దక్షిణ మధ్య రైల్వే

వికీపీడియా నుండి
(గుంటూరు రైల్వేస్టేషను నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దక్షిణ మధ్య రైల్వే (హింది, ఇంగ్లీష్ లో)
దక్షిణ మధ్య రైల్వే జోన్ (6వ నెంబరు)
దక్షిణ మధ్య రైల్వేలో పురాతనమైన రైల్వేస్టేషన్లలో ఒకటైన కాచిగూడ రైల్వేస్టేషన్
దక్షిణ మధ్య రైల్వే జోన్లో పెద్ద జంక్షన్ విజయవాడ
దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఈశాన్యాన చివరిది అనకాపల్లి రైల్వేస్టేషన్

భారతదేశం లోని 16 రైల్వే జోన్‌లలో ఒకటైన దక్షిణ మధ్య రైల్వే 1966, అక్టోబర్ 2న ఏర్పడింది. ఈ రైల్వే జోన్ సికింద్రాబాదు ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దీని పరిధిలో ప్రస్తుతం 6 రైల్వే విభాగములు ఉన్నాయి. తెలంగాణ లోని హైదరాబాదు, సికింద్రాబాదు, ఆంధ్ర ప్రదేశ్ లోని గుంతకల్లు, విజయవాడ, గుంటూరు లతో పాటు మహారాష్ట్రకు చెందిన నాందేడ్ మండలాలు దక్షిణ మధ్య రైల్వేలో ఉన్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ మఱియు తెలంగాణలో విస్తరించియున్న ఈ డివిజన్ కొంతమేరకు కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో కూడా వ్యాపించియున్నది. మొత్తం 5752 కిలోమీటర్ల నిడివి కలిగిన రైలు మార్గం ఈ జోన్‌లో విస్తరించిఉన్నది. దేశంలో అత్యధిక లాభాలు ఆర్జించే జోన్‌లలో ఇది ఒకటి.[1]

చరిత్ర

1966, అక్టోబరులో భారతీయ రైల్వేలో 9వ జోన్‌గా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేయబడ్డది.[2] దక్షిణ రైల్వే జోన్ నుండి విజయవాడ మఱియు హుబ్లీ డివిజన్లను, మధ్య రైల్వే లోని సికింద్రాబాదు, షోలాపూర్ డివిజన్లు వేరు చేసి ఈ జోన్‌ను ఏర్పాటుచేశారు. 1977 అక్టోబర్, 2న దక్షిణ రైల్వేకు చెందిన గుంతకల్లు డివిజను దీనిలో విలీనం చేయబడింది. అదే సమయంలో షోలాపూర్ డివిజన్‌ను మధ్య రైల్వేకు బదిలీ చేశారు. 1978లో సికింద్రాబాదు డివిజన్‌ను రెండుగా విభజించి హైదరాబాదు డివిజన్‌ను నూతనంగా ఏర్పాటుచేశారు.2003, ఏప్రిల్ 1న కొత్తగా ఏర్పడిన గుంటూరు, నాందేడ్ డివిజన్లు కూడా ఈ జోన్‌లో భాగమయ్యాయి. అదివరకు దక్షిణ మధ్య రైల్వేలో కొనసాగిన హుబ్లి డివిజన్‌ను నూతనంగా ఏర్పాటైన నైరుతి రైల్వేలో విలీనం చేశారు. ప్రస్తుతం ఈ జోన్ పరిధిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 5 డివిజన్లు (సికింద్రాబాదు, హైదరాబాదు, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు), మహారాష్ట్రకు చెందిన ఒక డివిజను (నాందేడ్) కలిపి మొత్తం ఆరు (6) డివిజన్లు ఉన్నాయి.

డివిజన్ల పరిధి

(1) సికింద్రాబాదు రైల్వే డివిజను:

(2) హైదరాబాదు రైల్వే డివిజను:

(3) నాందేడ్ రైల్వే డివిజను:

(4) విజయవాడ రైల్వే డివిజను:

(5) గుంతకల్లు రైల్వే డివిజను:

(6) గుంటూరు రైల్వే డివిజను:

గుంటూరు రైల్వేస్టేషను

గుంటూరు రైల్వే జంక్షను, భారతదేశ దక్షిణమధ్య రైల్వే విభాగానికి చెందిన ముఖ్యమైన రైల్వే జంక్షనులలో ఒకటి. దక్షిణ మధ్య రైల్వే విభాగములో గల ఆరు డివిజన్లలో ఇది ఒకటి. ఇది విజయవాడ, రేపల్లె, మచిలీపట్నం, హైదరాబాదు, మాచర్ల, తెనాలి మొదలైన పట్టణాలకు రైలు మార్గం ద్వారా కలపబడి ఉంది.గుంటూరు-తెనాలి రైలుమార్గాన్ని డబ్లింగ్‌ విద్యుదీకరణ, గుంటూరులో మరో పిట్‌ లైన్‌ ఏర్పాటు, నల్లపాడు- పగిడిపల్లి మధ్య డబ్లింగ్‌, విద్యుదీకరణ, వినుకొండ-విష్ణుపురం, నడికుడి-శ్రీకాళహస్తి నూతన రైలు మార్గం ఏర్పాటు లాంటి పనులు ఇంకా చేయవలసి ఉంది..

దక్షిణ మధ్య రైల్వే గణాంకాలు

భారతీయ రైల్వేలు లోని మండలాలు (జోన్స్ మ్యాప్) సూచించే పటం .
  • రైలుమార్గ పొడవు: 5809.990 కిలోమీటర్లు (బ్రాడ్‌గేజి:5634.060, మీటర్‌గేజి:175.930)
  • రైల్వే ట్రాక్ పొడవు: 7806.251 కిలోమీటర్లు.
  • డివిజన్ల సంఖ్య: 6.
  • విస్తరించిన రాష్ట్రాల సంఖ్య: 5 (తమిళనాడు (7 కి.మీ) తో కలిపి)
  • రైలు వంతెనల పొడవు: 117.85 కిలోమీటర్లు.
  • విద్యుదీకరించిన మార్గం: 1620 కిలోమీటర్లు.
  • రైల్వే స్టేషన్లు సంఖ్య : 689
  • పనిచేయు మొత్తం సిబ్బంది : 84,145 [3]
  • రోజువారీ నడిచే ప్రయాణీకులు (ప్యాసింజర్) రైళ్లు సంఖ్య : 699
    • మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్ళు సంఖ్య : 218
    • ప్యాసింజర్ రైళ్లు సంఖ్య  : 302
    • లోకల్ రైళ్లు సంఖ్య : 58
    • ఎమ్‌ఎమ్‌టిఎస్ (MMTS) : 121

చిత్ర మాలిక

రైలు మార్గ నిడివి

ఆంధ్ర ప్రదేశ్ మీటర్‌గేజి లేని రాష్ట్రం

దక్షిణ మధ్య రైల్వేలోని బొగద రైలు సొరంగం గుండా వెళుతున్న ఒక రైలు
  • దక్షిణమధ్య రైల్వే కిందకు వచ్చే రాష్ట్ర పరిధిలోని మీటర్‌ గేజి రైలు మార్గాన్ని పూర్తిగా బ్రాడ్‌గేజిగా మార్చేశారు. ఇక రాష్ట్రంలో పూర్తిగా బ్రాడ్‌గేజి పైనే అన్ని రైళ్లూ పయనిస్తాయి. ఒక రాష్ట్రంలో అన్ని మార్గాలు బ్రాడ్‌గేజిగా మారడం దేశంలో రికార్డు.

మైలురాళ్ళు

  • 1978 సం.లో సికింద్రాబాద్ డివిజన్‌ను, సమర్థవంతమైన కార్యాచరణ, నిర్వాహక నియంత్రణ సులభతరం చేయడానికి, సికింద్రాబాద్ డివిజన్ మఱియు హైదరాబాద్ డివిజన్ అను రెండు డివిజన్లు (విభాగములు) గా విడగొట్టడము జరిగింది.
  • 1 వ ఏప్రిల్, 2003 న, కొత్తగా ఏర్పడిన గుంటూరు మఱియు నాందేడ్ డివిజన్లు అందిపుచ్చుకుంది, దక్షిణ మధ్య రైల్వే లోని హుబ్లి డివిజన్, కొత్తగా ఏర్పడిన నైఋతి రైల్వేకు బదిలీ చేయబడింది.
  • ప్రస్తుతం, దక్షిణ మధ్య రైల్వే 5752 మార్గం (రూట్) కిలోమీటర్లతో సికింద్రాబాద్, హైదరాబాద్, గుంతకల్లు, విజయవాడ, గుంటూరు మఱియు నాందేడ్లు కలిపి ఆరు డివిజన్లు కలిగి ఉంది. ఇందులో 1604 కి.మీ. మార్గం (రూట్) కిలోమీటర్లు విద్యుదీకరింపబడింది.
  • దక్షిణ మధ్య రైల్వే ప్రారంభం తరువాత, 342,805 కి.మీ. మార్గం (రూట్) కిలోమీటర్లు కొత్తగా వేశారు. మీటర్‌గేజి నుండి బ్రాడ్‌గేజికి 2676,19 కి.మీ. మార్గం (రూట్) కిలోమీటర్లు గేజి మార్పిడి పనులు, 1272,453 కి.మీ. మార్గం (రూట్) కిలోమీటర్లు ట్రాక్ రెట్టింపు అనగా జంట లైన్లు పనులు చేపట్టారు, జరిగినవి.
  • పలు ప్రధాన నది వంతెనలు మార్చబడి, ఇంజనీరింగ్ అద్భుతాలు అనదగ్గ రాజమండ్రి వద్ద II గోదావరి వంతెన, III గోదావరి వంతెనలతో సహా నిర్మించడము జరిగింది.

ప్రైవేటు రైల్వే లైన్లు

రాష్ట్ర ప్రభుత్వం సగం నిధులను భరించడానికి ముందుకొచ్చే లైన్ల నిర్మాణానికి మాత్రమే రైల్వేశాఖ అనుమతి ఇస్తోంది. ఇకపై సర్వేలు పూర్తయి, లాభదాయకత ధ్రువపడి కొత్తగా ప్రతిపాదించిన లైన్లు మాత్రమే ప్రైవేటుకు అప్పగిస్తారు. విధానాలు:

  • లైన్‌ కనీసం 20 కిలోమీటర్ల పొడవు ఉండాలి.
  • రైళ్లు నడిపే అధికారం రైల్వేదే.
  • లైన్ల నిర్మాణం కోసం సేకరించిన భూములు, లైన్‌లు అన్నీ రైల్వే ఆస్తులుగానే పరిగణిస్తారు.
  • భూసేకరణ రైల్వేయే చేపడుతుంది. డబ్బులు మాత్రం ప్రైవేటు సంస్థలు చెల్లించాలి.
  • ప్రైవేటు సంస్థ సదరు లైనును 30 ఏళ్ల పాటు నిర్వహించుకొని ఆదాయం పొందాలి.

ముఖ్యమైన సంఘటనలు

రాజమండ్రి వద్ద మూడవ గోదావరి వంతెన
మొదటి గోదావరి వంతెన
  • 1966: దక్షిణ మధ్య రైల్వే ఆవిర్భవించెను. సికింద్రాబాదులో రైల్ నిలయం భవన శంకుస్థాపన.
  • 1967: ఏప్రియల్ 1-వ తేది శనివారము నాడు భారత దేశమందలి అత్యంత వేగముగ నడిచెడి మీటర్ గేజ్ రైలైన అజంతా ఎక్స్‌ప్రెస్ కాచిగూడ-మన్మాడ్ నడుమ ప్రవేశపెట్టబడెను. దాని వేగము గంటకు 42.5 కి.మీ.
  • 1974: గోదావరి నది పై రెండో రైలు-రోడ్డు వంతెన ప్రారంభం.
  • 1974: గుంటుపల్లిలో వ్యాగన్ వర్క్‌షాప్ శంకుస్థాపన.
  • 1975: ద.మ. రైల్వేలో తొలిసారిగా విజయవాడలో ఇంటర్ లాకింగ్ సౌకర్యం ప్రారంభం.
  • 1976: హైదరాబాదు-క్రొత్త ఢిల్లీల మధ్య సూపర్ ఫాస్ట్ రైలు ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ ఆరంభమైంది.
  • 1977: దక్షిణ మధ్య రైల్వే యొక్క సికింద్రాబాదు మండలం రెండుగా విభజింపబడెను. బ్రాడ్ గేజి మార్గమంతటితో సికింద్రాబాదు మండలాన్ని మీటరు గేజి మార్గమంతటితో హైదరాబాదు మండలాన్ని ఏర్పరచబడెను.
  • 1980: విజయవాడలో ఎలక్ట్రిక్ లోకోషెడ్ ప్రారంభం.
  • 1983: గుత్తి-ధర్మవరం మధ్య అదనపు బ్రాడ్‌గేజి మార్గం ప్రారంభం.
  • 1985: తిరుపతిలో క్యారేజి రిపేర్ షాప్ ప్రారంభమైంది.
  • 1987: బీబీనగర్-నడికుడి మధ్య రైళ్ళ రాకపోకలు ప్రారంభం.
  • 1988: ద.మ. రైల్వేలో రైల్‌నెట్ ప్రారంభించబడింది.
  • 1989: ద.మ. రైల్వేలో తొలిసారిగా సికింద్రాబాదులో కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడింది.
  • 1992: మన్మాడ్-ఔరంగాబాద్ నడుమ గేజ్ మార్పిడి పనులు ప్రారంభము.
  • 1995: లాలాగుడాలో ఎలక్ట్రిక్ లోకోషెడ్‌కు శంకుస్థాపన.
  • 1995: నాందేడ్-అమృతసరస్సు నడుమ అత్యంత ప్రతిష్ఠాత్మక సచ్ ఖండ్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభింపబడెను. ఇది 2007 లో దినసరి రైలుగా మార్చబడెను.
  • 1997: రాజమండ్రి వద్ద మూడవ గోదావరి వంతెన ప్రారంభం.
  • 2002: సికింద్రాబాదు-హజ్రత్ నిజాముద్దీన్ నడుమ రాజధాని సూపర్ ఫాస్ట్ రైలు ప్రారంభించబడింది.
  • 2003: దక్షిణ మధ్య రైల్వే యొక్క హైదరాబాదు మండలం రెండుగా విభజింపబడి నాందేడ్ మండలం ఆవిర్భవించెను. విజయవాడ మఱియు గుంతకల్లు మండలాలు పునర్వ్యవస్థీకరింపబడి గుంటూరు మండలం ఆవిర్భవించెను. దక్షిణ మధ్య రైల్వేలో భాగముగానున్న హుబ్బళ్ళి మండలం, నూతనముగా ఏర్పరచబడిన నైఋతి రైల్వేలో విలీనము చేయబడెను. దీనితో దక్షిణ మధ్య రైల్వే లోని మండలంల సంఖ్య ఆఱుకు చేరెను. (సికింద్రాబాదు, గుంతకల్లు, విజయవాడ, హైదరాబాదు, నాందేడ్, గుంటూరు)
  • 2004: సికింద్రాబాదు-ఫలక్‌నామా మధ్య ఎం.ఎం.టి.ఎస్ రైలు ప్రారంభించబడింది.
  • 2008: సికింద్రాబాదు-విశాఖపట్నం మధ్య గరీబ్ రథ్ ప్రారంభము.
  • 2008: నవంబరు 12-వ తేదీన పూర్ణా-అకోలా నడుమ బ్రాడ్ గేజి రైళ్ళు ప్రారంభము.
  • 2014: డిశంబరు 13-వ తేదీన ఔరంగాబాద్-రేణిగుంట వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రారంభింపబడెను.
  • 2020: జనవరి 10-వ తేదీ మొదలు మన్మాడ్-ముంబై నడుమ నడచు రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ నాందేడ్ వరకు పొడగింపబడెను. చారిత్రక కాచిగూడ-మన్మాడ్ ప్యాసింజర్ నాగర్సోల్ వరకు పరిమితము చేయబడెను.

ముఖ్యమైన రైల్వే స్టేషన్లు

దక్షిణ మధ్య రైల్వే జోన్‌ లోని ముఖ్యమైన రైల్వేస్టేషన్లు

ముఖ్యమైన రైలుబండ్లు

దక్షిణ మధ్య రైల్వే జోన్‌ గుండా ప్రయాణించే ముఖ్యమైన రైలుబండ్లు

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-03-05. Retrieved 2008-10-26.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-10-15. Retrieved 2008-10-26.
  3. [1]

మూసలు , వర్గాలు