అర్థపంచకము

వికీపీడియా నుండి
(అర్థము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

అర్థపంచకం, నారాయణ పరివ్రాట్కృత మగు గ్రంథం, పంచవిషయపద్ధతిని దెలుపును.[1]

పంచ ప్రధాన విషయములు

[మార్చు]

పంచప్రధాన విషయాలు ఐదు అవి: 1. జీవం, 2. ఈశ్వరుడు, 3. ఉపాయం, 4. ఫలం లేక పురుషార్థము, 5, విరోధం.

మరల నివి యొక్కొక్కటి యైదు తెరగులుగా ఉంటాయి. అవి:

  1. నిత్య, ముక్త, కేవల, ముముక్షు, బద్ధం లనునవి జీవం లోని యైదు తెరగులు.
  2. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చలు ఈశ్వరుని యందలి పంచప్రకారంలు.
  3. కర్మయోగ, జ్ఞానయోగ, భక్తియోగ, ప్రపత్తియోగ, ఆచార్యాభిమానయోగములు పంచోపాయంలు.
  4. ధర్మ, అర్థ, కామ, కైవల్య, మోక్షాలు పంచవిధ పురుషార్థంలు.
  5. స్వస్వరూపవిరోధం, పరస్వరూపవిరోధ, ఉపాయవిరోధ, పురుషార్థవిరోధ, ప్రాప్తివిరోధంలు.

వివరణ

[మార్చు]

ఉపాసన చేయువలెనన్న ముందు సౌఖ్యంగా ఉపాప్య వస్తువు స్వరూపంను, తర్వాత ఉపాసన చేయువారి స్వరూపంను, ఉపాసన చేయు మార్గంను, ఆ ఉపాసన చేయుటచే గలుగు ఫలంను, ఉపాసన చేయుటలో గలుగు విఘ్నంలను గూర్చి బాగుగా తెలిసికొనవలెను. ఈ ఐదు విషయంలకే అర్థపంచకంలని పేరు. దీనిని తెలుసుకోకపోతే సాధన నెరవేరదు. అనేక లోపాలు తటస్థించుచుండును. విక్షేపం చెందుటకవకాశం ఉంది.[2]

మూలాలు

[మార్చు]
  1. https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Andhravijnanasarvasvamupart2.pdf/494
  2. కుందుర్తి వేంకటనరసయ్య (1952). అర్థపంచకము.

వెలుపలి లంకెలు

[మార్చు]