వైద్య కళాశాల ముఖద్వారం]]

* కాకినాడ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (KIET, KIET2, KIETW)
* ఐడియల్ కళాశాలలు (Ideal College)
* ఐడియల్ ఇంజినీరింగ్ కళాశాల
* ప్రగతి ఇంజనీరింగు కాలేజి
* ఆదిత్య ఇంజనీరింగు కాలేజి
* సాయి ఆదిత్య ఇంజనీరింగు కాలేజి
* శ్రీ ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల
* చైతన్య ఇంజనీరింగు కాలేజి
* ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజిమెంట్, కు శంకుస్థాపన జరిగింది.<ref>{{cite web
| url = http://www.prabhanews.com/eastgodavari/article-371104
| title = జిల్లాకు ‘మెగా’ పర్యాటక కళ
| publisher = ఆంధ్ర ప్రభ
| accessdate = 2014-05-10
}}</ref>

* శ్రీ రామకృష్ణా పబ్లిక్ స్కూల్
* ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్
* కాకినాడ పబ్లిక్ స్కూల్, వలసపాకల
* గాంధీ సెంటినరీ పాఠాశాల
* నెహ్రూ కాన్వెంట్ హై స్కూల్, ఎం.ఎస్.ఎన్ ఇంగ్లీషు మీడియం పాఠాశాల
* సీహార్స్ అకాడమీ ఆఫ్ మర్చంట్ నేవీ
* రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ అండ్ సైన్స్ Rajiv Gandhi Institute of Management and Science
* సెయింట్ జోసఫ్ కాన్వెంట్ స్కూల్
* టాగూరు కాన్వెంట్ హై స్కూల్
* [[సర్కార్ పబ్లిక్ స్కూల్]]

== ప్రత్యేకతలు==
కాకినాడ ఊరు పేరు చెప్పగానే నోరూరే విషయాలు రెండు. ఒకటి కోటయ్య కాజాలు. ఇవి తాపేశ్వరం మడత కాజాల వంటి కాజాలు కావు. సన్నంగా, కోలగా దొండకాయలాగా ఉంటాయి., కొరగ్గానే లోపల ఉన్న పాకం జివ్వున నోట్లోకి వస్తుంది. వీటిని గొట్టం కాజాలని కూడా అంటారు. తరువాత చెప్పుకోవలసినది నూర్జహాన్ కిళ్ళీ. ఇది [[తుని]] తమలపాకులతో చేసే మిఠాయి కిళ్ళీ.
అలాగే కాకినాడలోని సుబ్బయ్య హోటలు. సంప్రదాయబద్ధంగా అరటి ఆకులో వడ్డించే ఇక్కడి అద్భుతమయిన భోజనానికి చాల ప్రశస్తి ఉంది.
ఆసియాలో మొదటి బయో డీజల్ తయారి ఇక్కడ ఉంది.

కాకినాడలో వున్న ప్రఖ్యాత మెక్లారెన్ స్కూలు వంద సంవత్సరాల చరిత్ర గలది.

==నగరం లో షాపింగ్==
[[File:Spencers Hyper Market in Kakinada.jpg|thumb|కాకినాడలో స్పెన్సర్స్ (Spencers Hyper Market) ]]
కాకినాడ నగరం ఈ మధ్య కాలంలో అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి. పెరుగుతున్న జనాభాతో పాటు పెరుగుతున్న అవసరాలకు అణుగుణంగా నగరంలో పలు షాపింగ్ మాల్స్ వెలిశాయి. ప్రముఖంగా చందన బ్రదర్స్ ఎప్పటి నుంచో నగర వాసులకు వస్త్ర రంగంలో తమ సేవలను అందజేస్తుండగా ఆ పైన సరికొత్తగా సర్పవరం జంక్షన్ లో స్పెన్సర్స్ వెలసింది. ఆంధ్ర ప్రదేశ్ లో హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ నగరాల తరువాత కాకినాడలోనే ఇది ఉంది. అలాగే విజయవాడ వారి ఎం అండ్ ఎం మరొకటి ఇది స్దాపింఛి రెండేళ్ళు కావస్తోంది. అలాగే నగరంలోని రాజు భవన్, ఇంకా సోనా షాపింగ్ మాల్స్ నగర వాసులకు సేవలను అందజేస్తున్నాయి. ఇంకా మరెన్నో యూనివెర్ సెల్ మొబైల్స్, ది మొబైల్ స్టొర్, బిగ్ సి వంటి ప్రముఖ మొబైల్ షాపులు మొబైల్ వినియొగదారులకు తమ తమ సేవలను అందజేస్తున్నాయి. బంగారు నగల కొరకు దక్షిణ భారతదేశంలోనే ప్రఖ్యాతి గాంచిన ఖజానా జ్యువెల్లరి కాకినాడలో వెలసి తమ సేవలను అందిస్తుండగా టాటా వారి గోల్డ్ ప్లస్, చందన జ్యువెల్లరిస్, రాజ్ జ్యువెల్లరి మాల్, మహ్మద్ ఖాన్ అండ్ సన్స్ జ్యుయలర్స్ ఇంకా స్దానికంగా ఉన్న మరెన్నొ నగల దుకాణాలు నగర వాసుల అవసరాలను తీరుస్తున్నాయి. నగర ప్రజలను ఎక్కువగా స్దానికంగా ఉన్న హొల్ సేల్ షాపులు వారి తక్కువ ధరలతో ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక నగరంలో కట్టుబాటుల గురించి వారి వస్త్రధారణ గురించి చెప్పుకుంటే మగవారు ఎక్కువగా ఇంటిలో ఉన్నప్పుడు [[లుంగీ]]<nowiki/>లను కట్టుకుంటారు. ఆడవారు నైటీలను, కాటన్ చీరలను, పంజాబి దుస్తులను ధరిస్తూ ఉంటారు. ఇక బట్టల దుకాణాల విషయానికి వస్తె వైభవ్ షాపింగ్ నూతనంగా స్థాపించబడి విశెష ఆదరణను పొందుతున్నది.

==నగరంలోని, సమీపంలోని దర్శనీయ స్థలాలు==
[[File:Pandavula Metta caves 09.JPG|thumb|left|పాండవుల మెట్ట గుహలు, పెద్దాపురం]]
[[File:Inscriptions at Sarpavaram temple.JPG|thumb|సర్పవరం శాసనాలు, సర్పవరం]]
[[File:Draksharama.jpg|thumb|left|భీమేశ్వరస్వామి గుడి, ద్రాక్షారామ]]
[[దస్త్రం:Padagaya.JPG|thumb|కుక్కుటేశ్వరస్వామి గుడి, పిఠాపురం]]
కాకినాడ పరిసరాల్లోని ప్రాంతాలలో [[చాళుక్యులు|చాళుక్యు]]<nowiki/>ల కాలంనాటి [[దేవాలయాలు]], పాండవుల కాలంనాటివి చెప్పబడుతున్న [[గుహలు]], ప్రాచీన తెలుగు శిలా శాసనాలు అనేకం ఉన్నాయి. [[సామర్లకోట]] లోని కుమారారామ భీమేశ్వరస్వామి దేవాలయంలో క్రీ.శ 7వశతాబ్దం నాటిదిగా భావిస్తున్న చాళుక్యుల తెలుగు శాసనాన్ని ఇటీవలే గుర్తించారు. [[తెలుగు భాష]]కి సంబంధించిన అత్యంత ప్రాచీన శిలాశాసనాలలో ఇది ఒకటిగా భావిస్తున్నారు <ref>{{cite web
| url = http://www.thehindu.com/news/national/andhra-pradesh/early-telugu-inscription-found/article5542263.ece
| title = Early Telugu inscription found
| publisher = The hindu
| accessdate = 2014-05-10
}}</ref>. [[సామర్లకోట]]లోనే, మాండవ్య మహర్షి ప్రతిష్ఠించిన మాండవ్య నారాయణ స్వామికి చోళరాజైన 2వ పులకేశి మునిమనుమడైన విజయాదిత్యుడు క్రీ||శ||655 నం||లో ఆలయాన్ని నిర్మించాడని చారిత్రకగాధ. ఆలయ స్తంభాలపై [[ప్రాకృతం|ప్రాకృత భాష]]లో అనేక శిలాశాసనాలు కనిపిస్తాయి. అలనాటి శిల్పులు కళావైభవానికి, యాంత్రిక ప్రతిభకు, వాస్తు విజ్ఞానానికి, సాంకేతిక పరిజ్ఞానానికి ఈ ఆలయం ఒక ప్రతీకగా నిలుస్తుంది. ఉత్తరాయణం - దక్షిణాయనం మధ్య కాలంలో శ్రీ నారాయణస్వామి వారి పాదాలపై సూర్యకిరణాలు నేరుగా పడటం అలనాటి ఆలయ నిర్మాణ కౌశలంగా చెప్పవచ్చు.

[[బిక్కవోలు]] గ్రామంలోని దేవాలయల్లో కూడా ప్రాచీన శాసనాలు, చాళుక్యుల కాలంనాటి శిలావిన్యాసాలను చూడవచ్చు. వీటిల్లో తూర్పు చాళుక్యుల కాలంనాటి, వినాయకుని 11 అడుగుల ఏకశిలావిగ్రహం, గోలింగేశ్వరస్వామి దేవస్థానం, శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం, శ్రీ చంద్రశేఖరస్వామి దేవాలయం ముఖ్యమైనవి. సర్పవరంలోని భావనారాయణస్వామి దేవస్థానంలోనూ, పిఠాపురంలోని కుక్కుటేశ్వరస్వామి దేవస్థానం, కుంతీ మాధవస్వామి దేవస్థానంలోనూ, ద్రాక్షారామ భీమేశ్వరస్వామి దేవస్థానంలోనూ కూడా ప్రాచీన శిలా శాసనాలను చూడవచ్చు.

చూడదగిన ప్రదేశాలు
* ఉప్పాడ బీచ్ (కాకినాడ నుండి 7 కి.మీ )
* హోప్ ఐలాండ్
* భావనారాయణస్వామి దేవస్థానం, సర్పవరం, కాకినాడ
* మంగళాంబికా సమేత ఆదికుంభేశ్వరస్వామి దేవాలయం (రావణబ్రహ్మ గుడి), ఉప్పాడ, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావణునికి పుజాభిషేకాలు జరిగే ఏకైక ఆలయం.
* అవతార్ మెహెర్ బాబా సెంటర్, రామారావు పేట, కాకినాడ
* కుమారారామ భీమేశ్వర స్వామి దేవస్థానం, [[సామర్లకోట]]: పంచారామ క్షేత్రాలలో ఒకటి. (కాకినాడ నుండి 12 కి.మీ)
* మాండవ్య నారాయణస్వామి దేవస్థానం, [[సామర్లకోట]] (కాకినాడ నుండి 12 కి.మీ)
* మరిడమ్మ దేవస్థానం, [[పెద్దాపురం]] (కాకినాడ నుండి 16 కి.మీ)
* పాండవుల మెట్ట, [[పెద్దాపురం]] (కాకినాడ నుండి 16 కి.మీ)
* కుక్కుటేశ్వరస్వామి దేవస్థానం, [[పిఠాపురం]]: 'పాదగయ' క్షేత్రం మరియు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. అమ్మవారి పేరు పురుహూతికా దేవి. (కాకినాడ నుండి 20 కి.మీ)
* కుంతీమాధవస్వామి దేవస్థానం, [[పిఠాపురం]] (కాకినాడ నుండి 20 కి.మీ)
* సూర్యనారాయణస్వామి దేవస్థానం, గొల్లల మామిడాడ (కాకినాడ నుండి 20 కి.మీ)
* భీమేశ్వర స్వామి దేవస్థానం, [[ద్రాక్షారామ]]: అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి మరియు పంచారామ క్షేత్రాలలో ఒకటి. అమ్మవారి పేరు మాణిక్యాంబా దేవి. (కాకినాడ నుండి 25 కి.మీ)
* కోరంగి అభయారణ్యం
* [[యానాం]] (కాకినాడ నుండి 26 కి.మీ)
* కోటిలింగేశ్వరస్వామి దేవస్థానం, [[కోటిపల్లి]] (కాకినాడ నుండి 30 కి.మీ)
* బిక్కవోలు లోని ప్రాచీన దేవాలయాలు: జాతీయ వారసత్వ సంపదగా గుర్తింపు ఉన్న శిల్పాలు అనేకం ఉన్నాయి. (కాకినాడ నుండి 32 కి.మీ)
* వీరేశ్వరస్వామి దేవస్థానం, [[మురముళ్ల]] (కాకినాడ నుండి 38 కి.మీ)
* శృంగార వల్లభస్వామి దేవస్థానం (తొలి తిరుపతి), దివిలి, [[పెద్దాపురం]] (కాకినాడ నుండి 40 కి.మీ)
* శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం, [[అన్నవరం]] (కాకినాడ నుండి 45 కి.మీ)
* [[తలుపులమ్మ లోవ]], తుని దగ్గర, (కాకినాడ నుండి 55 కి.మీ)

==ప్రముఖ వ్యక్తులు==
*[[బారు అలివేలమ్మ]]
*[[పావులూరి మల్లన]] - 11వ శతాబ్దానికి చెందిన తొలితరం తెలుగు కవి, గణితవేత్త. గణితసార సంగ్రహము అనె గణితగ్రంధాన్ని వ్రాశాడు. దీనికే పావులూరి గణితము అని పేరు.
*[[మల్లాది సత్యలింగం నాయకర్]]- 19వ శతాబ్దానికి చెందిన వాణిజ్యవేత్త, సంఘసేవకుడు.
*[[కొమ్మిరెడ్డి సూర్యనారాయణమూర్తి]] - 20వ శతాబ్దానికి చెందిన వాణిజ్యవేత్త, సంఘసేవకుడు. 1914 నుంచి 1926 వరకూ కాకినాడ పురపాలకసంఘానికి అధ్యక్షునిగా పనిచేశారు.<ref name="కొమ్మిరెడ్డి సూర్యనారాయణమూర్తిగారి జీవితం">{{cite book|last1=బుద్ధవరపు|first1=పట్టాభిరామయ్య|title=కొమ్మిరెడ్డి సూర్యనారాయణమూర్తి గారి జీవితము|date=1927|location=రాజమండ్రి|page=14|url=http://www.sundarayya.org/pdf2/%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%20%E0%B0%AC%E0%B0%B9%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6%E0%B0%B0%E0%B1%81%20%E0%B0%95%E0%B1%8A%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF%20%E0%B0%B8%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%AE%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF.pdf|accessdate=11 April 2015}}</ref>
*[[ప్రతివాది భయంకర వెంకటాచారి]] - విప్లవకారుడు మరియు [[కాకినాడ బాంబు కేసు]]లో ముద్దాయి.
*[[ఎస్.వి. రంగారావు]] - సుప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు
*[[చిత్తజల్లు శ్రీనివాసరావు]] - సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు మరియు నటుడు
*[[సి.పుల్లయ్య]] - మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు
*[[సూర్యకాంతం]] - ఆంధ్రుల అభిమాన గయ్యాళి అత్త
*[[రావు గోపాలరావు]] - తెలుగు సినిమా నటుడు మరియు రాజ్యసభ సభ్యుడు (1986-1992)
*[[చాగంటి కోటేశ్వరరావు]]
*
* [[ర్యాలి ప్రసాద్ ]]
*
*[[గరికపాటి నరసింహారావు]]
*[[కాళ్ళకూరి నారాయణరావు]]
*[[తల్లాప్రగడ సుబ్బారావు]]
*[[కంచర్ల సుగుణమణి]]
*[[మాకినీడి సూర్య భాస్కర్]]
*
*
*
*
*
*
*[[ఎనుముల సావిత్రీదేవి]]
*[[అర్జా జనార్ధనరావు]]
*[[అద్దేపల్లి రామమోహనరావు]]
*

==ఇవి కూడా చూడండి==
*[[హోప్‌ ఐలాండ్]]
*[[కాకినాడ పోర్టు]]

==బయటి లింకులు==

==గణాంకాలు==
{{commons category|Kakinada}}
* http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14

==మూలాలు==
{{reflist}}

==మూసలు, వర్గాలు==
{{తూర్పు గోదావరి జిల్లా మండలాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్ర ప్రదేశ్}}

[[వర్గం:కాకినాడ]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ తీర పట్టణాలు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా పట్టణాలు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ ఓడరేవులు]]

04:25, 28 డిసెంబరు 2018 నాటి కూర్పు

  ?కాకినాడ
ఆంధ్ర ప్రదేశ్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 16°56′N 82°13′E / 16.93°N 82.22°E / 16.93; 82.22
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 2 మీ (7 అడుగులు)
జిల్లా (లు) [తూర్పు గోదావరి] జిల్లా
జనాభా
జనసాంద్రత
ఆడ-మగ నిష్పత్తి
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
3,12,748 [1] (2011 నాటికి)
• 2,658/కి.మీ² (6,884/చ.మై)
• 0.98
• 75.20
• 80.14
• 70.38
మేయరు

leader_name_1 = కె.సరోజ

ఎం.పి తోట నరసింహం (తెదేపా)
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్

• 533 001
• +91 884

కాకినాడ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లా యొక్క ముఖ్యపట్టణం. కాకినాడ తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన పట్టణమే కాక భారత దేశ తూర్పు తీర ప్రాంతములోముఖ్యమైన రేవు పట్టణం. న్యూయార్క్ నగరము మాదిరిగా వీధులు రూళ్ళకర్రతో గీసినట్టు సమాంతరంగా ఉండి, కూడళ్ళలో ఒకదానికొకటి లంబంగా ఉండడం ఈ నగర ప్రత్యేకత. ప్రణాళికా బద్ధంగా ఉన్న కారణంగా కో-కెనడా గానూ, ప్రముఖమైన ఓడరేవుగా ఉన్న కారణం చేత రెండవ మద్రాసు గానూ, చమురు అన్వేషణ, వెలికితీత కార్యక్రమాలు అధికంగా ఉన్న కారణంచేత మినీ ముంబయి గానూ, పిలుస్తూ ఉంటారు. ప్రశాంత వాతావరణానికి మారుపేరైన ఈ పట్టణం పెన్షనర్స్ పారడైస్గా పేరొందినది. ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం రసాయనాలు పెట్రోరసాయనాల పెట్టుబడి ప్రాంతం పరిధి కాకినాడని ఆనుకొనే మొదలవుతుంది. ఈ మధ్యకాలంలో కె.జి బేసిన్ రాజధానిగా విదేశాలలో ప్రాముఖ్యతని సంతరించుకొంటోంది.

కాకినాడ పేరు వెనుక ఇతిహాసం

కాకినాడ

కాకినాడ అనే పేరు వెనుక అనేక కథలు ఉన్నాయి.

  • కాకినాడ పేరు మొదట కాకి నందివాడ అని ఉండేదని, అది కాలక్రమముగా కాకినాడగా నామాంతరం చెందిందని చెబుతారు. స్వాతంత్ర్యం రాక ముందు కొంతకాలం కాకినాడ పేరు కొకనాడగా చలామణి అయ్యింది.
  • త్రేతాయుగంలో ఇది పెద్ద అరణ్యం దీన్నీ కాకాసురుడు అనే రాక్షసుడు పరిపాలిస్తూ ఉండేవాడు. వనవాసం చేస్తున్న సీతను కాకి రూపంలో వేధించినపుడు రాముడు అతనిని సంహరించాడు, అతని పేరున ఈ వనమ్ వెలిసినది.
  • ఇక్కడకి మొదట డచ్ వారు వర్తకం చేసుకొనడానికి వచ్చి వారి స్థావరం ఏర్పరచుకొన్నారు. వారి తరువాత ఆంగ్లేయులు వారి స్థావరం ఏర్పాటు చేసుకొన్నారు.తరువాత కెనడియన్‌ బాప్తిస్టు క్రైస్తవ మిషనరీలు ఇక్కడకి వచ్చారు. వారు కాకినాడ నగరాన్ని చూసి ఇది అచ్చు వారి కెనడ నగరాన్ని తలపించడంతొ వారు ఈ నగరాన్ని కోకెనడ అని పిలిచెవారు అది కాలక్రమంగా కాకినాడగా వాడుకలోకి వచ్చింది.
  • బ్రిటీషువారి కాలంలో కాకెనాడ /కోకనాడ (Cocanada) గా పిలువబడి, స్వాతంత్ర్యం వచ్చాక పేరు కాకినాడగా మార్చబడింది. అయితే స్వాతంత్ర్యం రాక మునుపు బ్రిటిషు వారి పరిపాలన సమయంలో స్థాపించబడిన సంస్థల పేర్లు కోకనాడ గానే ఉన్నాయి. ఉదాహరణ- కోకనాడ చేంబర్ ఆఫ్ కామర్స్, జె ఎన్ టి యు లోని కొన్ని శిలాఫలకాలు, భారతీయ రైల్వేవారి స్టేషను కోడ్లు - కాకినాడ పోర్టు - COA, కాకినాడ టౌన్ - CCT.
  • ఈ ప్రాంతం చెఱువులు ఎక్కువగా ఉండి, అవి ఎర్రకలువ (కోకనదము) లతో నిండి ఉండేవని చరిత్ర చెబుతోంది.
  • బిటీష్‌ వాళ్ళు మనదేశంలోకి కొత్తగా వచ్చిన రోజులలో ఇక్కడ పండే పంటల్నీ, విలువైన వస్తువుల్నీ తమ దేశానికి చేరవేసేందుకు రవాణా సౌకర్యం కలిగిన అనువైన ప్రదేశం కోసం గాలిస్తూండగా ఈ ప్రాంతం వారి దృష్టిలోకి వచ్చింది. సర్వే అధికారులు, పై అధికారులకు రిపోర్టు పంపిస్తూ ` ఇక్కడ కాకులు ఎక్కువగా ఉండటంతో ‘కాకులవాడ’ అంటూ పేర్కొన్నారట! కాలక్రమంలో ‘కాకివాడ’గా, ‘కాకినాడ’గా మారిపోయింది!

నైసర్గిక స్వరూపము

ఉపగ్రహ చాయాచిత్రంలో హోప్ ఐలాండ్ మరియు కాకినాడ

కాకినాడ 16.93° ఉత్తర అక్షాంశం (latitude) దగ్గర, 82.22° తూర్పు రేఖాంశం (longitude) దగ్గర ఉంది. భారతీయ ప్రామాణిక కాలమానానికి (Indian Standard Time) అధారభూతమైన 82.5 ఉత్తర రేఖాంశం కాకినాడ మీదుగా పోతుంది. సగటున కాకినాడ ఊరంతా సముద్రమట్టానికి 2 మీటర్లు ఎత్తులో ఉన్నప్పటికీ, పట్టణంలోని చాలా ప్రాంతాలు సముద్రమట్టానికి తక్కువ ఎత్తులో ఉన్నాయి. సముద్రతీరానికి సమాంతరంగా, ఉత్తరం నుండి దక్షిణంగా ఒక దీర్ఘచతురస్రం మాదిరిగా నగరం ఉంటుంది. నగరం యొక్క సరాసరి వెడల్పు 6 కి.మీ కాగా, పొడవు 15 కి.మీలు.

స్థూలంగా, నగరం రెండు ప్రాంతాలుగా ఉంటుంది. దక్షీణ ప్రాంతమైన జగన్నాధపురాన్ని, మిగిలిన నగరాన్ని విడదీస్తూ బకింగ్ హాం కాలువ ఉంటుంది. స్థానికంగా, దీనిని ఉప్పుటేరుగా పిలుస్తారు. డచ్ కోరమాండల్ వారి వలసల కాలంలో, జగన్నాధపురం, డచ్ ఈస్టిండియా కంపెనీకి చెందిన వాణిజ్య కేంద్రంగా ఉండేది. 1734 సం. నుండి 1834 సం. వస్త్ర వాణిజ్యం ఎక్కువగా జరిగిన ఈ ప్రాంతంలో డచ్చివారి కోట కూడా ఉండేది.

ఉత్తర ప్రాంతం అయిన కాకినాడ, శివారు గ్రామాలు ఇటీవలి కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఉత్తరం నుండి దక్షిణం వఱకూ ఉన్న పారిశ్రామిక గొలుసు, నగరం యొక్క తూర్పు ప్రాంతాన్ని సముద్రతీరం నుండి వేరుచేస్తోంది. కాకినాడకి అగ్నేయంగా కాకినాడ అఖాతం ఉంది. ఈ ప్రాంతంలోని మడ అడవులు, భారతదేశంలో అతి పెద్ద మడ అడవులలో రెండవ స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. ఇదే ప్రాంతం కోరింగ అభయారణ్యానికి నెలవు. గోదావరికి పాయలలో ఒకటైన 'గౌతమి', కాకినాడకి దక్షిణంగా బంగళాఖాతంలో కలుస్తోంది.

హోప్ ఐలాండ్

కాకినాడ తీర ప్రాంతం అంతా హోప్ ఐలాండ్ (హోప్ ద్వీపం) (వికీమాపియాలో హోప్ ఐలాండ్) చేత పరిరక్షింపబడుతున్నది. సముద్రపు (బంగాళా ఖాతము) ఆటుపోట్ల నుండి తీరము కోత కొయ్యబడకుండా ఐదు వందల సంవత్సరాల క్రితం నుండి ఈ హోప్ ఐలాండ్ ఏర్పడిందని తెలుస్తున్నది. ఈ హోప్ ఐలాండ్ తీరం వెంబడి 23 కి.మీల మేర విస్తరించి ఉంది. కాకినాడ సముద్రతీరంలో ఓడలు నిలిచినప్పుడు ఈ హోప్ ఐలాండ్ వల్ల ఓడలు లంగరు వేసినప్పుడు స్థిరంగా ఉండగల్గుతున్నాయి. మహాలక్ష్మీ పర్యాటకం, చొల్లంగిపేట వారి హోప్ ఐలాండ్ విహార యాత్ర మట్లపాలెంలో ఉంది.

కాకినాడ నుండి ఇతర ప్రాంతాలకు దూరాలు (కిలోమీటర్లలో)

వాతావరణం

పట్టణ చరిత్ర

గాంధీనగర్ ఉద్యానవనంలో జాతిపిత విగ్రహం

ఇది రాష్ట్రములోని ప్రధానమైన ఓడరేవులలో ఒకటి. రెండు శతాబ్దాల క్రితం ఈ రేవు నుండి మల్లాది సత్యలింగ నాయకర్‌ అనే ఆసామీ ఓడ వ్యాపారం చేసేవాడు. ఆయన వారసులు మల్లాది సత్యలింగ నాయకర్‌ ఛారిటీస్ (MSN Charities) అనే స్వచ్ఛంద సంస్థని స్థాపించి ఇప్పటికీ విద్యారంగంలో ఎన్నో ప్రజోపయోగమైన పనులు చేస్తున్నారు.

భారతదేశంలో వాసయోగ్యమైన బహుకొద్ది నగరాలలో కాకినాడ ఒకటిగా ఉండేది. తిన్నటి విశాలమైన వీధులు, విద్యుచ్చక్తి, నీటి సరఫరా, ఈశ్వర పుస్తక భాండాగారం వంటి గ్రంథాలయాలు, కళాశాలలు మొదలైన హంగులన్నీ ఈ ఊళ్ళో దరిదాపు 1900 సంవత్సరం నుండి ఉన్నాయి. 1901 జనాభా లెక్కల ప్రకారం కాకినాడ జనాభా 48000. మద్రాసు రాష్ట్రంలోని అచ్చతెలుగు ప్రాంతాలలో అతి పెద్ద నగరం ఇదే. ఇప్పుడు కొత్త కొత్త కళాశాలలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు కూడా రావటంతో ఇంకా బాగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడి జె ఎన్ టి యు కళాశాల భారదేశంలోని అతి పురాతనమైన, అత్యుత్తమమైన ఏలెక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ శాఖలను కలిగి ఉంది.

ప్రశాంతమయిన పరిసరాలు కలిగి ఉండడము చేత రాష్ట్రం నలు మూలల నుంచి రిటైర్డ్ ఉద్యొగులు ఎందరో వచ్చి కాకినాడలో స్థిరపడుతున్నారు. అందుకే ఈ నగరాన్ని "పెన్షనర్స్ ప్యారడైజ్" అని కూడా పిలుస్తారు. అయితే ఇప్పుడు పరిస్థితి చాలా మారింది.అడ్డు ఆపు లేని నగరీకరణం వలన పర్యావరణం పైన విపరీతమైన భారం కలిగి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా వేసవిలో పరిస్థితి భరించలేని రీతిలో ఉంది. చెట్లు విపరీతంగా నరకడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చాలా మంది భావిస్తున్నారు.

కొన్ని ముఖ్య సంఘటనలు

  • 19వ శతాబ్దంలో కాటన్ ఆనకట్ట పూర్తయ్యి ధవళేశ్వరం – కాకినాడ కాలువ (బకింగ్ హామ్ కాలువ) వినియోగంలోకి వచ్చిన తర్వాత, కాకినాడ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. 1881నాటికి 17వేలుగా ఉన్న పట్టణ జనాభా, 1901 నాటికి 48వేలకి చేరి, సర్కారు జిల్లాల్లో అతిపెద్ద నగరంగా ఏర్పడి, మద్రాసుకలకత్తా మధ్యలో అత్యంత భద్రమైన, అత్యుత్తమైన ఓడరేవు (Safest and Best Port) గా, రెండవ మద్రాసుగా పేర్కొనబడింది. నిజాం ఏలుబడిలోని బీరార్ ప్రాంతంనుండి, గోదావరి నదిమీద, భద్రాచలం మీదుగా, కాకినాడ ఓడరేవుకి జలరవాణా అధికమయ్యింది. ఒకానొక స్థాయిలో, కాకినాడ రాజధానిగా సర్కారు జిల్లాలని మద్రాసు ప్రెసిడెన్సీనుండి వేరుచేసి, మఱో ప్రెసిడెన్సీగా ఏర్పాటుచేసే ప్రతిపాదనలు కూడా బ్రిటీషువారు చేసుకున్నారు. (ఆ కాలంనాటి ప్రధాన రైలు, “సర్కార్ ఎక్స్ ప్రెస్” ఇప్పటికీ, కాకినాడ – చెన్నై ల మధ్య నడుస్తోంది.) [2]
  • 1923సంవత్సరంలో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సభలకు కాకినాడ వేదిక అయింది. ఎప్పటిలాగే, వందేమాతరం గీతాలాపనతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండగా, అప్పటి కాంగ్రెస్ ముస్లిం నాయకుడు మౌలానా ముహమ్మద్ అలీ జవహర్, అది ఇస్లాంకి వ్యతిరేకమని అభ్యంతరం వ్యక్తం చేసారు.అయితే, వందేమాతరం కాంగ్రెస్ సంప్రదాయమని, తక్కిన పెద్దలందరూ నచ్చజెప్పడంతో ఆయన ఊరుకున్నారు. వందేమాతరం గీతం పైన కొందరు ముస్లింలలో ఉన్న వ్యతిరేకతకి ఉదాహరణగా నిలిచిన తొలి ఘటనగా దీనిని పరిగణిస్తారు.[3]
  • అవే సభలకు, దుర్గాబాయి దేశ్‌ముఖ్ వాలంటీరుగా పనిచేస్తూ, వద్ద టిక్కెట్ లేని కారణము చేత నెహ్రూను అనుమతించక, తన కర్తవ్య నిర్వహణకు గాను మహాత్ముని, నెహ్రూ నుండి ప్రశంసలను పొందింది.
  • అప్పటి డి.ఎస్.పి, ముస్తఫా ఆలీ ఖాన్ ని హతమార్చడానికై, 1933 ఏప్రిల్ 6 న, ఏప్రిల్ 14 లలో ప్రతివాది భయంకర వెంకటాచారి కొన్ని విఫలయత్నాల అనంతరం, ఏప్రిల్ 15 న ఉదయం 6 గంటలకు కాకినాడ ఓడరేవులో మరో ప్రయత్నం చేసారు. ఈ ప్రయత్నం కూడా విఫలమయ్యింది కానీ, ప్రతివాది భయంకర వెంకటాచారి, కామేశ్వర శాస్త్రి మరియు ఇతర విప్లవకారుల కుట్ర బయటపడింది. ఈ సంఘటన కాకినాడ బాంబు కేసుగా ప్రసిద్ధమైంది. (క్రీ.శ 1931 మార్చి 30న జరిగిన వాడపల్లి కాల్పుల ఘటన, 1932 జనవరి 19న సీతానగరం ఆశ్రమ ఘటన లకు ముస్తఫా అలీ ఖాన్ బాధ్యుడని అప్పటి విప్లవకారులు భావించారు) . చాలా కాలం అనంతరం, సెప్టెంబరు 11 న ప్రతివాది భయంకర వెంకటాచారిని కాజీపేట రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు.
  • రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, జపాన్ వైమానిక దళం, కాకినాడ మీద 1942 ఏప్రిల్ 6న దాడి చేసింది. ఈ దాడిలో రెండు ఓడలు పూర్తిగా ధ్వంసం కాగా, ఒకరు మృతి చెందారు[4]

పరిపాలన

కాకినాడలోని తూర్పు గోదావరి జిల్లా కలక్టర్ కార్యాలయ సముదాయం

కాకినాడ పరిపాలన నిర్వహణని కాకినాడ నగరపాలక సంస్థ మరియు నగర కమిషనర్ నిర్వహిస్తారు. నగరంలో 50 వార్డులున్నాయి. ప్రతీ వార్డు నుండి ఒక కార్పొరేటర్, నగర పాలక సంస్థలో ప్రాతినిధ్యం వహిస్తారు. తమలో ఒకరిని మేయరుగా కార్పొరేటర్లు ఎన్నుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం, ఐ.ఏ.ఎస్ స్థాయి అధికారిని నగర కమీషనరుగా నియమిస్తుంది. నగరంలో రెండు శాసన సభ స్థానాలు ఉన్నాయి. అవి కాకినాడ సిటీ, కాకినాడ రూరల్. పార్లమెంటులో ఈ ప్రాంత ప్రాతినిధ్యం కాకినాడ పార్లమెంటు స్థానం ద్వారా జరుగుతుంది.

37 పరిసర గ్రామాలను కాకినాడలో విలీనం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. తద్వారా నగర జనాభా 8 లక్షలకు చేరే అవకాశం ఉంది. ఆ గ్రామాలు[5] 1 రమణయ్యపేట 2 తిమ్మాపురం 3 వి వెంకటాపురం 4 పండూరు 5 నేమాం 6 పెనుమర్తి 7 తమ్మవరం 8 సూర్యారావుపేట 9 వాకలపూడి, 10 వలసపాకల 11 ఉప్పలంక, 12 గురజనాపల్లి, 13 చొల్లంగి, 14 చొల్లంగిపేట, 15 పెనుగుదురు, 16 కొరుపల్లి 17 నడకుదురు 18 జడ్‌ భావవరం, 19 అరట్లకట్ట 20 గొడ్డటిపాలెం, 21 కొవ్వూరు, 22 తూరంగి 23 కాకినాడ రెవెన్యూ విలేజ్‌, 24 కాకినాడ మేడలైన్‌, 25 ఇంద్రపాలెం, 26 చీడిగ, 27 కొవ్వాడ, 28 రేపూరు, 29 రామేశ్వరం, 30 గంగనాపల్లి, 31 స్వామినగర్‌, 32 ఎస్‌ అచ్యుతాపురం, 33 మాధవపట్నం, 34 సర్పవరం, 35 పనసపాడు, 36, అచ్చంపేట, 37 కొప్పవరం

రవాణా సదుపాయాలు

రైలు సదుపాయం

కాకినాడ టౌన్ రైలు సముదాయము

కాకినాడ మిగిలిన పట్టణాలతో సామర్లకోట -కాకినాడ లూప్-లైన్ ద్వారా కలుపబడి ఉంది. కాకినాడ స్టేషనులలో రైలుబళ్ళన్నీ కాకినాడ నుండే బయలుదేరుతాయి. కాకినాడ నగరంలో నాలుగు రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కాకినాడ పోర్ట్, కాకినాడ న్యూపోర్ట్, కాకినాడ టౌన్, సర్పవరం. ఇందులో కాకినాడ పోర్ట్ స్టేషను పూర్తిగా గూడ్స్ బళ్ళకు కేటాయించబడింది. కాకినాడ రాష్ట్ర రాజధాని హైదరాబాదుకి 564 కి మీ ల దూరంలో ఉంది. చెన్నై - కోల్కతా రైలు మార్గంలో సామర్లకోట దగ్గర బండి మారాలి. ఈ మార్గంలో వెళ్లే బళ్ళలో సుమారుగా అన్నీ సామర్లకోట వద్ద ఆగుతాయి. సామర్లకోట నుండి కాకినాడ ప్రధాన బస్టాండ్ కి ఆం.ప్ర.రా.రో.ర.సం బస్సులు అన్ని వేళలా ఉంటాయి. దూరం 10 కి.మీ.

ప్రస్తుతం హైదరాబాదు, చెన్నై (మద్రాసు), షిర్ది, ముంబాయి, బెంగుళూరు లకు నేరుగా రైలు సదుపాయముంది.

కాకినాడ నుండి బయలుదేరే ద.మ రైల్వే ఎక్స్ ప్రెస్ రైళ్ళు

కాకినాడ నుండి బయలుదేరు పాసింజర్ రైళ్ళు

రోడ్డు సదుపాయం

Four-lane road, with narrow grass median
నగరంలోని రహదారులు

214 నెంబరు జాతీయ రహదారి నగరం గుండా పోతుంది. రాజమండ్రి, జిల్లాలోని ఇతర పట్టణలను కలుపుతూ రాష్ట్ర రహదారులు ఉన్నాయి. కాకినాడ ఓడరేవు, శివారు పారిశ్రామిక ప్రాంతాలైన వాకలపూడి, వలసపాకల, సామర్లకోట, పెద్దాపురం లను 5వ నెంబరు జాతీయ రహదారికి అనుసంధానిస్తూ ఆసియా అభివృద్ధి బ్యాంకు (Asian Development Bank) నిధులతో నిర్మించిన ADB రోడ్డు ఉంది. కాకినాడ నుండి ద్వారపూడి, రాజమండ్రి, జంగారెడ్డిగూడెం, ఖమ్మం మీదుగా సూర్యాపేటకి పోయే రాష్ట్ర రహదారిని, జాతీయ రహదారిగా గుర్తించి, నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి చేసే ప్రతిపాదనలున్నాయి.[6]

ఇవే కాకుండా, విశాఖపట్నం - కాకినాడ చమురు సీమ ప్రాజెక్టులో భాగంగా, కాకినాడ నుండి విశాఖపట్నం వరకూ, సముద్ర తీరం వెంబడి నాలుగు-ఆరు వరుసల రహదారిని నిర్మించే ప్రతిపాదన ఉంది.[7]

విమాన సదుపాయం

కాకినాడకు 65 కి మీ దూరంలో రాజమండ్రి విమానాశ్రయం ఉంది. ఇది చెన్నై, హైదరాబాద్, విజయవాడ, బెంగుళూర్ లకు విమానయాన సేవలను కలిగి ఉంది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, జెట్ ఎయిర్ వేస్ మరియు స్పైస్ జెట్ ఇక్కడ ఆపరేటింగ్ ఎయిర్ లైన్స్. ఇతర సమీప ప్రధాన విమానాశ్రయం కాకినాడ నుండి 145 కి మీ దూరంలో విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.

విశాఖపట్నం - కాకినాడ చమురు సీమ ప్రాజెక్టులో భాగంగా, పిఠాపురం వద్ద కార్గో రవాణా కోసమై మరో విమానాశ్రయాన్ని నిర్మించే ప్రతిపాదనలున్నాయి.[7]

ఆర్థిక వ్యవస్థ

1940 ల వఱకూ కాకినాడ చుట్టుపక్కల పరిశ్రమలు చాలా తక్కువగా ఉండేవి. స్థానిక ఆర్థిక వ్యవస్థ అంతా వ్యవసాయం, చేపల వేట పైననే ఎక్కువగా ఆధారపడి ఉండేది. 1980 లలో ఎరువుల కర్మాగారాలు స్థాపించిన తర్వాతి నుండి పరిశ్రమలు ప్రారంభమైనాయి. ఓడరేవు అందుబాటులో ఉండడం వలన, ఓడరేవు ఆధారిత పరిశ్రమల స్థాపన జరుగుతోంది

ఓడరేవు

Red-and-white lighthouse at night
వాకలపూడి లైట్ హౌస్.

కాకినాడ తీరం నుండి 5 కి.మీ ల దూరంలో ఉన్న హోప్ ఐలాండ్, వలన కాకినాడ సహజసిద్ధమైన ఓడరేవు అయ్యింది. ప్రస్తుతం కాకినాడలో రెండు ఓడరేవులు పనిచేస్తున్నాయి.

  • కాకినాడ లంగరు రేవు
  • కాకినాడ డీప్ వాటర్ రేవు

కాకినాడ డీప్ వాటర్ రేవు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం ఓడరేవు తర్వాత రెండవ పెద్ద ఓడరేవు మరియు ప్రభుత్వ - ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మించిన మొదటి ఓడరేవు. ఇది కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ సంస్థ ద్వారా నిర్వహింపబడుతోంది. డీప్ వాటర్ పోర్ట్ నిర్మించక ముందు నుండి ఉన్న కాకినాడ లంగరు రేవు, భారతదేశంలోని 40 చిన్న ఓడరేవులలో అతిపెద్దది. సింగపూర్ కి చెందిన సెంబవాంగ్ షిప్ యార్డ్ మరియు కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ లు సంయుక్తంగా, కాకినాడలో నౌకానిర్మాణకేంద్రాన్ని నిర్మిస్తున్నాయి.

కాకినాడ నుండి జరిగే ప్రధాన ఎగుమతులు; వ్యవసాయ ఉత్పత్తులు (వరి, గోధుమ, నూనెదినుసులు, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్) మరియు సముద్ర ఉత్పత్తులు (చేపలు, రొయ్యలు, పీతలు) . అంతేగాకుండా రసాయనాలు, ఇనుప ఖనిజం, సైబాక్టు, జీవ ఇంధనాలు కూడా ఎగుమతి అవుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులు, రసాయనాలు, వంటనూనెలు మొదలైనవి ప్రధాన దిగుమతులు.

ఇవి కాకుండా, విశాఖపట్నం - కాకినాడ చమురు సీమ ప్రాజెక్టులో భాగంగా, కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి కోసం ప్రత్యేకంగా మఱో ఓడరేవుని నిర్మించే ప్రతిపాదనలున్నాయి.[7]

పరిశ్రమలు

ఎరువులు

నాగార్జున ఎరువుల కర్మాగారం
Factory with two smokestacks
కోరమాండల్ ఎరువుల కర్మాగారం

కాకినాడని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రపు "ఎరువుల నగరం (Fertilizer City) "గా కూడా పిలుస్తారు. నాగార్జున ఎరువుల కర్మాగారం (కోస్తా ఆంధ్రలో అత్యధికంగా యూరియా ఉత్పత్తి చేసే కేంద్రం), కోరమాండల్ ఎరువుల కర్మాగారం (డై అమ్మోనియం హైడ్రోజన్ ఫాస్పేట్ ఉత్పత్తి జరుగుతోంది) ఉన్నాయి.

కొబ్బరికాయలు

కాకినాడ పరిసర ప్రాంతాల నుండి, కొబ్బరికాయలను ఎగుమతి చేసే సంస్థలు చాలా ఉన్నాయి.

పంచదార

మురుగప్ప గ్రూపువారి ఈద్ పారీ (ఇండియా) మరియు కేర్గిల్ ఇంటర్నేషనల సంస్థల ఉమ్మడి పంచదార కర్మాగారం అయిన సిల్క్ రోడ్ సుగర్స్, 600, 000 టన్నుల సామర్థ్యం కలది. ఇది, ప్రధానంగా ఎగుమతి ఆధార పరిశ్రమ (Export Oriented Unit) [8]

పెట్రోలియం మరియు సహజవాయువు

Glass-block office building at night
ఓ.ఎన్.జి.సి ఇండియా— కాకినాడ కార్యాలయం

ఓ.ఎన్.జీ.సీ సంస్థ యొక్క తూర్పుతీర క్షేత్రాలకు కేంద్రస్థానం కాకినాడ. బేకర్ హ్యుగెస్, స్లంబర్జర్ వంటి కంపనీలు కాకినాడ సముద్ర తీరంలోని చమురు క్షేత్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. దేశంలోని అతి పెద్ద సహజవాయు క్షేత్రంగా కృష్ణ-గోదావరి హరివాణం పేరుగాంచింది. ఓ.ఎన్.జి.సీ, జి.ఎస్.పీ.సి, రిలయన్స్ వంటి సంస్ఠలు నిర్వహించిన గాలింపు కార్యక్రమంలో విస్తారంగా సహజవాయు నిక్షేపాలు లభించాయి.

కాకినాడ నుండి 24 కి.మీ దూరంలో నున్న గాడిమొగ వద్ద రిలయన్స్, ఆన్ షోర్ టర్మినల్ ను నిర్మించింది. కె.జి డి6 లో లభించిన సహజవాయుని శుద్ధిచేసి, దేశంలోని ఇతర ప్రాంతాలకు పంపిణీ చేయడం జరుగుతోంది. రిలయన్స్ గ్యాస్ ట్రాన్స్ పోర్టేషన్ లిమిటెడ్, కాకినాడ నుండి భరూచ్ (గుజరాత్) వఱకూ పైపులైన్లను నిర్మించింది. రోజుకి 120 మిలియన్ క్యూబిక్ మీటర్ల సహజవాయువు, కాకినాడ నుండి భారతదేశపు పశ్చిమ తీరానికి సరఫరా చేయబడుతోంది.

2010 సంవత్సరంలో చమురు & సహజవాయువుల నియంత్రణా మండలి, కాకినాడ గ్యాసు సరఫరా వ్యవస్థని భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ కు అప్పగించింది. ఈ సంస్ఠ మొదటి దశలో కాకినాడతో బాటు హైదరాబాదు, విజయవాడ నగరాలలో ఇంటింటికీ గ్యాసు పైపులైన్లని నిర్మిస్తోంది. తద్వారా కాకినాడ నగరంతో బాటు, శివారు పట్టణాలైన సామర్లకోట, పెద్దాపురం మరియు పిఠాపురం లలో కూడా గ్యాస్ సరఫరా పైపులు నిర్మించబడుతున్నాయి.

విశాఖపట్నం నుండి కాకినాడ వఱకూ ఏర్పాటు చేయదలచిన ఆంధ్రప్రదేశ్ చమురు సీమ (APPCPIR) లో భాగంగా కాకినాడ వద్ద భారీ రిఫైనరీలను నిర్మించడానికి జి.ఎం.ఆర్, రిలయన్స్ వంటి సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.[7]. తద్వారా, ఈ ప్రాంతం గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందని భావిస్తున్నారు. కేవలం చమురుసీమ ద్వారా 7-8 లక్షలమందికి ప్రత్యక్ష ఉపాధి, 50 లక్షలమందికి పరోక్ష ఉపాధి లభిస్తాయని అంచనా.[9]. కాకినాడ సముద్రతీరం వద్ద, ద్రవరూప సహజవాయువు (Liquified Natural Gas - LNG) ని నిలువజేసేందుకు, షెల్ సంస్థ (Shell), గెయిల్ సంస్థ (GAIL) లు సంయుక్తంగా, ఎల్.ఎన్.జి టర్మినల్ ను నిర్మిస్తున్నాయి.[10].

వంట నూనెలు మరియు జీవ ఇంధనాలు

2002 సంవత్సరంలో, కాకినాడ పరిసరాల్లో అనేక వంటనూనె కర్మాగారాలు స్థాపించబడ్డాయి. అదానీ విల్మార్, రుచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, నిఖిల్ రిఫైనరీ, భగవతి రిఫైనరీ, మొదలైనవి రోజుకి 3000 టన్నులకి పైగా వంటనూనెలను ఉత్పత్తి చేయగలవు. ఈ కర్మాగారాలకి అవసరమైన ముడి పామాయిల్, సోయాబీన్ నూనె, ఓడరేవునుండి దిగుమతి అవుతున్నాయి.[11]

వాకలపూడిలోని పారిశ్రామిక వనం, జీవ ఇంధన కంపెనీలనుండి $10 మిలియన్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఇక్కడ పెట్టుబడులు పెట్టిన వాటిలో రిలయన్స్ ఇండస్ట్రీస్, నేచురోల్ బయో ఎనర్జీ, యూనివర్సల్ బయోఫ్యూయల్స్[12][13] మొదలైనవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం, జత్రోఫా సాగు కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. నాణ్యమైన జీవ ఇంధనాన్ని ఉత్పత్తి చేసేందుకు వాడే ఈ జత్రోఫా పంటని సాగుచేసేందుకు, కాకినాడ పరిసరాల్లో 200 ఎకరాలను కంపెనీ సేకరించింది.[14]

విద్యుదుత్పత్తి

కాకినాడ పరిసర ప్రాంతాలలో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు చాలా ఉన్నాయి. ఉప్పాడ బీచ్ రోడ్డునందు, స్పెక్ట్రం పవర్ జనరేషన్ సంస్థకి 208 మెగావాట్ల కేంద్రం ఉంది. భారతదేశంలోని వాణిజ్య విద్యుదుత్పత్తి కేంద్రాలలో ఇది ఒకటి. ఉత్పత్తి సామర్థ్యాన్ని 1350 మెగావాట్లకి పెంచుకునేందుకు సంస్థ సిద్ధపడుతున్నది[15]. సామర్లకోటలో రిలయన్స్ ఎనర్జీ సంస్థకి చెందిన 220 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రం[16], పెద్దాపురంలో జి.వి.కే సంస్థకి చెందిన 469 మెగావాట్ల (కంబైన్డ్ సైకిల్) గౌతమి విద్యుదుత్పత్తి కేంద్రం పనిచేస్తున్నాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందం ద్వారా, ఈ సంస్థలు ఏ.పి ట్రాన్స్ కో కి, విద్యుచ్ఛక్తిని విక్రయిస్తాయి. రిలయన్స్ సంస్థ, సామర్లకోటలో 2400 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తున్నది. 2010 నవంబరులో భారతదేశ పర్యటనకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, సామర్లకోట విద్యుదుత్పత్తి కేంద్రానికి టర్బైన్లను నిర్మించే ఇచ్చే కాంట్రాక్టుని, అమెరికాకు చెందిన జి.ఈ సంస్థకి కుదుర్చుకున్నాడు[17]. జి.వి.కె సంస్థ, గౌతమి విద్యుదుత్పత్తి కేంద్ర సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తోంది[18].

అయితే, గెయిల్ సంస్ఠ సరఫరా సరిగా లేకపోవడం వలన, రిలయన్స్ అధీనంలో ఉన్న కె.జి-డి6 బేసిన్లో ఉత్పత్తి మందగించడం వలన, ఈ విద్యుత్ కేంద్రాలకి గ్యాసు అందడం లేదు[19]. అందువలన, ప్రస్తుతం ఈ కేంద్రాలలో విద్యుదుత్పత్తి బహుకొద్దిగా జరుగుతున్నది. కాకినాడ సముద్రతీరం వద్ద నిర్మిస్తున్న ఎల్.ఎన్.జి టర్మినల్, వినియోగంలోకి వచ్చిన తర్వాత గ్యాస్ సరఫరా ఇబ్బందులని అధిగమించవచ్చునని ఈ సంస్థలు ఆశిస్తున్నాయి[10].. అంతేగాకుండా, మరిన్ని గ్యాసు ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలు వచ్చే అవకాశం ఉంది.

సమాచార సాంకేతిక విజ్ఞానం (ఐ.టీ)

ఆంధ్రప్రదేశ్ ఐ.టీ పరిశ్రమలో కాకినాడ ద్వితీయ శ్రేణి నగరంగా పరిగణింపబడుతోంది. 2007 సంవత్సరంలో సాఫ్ట్ వేర్ టెక్నాలకీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఐ.టీ పార్కుని స్థాపించినప్పటి [20] నుండి, కాకినాడలో వివిధ ఐ.టీ కంపెనీలు పనిచేయడం ప్రారంభించాయి.

ఉభయ గోదావరి జిల్లాలోని ఐ.టీ కంపెనీల సంఘం అయిన "గోదావరి ఐ.టీ అసోసియేషన్" (GITA), కాకినాడ కేంద్రంగా పనిచేస్తోంది[21]. ఇందులో దాదాపు 35 కంపెనీలు ఉన్నాయి. 2012-13 సంవత్సరంలో కాకినాడ నుండి రూ 35 కోట్ల విలువైన సాఫ్ట్ వేర్ ఎగుమతులు జరిగాయి. ఈ ఎగుమతులలో హైదరాబాదు, విశాఖపట్నం తర్వాత కాకినాడది మూడో స్థానం.[22]

కాకినాడలో, రూ 180 కోట్లతో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ (Indian Institute of Information Technology - IIIT) ని నిర్మించడానికి శంకుస్థాపన జరిగింది.[23] తద్వారా మరిన్ని ఐ.టీ కంపెనీలు రావడానికి అవకాశం కలుగుతోంది. కాకినాడలో పనిచేస్తున్న కొన్ని ప్రముఖ కంపెనీలు

  • ఇన్ఫోటెక్ ఎంటర్ ప్రైజెస్[24]
  • అవినియాన్[25]
  • ఫస్ట్ ఆబ్జెక్ట్ టెక్నాలజీస్ [26]
  • క్రిఫీ [27]
  • ప్రొమినెర్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్[28]
  • 3ఒన్ టెక్నాలజీస్[29]
  • ట్రివ్యూపోర్ట్ టెక్నాలజీస్[30]
  • ఆస్పైర్ టెక్నాలజీస్[31]
  • ట్రేస్ అవుట్ టెక్నాలజీస్ [32]
  • ఫోర్ టెల్ టెక్నాలజీస్ [33]
  • మైత్రి సొల్యూషన్స్[34]
  • నైరోస్ టెక్నాలజీస్ [35]
  • మెకాంజీ ఇన్ఫోటెక్ & సాఫ్ట్ వేర్ సర్వీసెస్[36]
  • ఈస్టీ సొల్యూషన్స్

ఎలక్ట్రానిక్స్

కాకినాడలో ఉన్న ఆంధ్రా ఎలక్ట్రానిక్స్ లి. సంస్థ, 1977 నుండి ఎలక్ఱ్రానిక్ వస్తువులను తయారుచేస్తోంది.[37] కాకినాడ రేవు, పరిసర ప్రాంతాలలో ఎగుమతి ఆధారిత ఎలక్ట్రానిక్ వస్తు పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు, 2014-15 కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రసంగం, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.[38]

ఆసుపత్రులు

కాకినాడలో అనేక ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. వాటిల్లో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి, అపోలో హాస్పిటల్స్, శ్రీబాల ఈ.ఎన్.టీ కేర్, క్రిస్టియన్ కేన్సర్ హాస్పిటల్, కేర్ ఆసుపత్రి, సాయిసుధ ఆసుపత్రి, డి. వి రాజు కంటి ఆసుపత్రి, నయన ఐ కేర్ మొదలైనవి ఉన్నాయి.

విద్యాసంస్థలు

కాకినాడలో ఉన్న విద్యా పీఠాలు:

C B M సింప్సన్ స్మారక ప్రాథమికోన్నత పాఠశాల, కాకినాడ
  • పిఠాపురం రాజావారి కళాశాల (P. R. College), ఇది చాల రోజులబట్టి ఉన్న కళాశాల. రఘుపతి వెంకటరత్నంనాయుడు, వేమూరి రామకృష్ణారావు వంటి ఉద్దండులు ఇక్కడ పని చేసేరు. పిఠాపురం రాజావారి కళాశాల అత్యంత ప్రాచీనమైన కళాశాలగా ప్రాముఖ్యత సంతంరించుకున్నది. ఈ కళాశాలలో ఇంటర్, డిగ్రీ, పి.జి.విభాగాలలో అభ్యసించవచ్చును.
  • జవాహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఇంజనీరింగు కళాశాల (JNTU Engineering College) . ఇది ఆంధ్రాలో మొట్టమొదటి ఇంజనీరింగు కళాశాల. మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రా విడిపోయినప్పుడు, విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో పెట్టాలన్న ఉద్దేశంతో గిండీ ఇంజనీరింగు కాలేజీ నుండి దీనిని విడదీసేరు. మొదట్లో గిండీలో ఉన్న ఆచార్యబృందాన్నే ఇక్కడికి బదిలీ చేసేరు. కాని వాల్తేరులో వనరులు లేక కాకినాడలో తాత్కాలికంగా పెట్టేరు. అది అలా అక్కడే 'ప్రభుత్వ ఇంజనీరింగు కళాశాల, కాకినాడ' (Government College of Engineering, Kakinada) అన్న పేరుతో స్థిరపడి పోయింది. తరువాత జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (Jawaharlal Nehru Technological University) స్థాపించిన తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగు కళాశాలలన్నిటిని ఈ కొత్త విశ్వవిద్యాలయానికి అనుబంధించేరు.
  • భారతీయ సమాచార సాంకేతిక విద్యాసంస్థ (Indian Institute of Information Technology) కి శంకుస్థాపన జరిగింది.[23]
  • ఆంధ్రా పాలీటెక్నిక్‌
  • యమ్.యస్.యన్ ఛారిటీస్
  • ఆంధ్ర విశ్వవిద్యాలయం - స్నాతకోత్తర విద్యా కేంద్రం (Andhra University - Post-graduate Extension Center)
  • రంగరాయ వైద్య కళాశాల
Two gateways next to white building
రంగరాయ వైద్య కళాశాల ముఖద్వారం
  • కాకినాడ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (KIET, KIET2, KIETW)
  • ఐడియల్ కళాశాలలు (Ideal College)
  • ఐడియల్ ఇంజినీరింగ్ కళాశాల
  • ప్రగతి ఇంజనీరింగు కాలేజి
  • ఆదిత్య ఇంజనీరింగు కాలేజి
  • సాయి ఆదిత్య ఇంజనీరింగు కాలేజి
  • శ్రీ ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల
  • చైతన్య ఇంజనీరింగు కాలేజి
  • ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజిమెంట్, కు శంకుస్థాపన జరిగింది.[39]
  • శ్రీ రామకృష్ణా పబ్లిక్ స్కూల్
  • ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్
  • కాకినాడ పబ్లిక్ స్కూల్, వలసపాకల
  • గాంధీ సెంటినరీ పాఠాశాల
  • నెహ్రూ కాన్వెంట్ హై స్కూల్, ఎం.ఎస్.ఎన్ ఇంగ్లీషు మీడియం పాఠాశాల
  • సీహార్స్ అకాడమీ ఆఫ్ మర్చంట్ నేవీ
  • రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ అండ్ సైన్స్ Rajiv Gandhi Institute of Management and Science
  • సెయింట్ జోసఫ్ కాన్వెంట్ స్కూల్
  • టాగూరు కాన్వెంట్ హై స్కూల్
  • సర్కార్ పబ్లిక్ స్కూల్

ప్రత్యేకతలు

కాకినాడ ఊరు పేరు చెప్పగానే నోరూరే విషయాలు రెండు. ఒకటి కోటయ్య కాజాలు. ఇవి తాపేశ్వరం మడత కాజాల వంటి కాజాలు కావు. సన్నంగా, కోలగా దొండకాయలాగా ఉంటాయి., కొరగ్గానే లోపల ఉన్న పాకం జివ్వున నోట్లోకి వస్తుంది. వీటిని గొట్టం కాజాలని కూడా అంటారు. తరువాత చెప్పుకోవలసినది నూర్జహాన్ కిళ్ళీ. ఇది తుని తమలపాకులతో చేసే మిఠాయి కిళ్ళీ. అలాగే కాకినాడలోని సుబ్బయ్య హోటలు. సంప్రదాయబద్ధంగా అరటి ఆకులో వడ్డించే ఇక్కడి అద్భుతమయిన భోజనానికి చాల ప్రశస్తి ఉంది. ఆసియాలో మొదటి బయో డీజల్ తయారి ఇక్కడ ఉంది.

కాకినాడలో వున్న ప్రఖ్యాత మెక్లారెన్ స్కూలు వంద సంవత్సరాల చరిత్ర గలది.

నగరం లో షాపింగ్

కాకినాడలో స్పెన్సర్స్ (Spencers Hyper Market)

కాకినాడ నగరం ఈ మధ్య కాలంలో అత్యంత వేగవంతంగా వృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటి. పెరుగుతున్న జనాభాతో పాటు పెరుగుతున్న అవసరాలకు అణుగుణంగా నగరంలో పలు షాపింగ్ మాల్స్ వెలిశాయి. ప్రముఖంగా చందన బ్రదర్స్ ఎప్పటి నుంచో నగర వాసులకు వస్త్ర రంగంలో తమ సేవలను అందజేస్తుండగా ఆ పైన సరికొత్తగా సర్పవరం జంక్షన్ లో స్పెన్సర్స్ వెలసింది. ఆంధ్ర ప్రదేశ్ లో హైదరాబాదు, విశాఖపట్నం, విజయవాడ నగరాల తరువాత కాకినాడలోనే ఇది ఉంది. అలాగే విజయవాడ వారి ఎం అండ్ ఎం మరొకటి ఇది స్దాపింఛి రెండేళ్ళు కావస్తోంది. అలాగే నగరంలోని రాజు భవన్, ఇంకా సోనా షాపింగ్ మాల్స్ నగర వాసులకు సేవలను అందజేస్తున్నాయి. ఇంకా మరెన్నో యూనివెర్ సెల్ మొబైల్స్, ది మొబైల్ స్టొర్, బిగ్ సి వంటి ప్రముఖ మొబైల్ షాపులు మొబైల్ వినియొగదారులకు తమ తమ సేవలను అందజేస్తున్నాయి. బంగారు నగల కొరకు దక్షిణ భారతదేశంలోనే ప్రఖ్యాతి గాంచిన ఖజానా జ్యువెల్లరి కాకినాడలో వెలసి తమ సేవలను అందిస్తుండగా టాటా వారి గోల్డ్ ప్లస్, చందన జ్యువెల్లరిస్, రాజ్ జ్యువెల్లరి మాల్, మహ్మద్ ఖాన్ అండ్ సన్స్ జ్యుయలర్స్ ఇంకా స్దానికంగా ఉన్న మరెన్నొ నగల దుకాణాలు నగర వాసుల అవసరాలను తీరుస్తున్నాయి. నగర ప్రజలను ఎక్కువగా స్దానికంగా ఉన్న హొల్ సేల్ షాపులు వారి తక్కువ ధరలతో ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక నగరంలో కట్టుబాటుల గురించి వారి వస్త్రధారణ గురించి చెప్పుకుంటే మగవారు ఎక్కువగా ఇంటిలో ఉన్నప్పుడు లుంగీలను కట్టుకుంటారు. ఆడవారు నైటీలను, కాటన్ చీరలను, పంజాబి దుస్తులను ధరిస్తూ ఉంటారు. ఇక బట్టల దుకాణాల విషయానికి వస్తె వైభవ్ షాపింగ్ నూతనంగా స్థాపించబడి విశెష ఆదరణను పొందుతున్నది.

నగరంలోని, సమీపంలోని దర్శనీయ స్థలాలు

పాండవుల మెట్ట గుహలు, పెద్దాపురం
సర్పవరం శాసనాలు, సర్పవరం
భీమేశ్వరస్వామి గుడి, ద్రాక్షారామ
కుక్కుటేశ్వరస్వామి గుడి, పిఠాపురం

కాకినాడ పరిసరాల్లోని ప్రాంతాలలో చాళుక్యుల కాలంనాటి దేవాలయాలు, పాండవుల కాలంనాటివి చెప్పబడుతున్న గుహలు, ప్రాచీన తెలుగు శిలా శాసనాలు అనేకం ఉన్నాయి. సామర్లకోట లోని కుమారారామ భీమేశ్వరస్వామి దేవాలయంలో క్రీ.శ 7వశతాబ్దం నాటిదిగా భావిస్తున్న చాళుక్యుల తెలుగు శాసనాన్ని ఇటీవలే గుర్తించారు. తెలుగు భాషకి సంబంధించిన అత్యంత ప్రాచీన శిలాశాసనాలలో ఇది ఒకటిగా భావిస్తున్నారు [40]. సామర్లకోటలోనే, మాండవ్య మహర్షి ప్రతిష్ఠించిన మాండవ్య నారాయణ స్వామికి చోళరాజైన 2వ పులకేశి మునిమనుమడైన విజయాదిత్యుడు క్రీ||శ||655 నం||లో ఆలయాన్ని నిర్మించాడని చారిత్రకగాధ. ఆలయ స్తంభాలపై ప్రాకృత భాషలో అనేక శిలాశాసనాలు కనిపిస్తాయి. అలనాటి శిల్పులు కళావైభవానికి, యాంత్రిక ప్రతిభకు, వాస్తు విజ్ఞానానికి, సాంకేతిక పరిజ్ఞానానికి ఈ ఆలయం ఒక ప్రతీకగా నిలుస్తుంది. ఉత్తరాయణం - దక్షిణాయనం మధ్య కాలంలో శ్రీ నారాయణస్వామి వారి పాదాలపై సూర్యకిరణాలు నేరుగా పడటం అలనాటి ఆలయ నిర్మాణ కౌశలంగా చెప్పవచ్చు.

బిక్కవోలు గ్రామంలోని దేవాలయల్లో కూడా ప్రాచీన శాసనాలు, చాళుక్యుల కాలంనాటి శిలావిన్యాసాలను చూడవచ్చు. వీటిల్లో తూర్పు చాళుక్యుల కాలంనాటి, వినాయకుని 11 అడుగుల ఏకశిలావిగ్రహం, గోలింగేశ్వరస్వామి దేవస్థానం, శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం, శ్రీ చంద్రశేఖరస్వామి దేవాలయం ముఖ్యమైనవి. సర్పవరంలోని భావనారాయణస్వామి దేవస్థానంలోనూ, పిఠాపురంలోని కుక్కుటేశ్వరస్వామి దేవస్థానం, కుంతీ మాధవస్వామి దేవస్థానంలోనూ, ద్రాక్షారామ భీమేశ్వరస్వామి దేవస్థానంలోనూ కూడా ప్రాచీన శిలా శాసనాలను చూడవచ్చు.

చూడదగిన ప్రదేశాలు

  • ఉప్పాడ బీచ్ (కాకినాడ నుండి 7 కి.మీ )
  • హోప్ ఐలాండ్
  • భావనారాయణస్వామి దేవస్థానం, సర్పవరం, కాకినాడ
  • మంగళాంబికా సమేత ఆదికుంభేశ్వరస్వామి దేవాలయం (రావణబ్రహ్మ గుడి), ఉప్పాడ, కాకినాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావణునికి పుజాభిషేకాలు జరిగే ఏకైక ఆలయం.
  • అవతార్ మెహెర్ బాబా సెంటర్, రామారావు పేట, కాకినాడ
  • కుమారారామ భీమేశ్వర స్వామి దేవస్థానం, సామర్లకోట: పంచారామ క్షేత్రాలలో ఒకటి. (కాకినాడ నుండి 12 కి.మీ)
  • మాండవ్య నారాయణస్వామి దేవస్థానం, సామర్లకోట (కాకినాడ నుండి 12 కి.మీ)
  • మరిడమ్మ దేవస్థానం, పెద్దాపురం (కాకినాడ నుండి 16 కి.మీ)
  • పాండవుల మెట్ట, పెద్దాపురం (కాకినాడ నుండి 16 కి.మీ)
  • కుక్కుటేశ్వరస్వామి దేవస్థానం, పిఠాపురం: 'పాదగయ' క్షేత్రం మరియు అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. అమ్మవారి పేరు పురుహూతికా దేవి. (కాకినాడ నుండి 20 కి.మీ)
  • కుంతీమాధవస్వామి దేవస్థానం, పిఠాపురం (కాకినాడ నుండి 20 కి.మీ)
  • సూర్యనారాయణస్వామి దేవస్థానం, గొల్లల మామిడాడ (కాకినాడ నుండి 20 కి.మీ)
  • భీమేశ్వర స్వామి దేవస్థానం, ద్రాక్షారామ: అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి మరియు పంచారామ క్షేత్రాలలో ఒకటి. అమ్మవారి పేరు మాణిక్యాంబా దేవి. (కాకినాడ నుండి 25 కి.మీ)
  • కోరంగి అభయారణ్యం
  • యానాం (కాకినాడ నుండి 26 కి.మీ)
  • కోటిలింగేశ్వరస్వామి దేవస్థానం, కోటిపల్లి (కాకినాడ నుండి 30 కి.మీ)
  • బిక్కవోలు లోని ప్రాచీన దేవాలయాలు: జాతీయ వారసత్వ సంపదగా గుర్తింపు ఉన్న శిల్పాలు అనేకం ఉన్నాయి. (కాకినాడ నుండి 32 కి.మీ)
  • వీరేశ్వరస్వామి దేవస్థానం, మురముళ్ల (కాకినాడ నుండి 38 కి.మీ)
  • శృంగార వల్లభస్వామి దేవస్థానం (తొలి తిరుపతి), దివిలి, పెద్దాపురం (కాకినాడ నుండి 40 కి.మీ)
  • శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం, అన్నవరం (కాకినాడ నుండి 45 కి.మీ)
  • తలుపులమ్మ లోవ, తుని దగ్గర, (కాకినాడ నుండి 55 కి.మీ)

ప్రముఖ వ్యక్తులు

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

గణాంకాలు

మూలాలు

  1. "Provisional Population Totals, Census of India 2011; Urban Agglomerations/Cities having population 1 lakh and above" (pdf). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 26 March 2012.
  2. "Descriptive and Historical Account of the Godavery District in The Presidency of Madras, By Henry Morris". Retrieved 2014-05-10.
  3. "A Fatwa against the Idea of India". www.rediff.com. Retrieved 2014-05-10.
  4. "October, 69 years ago, when Madras was bombed". The hindu. Retrieved 2014-05-09.
  5. "గ్రామాల విలీన ప్రతిపాదన". ఆంధ్ర ప్రభ. Retrieved 2012-05-03.
  6. "జాతీయ రహదారులు కానున్న రాష్ట్ర రహదారులు". ఆంధ్ర ప్రభ. Retrieved 2014-05-07.
  7. 7.0 7.1 7.2 7.3 "Advantage Andhra Pradesh, Petroleum, Chemical & Petrochemical Investment region - PCPIR; Visakhapatnam - Kakinada Corridor" (pdf). Andhra Pradesh Industrial Infrastructure Corporation Ltd. Retrieved 07 May 2014. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  8. ""EID Parry teams up with Cargill for sugar EoU", The Hindu (25 April 2006)". The Hindu. India. 25 April 2006. Retrieved 10 May 2014.
  9. "పెట్రో కారిడార్‌ ద్వారా ఉపాధి అవకాశాలు మెండు పిసిపిఐఆర్‌ వర్క్‌షాపులో పురంధేశ్వరి". ఆంధ్రప్రభ. Retrieved 10 May 2014.
  10. 10.0 10.1 "Shell to join GAIL's Kakinada LNG project with 30% stake". Business Standard. Retrieved 10 May 2014.
  11. "Nikhil, Acalmar edible oil refineries go on stream". The Hindu. 29 March 2002. Retrieved 10 May 2014.
  12. "Universalbiofuelsltd.com". Universalbiofuelsltd.com. Retrieved 10 May 2014.
  13. ">> News >> Business >> Bio-fuel is next big bet if crude continues to rise". Moneycontrol. Retrieved 10 May 2014.
  14. "Reliance's new biofuel business model to provide fuel with food". Livemint.com. 20 July 2008. Retrieved 10 May 2014.
  15. "SPGL.co.in". SPGL.co.in. Retrieved 10 May 2014.
  16. "Anil Ambani monitors progress at Samalkot Plant". The Times of India. India. 22 January 2011.
  17. [hhttp://www.thehindu.com/news/international/samalkot-on-obamas-strategic-map/article1116488.ece "Samalkot on Obama's strategic map"]. The Hindu. India. 22 January 2011.
  18. "L&T bags Rs. 827 crore orders for thermal power plant construction". ND TV. India. 25 November 2011.
  19. "Gas-based power projects shutting down units". The Hindu. India. 13 April 2013.
  20. "Software Technology parks of India, Kakinda". www.kkd.stpi.in. Retrieved 09 May 2014. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  21. "Kakinada zooms ahead as an IT hub-". The Times of India. India. 14 February 2011.
  22. "Kakinada making strides in IT industry". The hindu. Retrieved 2014-05-08.
  23. 23.0 23.1 "ఐఐఐటీ కి పల్లంరాజు శంకుస్థాపన". ది హిందూ. Retrieved 2014-05-09.
  24. "Infotech-enterprises.com". Infotech-enterprises.com. Retrieved 20 November 2011.
  25. "Avineon.com". Avineon.com. Retrieved 20 November 2011.
  26. "Firstobjectindia.com". Firstobjectindia.com. Retrieved 09 May 2014. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  27. "Krify.com". Krify.com. Retrieved 09 May 2014. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  28. "SEO & Web Designing and Development Company". www.prominere.com. Retrieved 09 May 2014. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  29. "3one.in". 3one.in. Retrieved 09 May 2014. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  30. "Trewport.com". Trewport.com. Retrieved 09 May 2014. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  31. "Aaspiretechnologies.com". Aaspiretechnologies.com. Retrieved 09 May 2014. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  32. "Traceout.com". Traceout.com. Retrieved 09 May 2014. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  33. "Fore-tell.com". Fore-tell.com. Retrieved 20 November 2011.
  34. "Mythrii.com". Mythrii.com. Retrieved 09 May 2014. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  35. "Nyros.com". Nyros.com. Retrieved 09 May 2014. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  36. "Meconzee.com". Meconzee.com. Retrieved 09 May 2014. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  37. "Andhraelec.com". Andhraelec.com. Retrieved 17 August 2014.
  38. "కాకినాడ కేంద్రంగా హార్డ్ వేర్ పార్క్". www.sakshi.com. Retrieved 17 August 2014.
  39. "జిల్లాకు 'మెగా' పర్యాటక కళ". ఆంధ్ర ప్రభ. Retrieved 2014-05-10.
  40. "Early Telugu inscription found". The hindu. Retrieved 2014-05-10.
  41. బుద్ధవరపు, పట్టాభిరామయ్య (1927). కొమ్మిరెడ్డి సూర్యనారాయణమూర్తి గారి జీవితము (PDF). రాజమండ్రి. p. 14. Retrieved 11 April 2015.{{cite book}}: CS1 maint: location missing publisher (link)

మూసలు, వర్గాలు

"https://te.wikipedia.org/w/index.php?title=కాకినాడ&oldid=2527309" నుండి వెలికితీశారు