విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(విజయవాడ పటమట శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°32′20″N 80°39′50″E మార్చు
పటం

విజయవాడ తూర్పు శాసనసభ నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లాలో గలదు. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉన్న మూడు నియోజకవర్గాల్లో ఇది ఒకటి.

చరిత్ర

[మార్చు]

2009 కు ముందు ఉన్న విజయవాడ తూర్పు నియోజకవర్గానికి పునర్విభజన తర్వాత కొత్తగా అదే పేరుతో ఏర్పాటైన కొత్త నియోజకవర్గానికి ఏ మాత్రం పొంతన లేదు. ఈ నియోజకవర్గంలోని ప్రధాన ప్రాంతాలుగా ఉన్నవి గతంలో కంకిపాడు నియోజకవర్గంలో ఉండేవి. బందరురోడ్డు, ఆటోనగర్, పటమట, రామలింగేశ్వరనగర్, అత్యధికమైన కాలనీలు, హెల్త్ యూనివర్సిటీ, గుణదల లోని మేరిమాత పుణ్యక్షేత్రం తదితర కీలక ప్రాంతాలు ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి.

భౌగోళికం

[మార్చు]
  • విజయవాడ పట్టణ కార్పోరేషన్‌లోని కొన్ని వార్డులు

ప్రాంతాలు

[మార్చు]

తూర్పు నియోజకవర్గంలో ఆటోనగర్‌, పటమట, పటమటలంక, రామలింగేశ్వరగనర్‌, మొగల్రాజపురం, గుణదల, కృష్ణలంక ప్రాంతాలు ఉన్నాయి.

  • కృష్ణలంక బస్‌స్టాండ్‌ ఇవతల ప్రాంతమంతా ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.
  • తూర్పు నియోజకవర్గానికి ఆటోనగర్‌ బస్‌స్టాండ్‌ సరిహద్దు. అటుపైన అంతా పెనమలూరు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.
  • గుణదల మాచవరం ఆంజనేయ స్వామి గుడి వరకు తూరు నియోజకవర్గం సరిహద్దు ఉంది.
  • బెంజిసర్కిల్‌ నుంచి రామవరప్పాడు రింగ్‌ వరకు వరకు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్నటువంటి అత్యధిక కాలనీలు

జాతీయ రహదారులు

[మార్చు]

రెండు జాతీయ రహదారులు ఈ నియోజకవర్గం మీదుగా వెళ్ళుతున్నాయి. నియోజకవర్గంలో పేద, మధ్యతరగతి, ధనిక అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారు. వాణిజ్య, వ్యాపార, విద్యా కూడలిగా ఈ ప్రాంతం బాగా ప్రసిద్ధి చెందింది.

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

[మార్చు]

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు మూలాలు
2019 200 విజయవాడ తూర్పు జనరల్ గద్దె రామమోహన్ పు. టి.డి.పి. బొప్పన భవకుమార్‌ పు. వైఎస్‌ఆర్‌.సి.పి.
2014 200 విజయవాడ తూర్పు జనరల్ గద్దె రామమోహన్ పు. టి.డి.పి. 88,784 వంగవీటి రాధాకృష్ణ పు. వైఎస్‌ఆర్‌.సి.పి. 73,281
2009 200 విజయవాడ తూర్పు జనరల్ యలమంచిలి రవి పు. ప్ర.రా.పా. 53319 దేవినేని రాజశేఖర్ (నెహ్రు) పు. భా.జా.కాం. 53129
2004 78 విజయవాడ తూర్పు జనరల్ వంగవీటి రాధాకృష్ణ పు. భా.జా.కాం. 59340 యేలేశ్వరపు నాగ కనక జగన్ మోహన్ రాజు (నాగరాజు) పు. బి.జె.పి. 32629
1999 78 విజయవాడ తూర్పు జనరల్ కోట శ్రీనివాసరావు పు. బి.జె.పి. 57047 ఐలాపురం వెంకయ్య పు. భా.జా.కాం. 50971 [1]
1994 78 విజయవాడ తూర్పు జనరల్ వంగవీటి రత్నకుమారి స్త్రీ భా.జా.కాం. 44783 జయరాజు బి.ఎస్. పు. టి.డి.పి. 28599 [2]
1989 78 విజయవాడ తూర్పు జనరల్ వంగవీటి రత్నకుమారి స్త్రీ భా.జా.కాం. 68301 ఎన్. శివరాం ప్రసాద్ పు. టి.డి.పి. 42973 [3]
1985 78 విజయవాడ తూర్పు జనరల్ వంగవీటి మోహన రంగారావు (రంగా) పు. భా.జా.కాం. 45575 యార్లగడ్డ రాజగోపాలరావు పు. టి.డి.పి. 42445 [4]
1983 78 విజయవాడ తూర్పు జనరల్ అడుసుమిల్లి జయప్రకాశరావు పు. ఇండి. 38411 జంధ్యాల కామేశ్వరి శంకర్ స్త్రీ భా.జా.కాం. 23534 [5]
1978 78 విజయవాడ తూర్పు జనరల్ నాదెండ్ల భాస్కర రావు పు. భా.జా.కాం. (ఐ) 30039 బాయన అప్పారావు పు. జె.ఎన్.పి. 26925 [6]
1972 77 విజయవాడ తూర్పు జనరల్ దమ్మాలపాటి రామారావు పు. భా.జా.కాం. 24356 చలసాని వెంకటరత్నం పు. సిపిఐ 17021 [7]
1967 77 విజయవాడ తూర్పు జనరల్ వి.ఎస్.సి.ఆర్. తెన్నేటి పు. భా.జా.కాం. 26029 కాట్రగడ్డ ఆర్.ఆర్ పు. సిపిఐ 17544
1962 77 విజయవాడ తూర్పు జనరల్ చేబ్రోలు హనుమయ్య పు. భా.జా.కాం. [8]

నిర్మాణ దశలలో ఉన్న ప్రాజెక్టులు, పెద్ద పథకాలు

[మార్చు]
  • గుణదల గంగిరెద్దుల దిబ్బపై రూ.6 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న రక్షిత నీటి రిజర్వాయర్‌, నీటి శుద్ధిచేసే ప్లాంట్‌ పనులు మొదటి దశలో ఉన్నాయి. రైవస్‌ కాలువ నీటిని ఇక్కడకు పంపింగ్‌ చేసి వాటిని శుద్ధి చేసి కొండప్రాంత వాసులకు అందిచేస్తారు. కొన్ని సాంకేతిక కారణాలతో పూర్తి చేయుటకు మరికొంత సమయం పట్టే వీలుంది.
  • ఈ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో యూజీడి పనులు జరుగుతున్నాయి. తదుపరి ఆయా ప్రాంతాల్లో రోడ్లు వేయాల్సి ఉంది.
  • గుణదల ప్రాంతంలో పేదల కోసం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభదశలో ఉన్నాయి. ఇక్కడ 500 కుటుంబాలకు పైగా జి+3 అంతస్తుల్లో భవనాలను నిర్మించి అందజేస్తారు. వీటి నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతోంది.

ముఖ్యమైన ప్రదేశాలు

[మార్చు]

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ

[మార్చు]

దేశంలోనే మొదటి ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం.

ఆటోనగర్‌

[మార్చు]

దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పరిశ్రమలు రెండు ఉండగా, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 200 వరకు ఉంటాయి. ఆసియాలో అతి పెద్ద ఆటోనగర్‌గా పేరుగాంచింది. 275 ఎకరాల్లో ఆటోనగర్‌ విస్తరించి ఉంది. 53 ఎకరాల్లో ఆటోనగర్‌ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ను ఏర్పాటు చేశారు. ఆటోమొబైల్‌కు సంబంధించి వివిధ వర్క్‌షాపులు, ఫౌండ్రీలు కూడా ఉన్నాయి. ఆటోనగర్‌లో సుమారు 80 వేల మంది ఉపాధి పొందుతున్నారు.

బెంజిసర్కిల్‌

[మార్చు]

విజయవాడలోనే అత్యంత రద్దీ కూడలి ప్రదేశం. అటు చెన్నై, ఇటు కోలకత్తాను కలిపే జాతీయ రహదారి. గతంలో ఇక్కడ బెంజ్‌ వాహనాల కంపెనీ ఉండడంతో ఆ పేరుతోనే ఈ జంక్షన్‌కు పేరు వచ్చింది. నిజానికి బెంజ్‌సర్కిల్‌ కూడలిలో ఉంది కాకాని వెంకటరత్నం విగ్రహం ఉన్నదన్న విషయం చాలా మందికి తెలియదు.

  • వేంకటేశ్వరస్వామి గుడి, లబ్బీపేట
  • గణపతి సచ్చిదానంద ఆశ్రమం, పటమట
  • సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల,
  • ప్రభుత్వ దంత వైద్య కళాశాల,
  • ప్రభుత్వ ఆస్పత్రి
  • కృష్ణలంక త్రిశక్తిపీఠం
  • ఈ.ఎస్‌.ఐ. కార్మిక బీమా ఆస్పత్రి
  • గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం: ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 నెలలో మేరీమాత ఉత్సవాలు నిర్వహిస్తారు. లూర్థు నగరంలో ఉన్న మేరీ మాత పుణ్యక్షేత్రం తరహాలోనే గుణదల కొండ పై మేరీ మాత పుణ్యక్షేత్రాన్ని నిర్మించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కులమతాలకు అతీతంగా అనేకమంది భక్తులు హజరవుతుంటారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల జాబితాలు

మూలాలు

[మార్చు]
  1. "List of Successful Candidates in Andhra Pradesh Assembly Election in 1999". Elections.in. Retrieved 11 October 2014.
  2. "List of Successful Candidates in Andhra Pradesh Assembly Election in 1994". Elections.in. Archived from the original on 5 సెప్టెంబరు 2016. Retrieved 11 October 2014.
  3. "List of Successful Candidates in Andhra Pradesh Assembly Election in 1989". Elections.in. Retrieved 11 October 2014.
  4. "List of Successful Candidates in Andhra Pradesh Assembly Election in 1985". Elections.in. Retrieved 11 October 2014.
  5. "List of Successful Candidates in Andhra Pradesh Assembly Election in 1983". Elections.in. Archived from the original on 3 మార్చి 2016. Retrieved 11 October 2014.
  6. "List of Successful Candidates in Andhra Pradesh Assembly Election in 1978". Elections.in. Retrieved 11 October 2014.
  7. "List of Successful Candidates in Andhra Pradesh Assembly Election in 1972". Elections.in. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 11 October 2014.
  8. "List of Successful Candidates in Andhra Pradesh Assembly Election in 1962". Elections.in. Archived from the original on 14 ఏప్రిల్ 2018. Retrieved 11 October 2014.