Jump to content

విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 16°31′06″N 80°37′07″E / 16.5182°N 80.6185°E / 16.5182; 80.6185
వికీపీడియా నుండి
(బిజడ్‌ఎ నుండి దారిమార్పు చెందింది)
భారతీయ రైల్వేలు జంక్షన్ స్టేషను
సరికొత్త శోభతో విజయవాడ జంక్షన్ రైల్వేస్టేషను
సాధారణ సమాచారం
Locationరైల్వేస్టేషను రోడ్, విజయవాడ, కృష్ణా జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
Coordinates16°31′06″N 80°37′07″E / 16.5182°N 80.6185°E / 16.5182; 80.6185
యజమాన్యంభారతీయ రైల్వేలు
లైన్లు
ఫ్లాట్ ఫారాలు10
పట్టాలు22
నిర్మాణం
నిర్మాణ రకంప్రామాణికము (భూమి మీద స్టేషను)
పార్కింగ్ఉంది
Bicycle facilitiesఅనుమతి
Disabled accessBZA
ఇతర సమాచారం
స్టేషను కోడుBZA
Fare zoneతూర్పు కోస్తా రైల్వే
History
విద్యుత్ లైనుఅవును
Previous namesహైదరాబాద్ గోదావరి వ్యాలీ రైల్వేలు, నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే
ప్రయాణికులు
ప్రయాణీకులు ()5.1 కోట్లు (షుమారుగా).
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

తూర్పు కోస్తా రైల్వే జోనులోని ప్రధానమైన రైల్వేస్టేషనులలో విజయవాడ రైల్వేస్టేషను ఒకటి. ఇది దేశంలోని పలు ముఖ్య రైల్వే లైన్లను కలిపే రైల్వే కూడలి. ఇది ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లో గలదు. అత్యంత రద్దీగా ఉండే స్టేషన్లలో దేశంలో కెల్లా విజయవాడ నాలుగవ స్థానంలో ఉంది.[1]


చరిత్ర

[మార్చు]

విజయవాడ రైల్వేస్టేషన్‌ను 1888వ సంవత్సరంలో నిర్మించారు. అప్పట్లో ఈ స్టేషను మద్రాస్‌ దక్షిణ మహారాటా రైల్వే (ఎంఎస్‌ఎం) సంస్థలో భాగంగా ఉండేది. 1889వ సంవత్సరంలో నిజాం హయాంలో సికింద్రాబాద్‌, విజయవాడ రైల్వేస్టేషన్ల మధ్య ఎక్స్‌టెన్షన్‌ మార్గాన్ని నిర్మించారు. దీనితో విజయవాడ స్టేషను ఒక జంక్షనుగా మారింది. 1899, నవంబరు 1 న విజయవాడ, మద్రాసుల మధ్య బ్రాడ్‌గేజ్‌ లైన్‌ను నిర్మించారు. దాంతో చెన్నై నుంచి ముంబయి, హౌరా, ఢిల్లీ, హైదరాబాద్‌ల మధ్య రైలు ప్రయాణం సాధ్యపడింది. స్వాతంత్ర్యానంతరం 1950లో భారత ప్రభుత్వం అన్ని స్వతంత్ర రైల్వేలను జాతీయం చేసినపుడు మద్రాస్‌ దక్షిణ మహారాటా సంస్థతో సహా విజయవాడ రైల్వేస్టేషను దక్షిణ రైల్వేలో భాగమైంది. 1966 ఏప్రిల్‌ 14 న విజయవాడ రైల్వే డివిజను, కొత్తగా ఏర్పడిన దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో భాగమైంది. [2]

విశిష్టత

[మార్చు]
  • విజయవాడ భారతీయ రైల్వేలలో ఒక ప్రముఖ జంక్షన్ స్టేషను. విజయవాడ రైల్వేస్టేషను దక్షిణ మధ్య రైల్వే పరిధి [3] లోపల ఉన్న ఆంధ్ర ప్రదేశ్లో విజయవాడ నగరంలో పనిచేస్తున్నది. విజయవాడ రైల్వేస్టేషను రెండు రైలు మార్గములు అయిన (1) హౌరా - చెన్నై ప్రధాన లైన్, (2) చెన్నై - న్యూఢిల్లీ లైన్ మీద నెలకొని ఉంది.
  • భారతదేశంలోకెల్లా ప్రయాణీకుల రైళ్ల కోసం పది వేదిక (ప్లాట్‌ఫారము) లు కలిగి ఉండి, బుకింగ్ కౌంటర్లుతో సహా ఐదు ప్రవేశ ద్వారాలు కలిగిన ఏకైక రైల్వేస్టేషను .
  • ఈ రైల్వేస్టేషను ద్వారా 250 కంటే ఎక్కువ ఎక్స్‌ప్రెస్, 150 సరుకు రవాణా రైళ్ళుతో, సంవత్సరానికి 50 మిలియన్ మించిన ప్రయాణీకులను గమ్యాలకు చేరుస్తుంది కనుక ఇది భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషనులలో ఒకటి .
కొత్త సొబగులు అద్దుకున్న విజయవాడ రైల్వేస్టేషను

స్టేషను

[మార్చు]
  • విజయవాడ జంక్షన్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో అతిపెద్ద, అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషనులలలో ఒకటి . ఇది ప్రధాన రైల్వే టెర్మినస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక రాజధానిగా విజయవాడ పట్టణ ప్రాంతంలో ఒక ప్రధాన ప్రయాణిక కేంద్రంగా ఉంది . ఆదాయం ఏడాదికి 100 కోట్ల ( 2013 పరంగా $ 17 మిలియన్లు) పైగా దాటిన సందర్భములో విజయవాడ జంక్షన్‌కు 2008 సంవత్సరములో A- 1 హోదా వచ్చింది .[4]

లేఅవుట్

[మార్చు]
  • విజయవాడ స్టేషను నందు, రైల్వేస్టేషను లోపల ఒక పరిపూర్ణ ట్రాక్షన్ ప్రామాణిక స్టేషను లేఅవుట్ ఉంది . స్టేషను‌లో అన్ని ట్రాక్స్ బ్రాడ్‌గేజ్‌, విద్యుత్‌ లైన్లతో విస్తృతంగా ఉంటాయి .

వేదికలు (ప్లాట్‌ఫారములు)

[మార్చు]
  • స్టేషను‌లోని 10 ప్లాట్‌ఫారము లైన్‌లు RCC ( రీఇన్‌ఫోర్స్ సిమెంట్ కాంక్రీట్ ) పైకప్పుతో కాంక్రీట్ చేయబడ్డాయి. ప్రతి వేదిక (ప్లాట్‌ఫారము) కూడా 24 కంటే ఎక్కువ బోగీలు కల ఎటువంటి రైలుబండి నయినా కూడా తీసుకుని, నిర్వహించగలుగుతుంది . అన్ని ట్రాక్లను బ్రాడ్‌గేజ్‌గా మార్చబడనవి. కేవలం వస్తువుల రవాణా (గూడ్స్) రైలుబండ్ల సేవల కొరకు అదనంగా 7, 8 నంబర్ల ప్లాట్‌ఫారములు మధ్యన మరో అదనపు ట్రాక్ ఉంది.

ప్లాట్‌ఫారములు ప్రధాన సర్వీసు వాడుక విధానం :

జంక్షన్

[మార్చు]

విజయవాడ రైల్వే స్టేషను, విజయవాడ నుండి నాలుగు దారులలో ప్రయాణించు రైలుమార్గములు గల జంక్షన్ :

  • విజయవాడ - కృష్ణా కెనాల్ - గుంటూరు/తెనాలి
  • విజయవాడ-గుడివాడ-సర్సాపూర్/ మచిలీపట్నం.
  • విజయవాడ-రాజమండ్రి-విశాఖ-హౌరా.
  • విజయవాడ-వరంగల్-కొత్తఢిల్లీ / సికింద్రాబాద్

"టచ్ & ఫీల్" (ఆధునిక స్టేషన్లు)

[మార్చు]

విజయవాడ రైల్వే డివిజను లోని పది ఆధునిక స్టేషన్లు అయిన నెల్లూరు, ఒంగోలు, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, కాకినాడ టౌన్, అనకాపల్లి, భీమవరం టౌన్ లలో ఇది ఒక మోడల్ స్టేషను, టచ్ & ఫీల్ (ఆధునిక స్టేషన్లు) గా గుర్తింపు పొందింది.[5][6][7]

సేవలు

[మార్చు]
క్లుప్తంగా
రైల్వే ట్రాక్‌ల మొత్తం సంఖ్య: 22
ప్రయాణీకుల రైల్వే ట్రాక్‌ల సంఖ్య
భూమి మీద:
10
రైలుబండ్లు (ప్రతిరోజు) : 250 ప్రయాణీకుల రైలుబండ్లు
150 సరుకు రవాణా రైలుబండ్లు
ప్రయాణీకులు సంఖ్య (ప్రతిరోజు) : 140,000

దక్షిణ భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే రైల్వే జంక్షన్ లలో ఒకటిగా, దక్షిణ మధ్య రైల్వే లోని విజయవాడ జంక్షన్ అంతర నగర (ఇంటర్ సిటి) సేవలతో పాటు సుదూర ప్రాంతాల ప్రయాణము కోసం ఒక కేంద్రంగా ఉంది. వివిధ రైలుబండ్ల ద్వారా ప్రతి రోజు 1,40,000 మంది ప్రజలు సగటున విజయవాడ రైల్వేస్టేషను నుండి బయలుదేరి ప్రయాణించడము, అదేవిధముగా అంతే సమాన సంఖ్యలోని ప్రయాణీకులు భారత దేశములోని అనేక ప్రాంతముల నుండి విజయవాడ జంక్షన్ లోని నిష్క్రమణ ద్వారం ద్వారా విజయవాడ నగరం (సిటి) లోనికి చేరుకుంటున్నారు.

ప్రతిరోజు 250 కంటే ఎక్కువగా ప్రయాణీకుల రైళ్లు, 150 వస్తువులను రవాణా (గూడ్స్) చేసే రైలుబండ్లు కనీసం 15 నుండి 20 నిమిషాలు సేపు వివిధ అవసరాల కోసం ఆపి ఈ స్టేషను సేవలు ఉపయోగించుకుంటాయి.[8]

విజయవాడ జంక్షన్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో అతిపెద్ద, అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషనులలో ఒకటి . ఇది ప్రధాన రైల్వే టెర్మినస్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక రాజధానిగా విజయవాడ నగర ప్రాంతంలో ఒక ప్రధాన ప్రయాణిక కేంద్రంగా ఉంది .

విజయవాడ జంక్షన్ ద్వారా రైళ్ళ సేవలు

[మార్చు]
  • విజయవాడ జంక్షన్ భారతీయ రైల్వేలులో 'మూడవ అతి రద్దీ అయిన రైల్వే స్టేషను అయినప్పటికీ, భారతదేశపు అతివేగ రైళ్లు రాజధాని ఎక్స్‌ప్రెస్ లు, లేదా శతాబ్ది ఎక్స్‌ప్రెస్లు అయినటువంటి ఇటువంటి రైలుబండ్లను, విజయవాడ రైల్వేస్టేషను చేరుకునే ప్రయాణీకుల అవసరాల కొరకు, వారికి సేవలు చేసుకునేందుకు సౌకర్యాలు కల్పించుటకు, విజయవాడ జంక్షన్ కు ప్రాముఖ్యత విషయములో, అటువంటి అవకాశములు మాత్రము అందించక, కల్పించక పోవటము మాత్రము చాలా శోచనీయమనే చెప్పుకోవాలి.
  • రాజధాని ఎక్స్‌ప్రెస్లు, గరీబ్‌ రథ్ ఎక్స్‌ప్రెస్ లు విజయవాడ రైల్వేస్టేషను మీదుగానే ప్రయాణిస్తాయి. అదేవిధముగా, విజయవాడ జంక్షన్ నుండి చెన్నై సెంట్రల్ వరకు, అలాగే చెన్నై సెంట్రల్ నుండి విజయవాడ రైల్వేస్టేషను వరకు ఒక జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఉంది. ఈ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలు మాత్రం అన్ని జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుబండ్ల కంటే అతి వేగవంత మయినది.
  • విజయవాడ జంక్షన్ లో కూడా లోకోమోటివ్ తరగతి డబ్ల్యుడిఎం - 2 కొరకు ఒక డీజిల్ లోకో షెడ్, లోకోమోటివ్ నమూనాలు ఇండియన్ లోకోమోటివ్ తరగతి డబ్ల్యుఎజి - 7, డబ్ల్యుఈం - 4, డబ్ల్యుఎజి - 5 తరగతుల (మోడళ్ల) కు మరి ఒక ఎలక్ట్రిక్ లోకో షెడ్ కలిగి ఉంది.

మౌలిక సదుపాయాల నిర్మాణము

[మార్చు]
భారతీయ రైల్వేలు లోని మండలాలు (జోన్స్ మ్యాప్) సూచించే పటం .
  • ఆగ్నేయ రైల్వే ప్రధాన కార్యాలయం విశాఖపట్నం నుండి భువనేశ్వర్‌కు తరలించబడింది, దీని వల్ల గత ఐదు సంవత్సరాలలో విజయవాడ రైల్వేస్టేషను అభివృద్ధి, సరికొత్త రూపాన్ని సంతరించు కోవడానికి, అంతే కాకుండా మరీ ముఖ్యంగా భారతీయ రైల్వేలు కంపెనీ విధానంలో ప్రధాన మార్పులు కూడా ఒక కారణం. 2009 ఆర్థిక సంవత్సరంలో, రైల్వే బోర్డు సంస్థ రవాణా కేంద్రంగా మెరుగుదలల కోసం 3.5 కోట్ల రూపాయలు కేటాయించింది.[9]
  • ఒక " ఇంటిగ్రేటెడ్ భద్రత పథకం " మెరుగుదలలలో భాగంగా, స్టేషను ప్రాంగణం మొత్తం చుట్టూ ప్రహరీ రక్షణ గోడల నిర్మాణం ఒకటి ఉంది . ఇంకా, భారతదేశం లో ఒకవైపు తీవ్రవాదము పెరుగుదల వలన; భద్రత, జాగ్రత్తలలో భాగంగా, స్టేషను వద్ద ప్రవేశం, నిష్క్రమణ ద్వారాలు (పాయింట్లు) సంఖ్యను చాలా సాధ్యమయినంత వరకు తగ్గించడానికి ప్రయత్నించారు. మరిన్ని భద్రతా మార్పులు చర్యల కోసం ఒక అంచనా ప్రాతిపదికన స్టేషను ప్రాంగణంలో ఆధునిక నిఘా గాడ్జెట్లు కూడా ఆరు నెలల వ్యవధిలో ఏర్పాటు (ప్లేస్) చేసేందుకు ప్రణాళిక రూపొందించడము జరిగింది.

ప్రధాన సంఘటనలు

[మార్చు]
దస్త్రం:WDP-1 diesel locomotive at Vijayawada Railway Station.jpg
విజయవాడ జంక్షన్ లోనికి ప్రవేశిస్తున్నడీజిల్ ఇంజన్ రైలు

విజయవాడ జంక్షన్ నుండి బయలు దేరు
సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ , ఎక్స్‌ప్రెస్ రైళ్లు

[మార్చు]
రైలుబండి సంఖ్య. రైలుబండి పేరు వివరము బయలుదేరు చోటు చేరు చోటు/గమ్యం బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ
12718 రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ / మెయిల్ విజయవాడ జంక్షన్ విశాఖపట్నం ప్రతిరోజు
12717 రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ / మెయిల్ విశాఖపట్నం విజయవాడ జంక్షన్ ప్రతిరోజు
12713 శాతవాహన ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ / మెయిల్ విజయవాడ జంక్షన్ సికింద్రాబాద్ ప్రతిరోజు
12714 శాతవాహన ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ / మెయిల్ సికింద్రాబాద్ విజయవాడ జంక్షన్ ప్రతిరోజు
12711 పినాకిని ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ / మెయిల్ విజయవాడ జంక్షన్ చెన్నై సెంట్రల్ ప్రతిరోజు
12712 పినాకిని ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ / మెయిల్ చెన్నై సెంట్రల్ విజయవాడ జంక్షన్ ప్రతిరోజు
12077 జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ / మెయిల్ చెన్నై సెంట్రల్ విజయవాడ జంక్షన్ మంగళవారం మినహా
12078 జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ / మెయిల్ విజయవాడ జంక్షన్ చెన్నై సెంట్రల్ మంగళవారం మినహా
17208 విజయవాడ - షిర్డీ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ జంక్షన్ షిర్డీ మంగళవారం
17207 సాయినగర్ షిర్డీ - విజయవాడ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ షిర్డీ విజయవాడ జంక్షన్ బుధవారం

విజయవాడ జంక్షన్ మీదుగా ప్రయాణించే రైలుబండ్ల వివరాలు

[మార్చు]
రైలుబండి సంఖ్య. రైలుబండి పేరు వివరము బయలుదేరు చోటు చేరుచోటు/గమ్యం బయలుదేరు రోజులు/ఫ్రీక్వెన్సీ
12739 విశాఖపట్నం గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ గరీబ్ రథ్ విశాఖపట్నం సికింద్రాబాద్ రైల్వేస్టేషను ప్రతిరోజూ
12740 విశాఖపట్నం గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్ గరీబ్ రథ్ సికింద్రాబాద్ రైల్వేస్టేషను విశాఖపట్నం ప్రతిరోజూ
12727 గోదావరి ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం హైదరాబాద్ ప్రతిరోజూ
12728 గోదావరి ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ విశాఖపట్నం ప్రతిరోజూ
12805/06 జన్మభూమి ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ రైల్వేస్టేషను విశాఖపట్నం ప్రతిరోజూ
12705/06 గుంటూరు - సికింద్రాబాద్ ఇంటర్ సిటి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ గుంటూరు జంక్షన్ సికింద్రాబాద్ రైల్వేస్టేషను ప్రతిరోజూ
12737/38 గౌతమి ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కాకినాడ సికింద్రాబాద్ రైల్వేస్టేషను ప్రతిరోజూ
12861/62 విశాఖపట్నం - హజరత్ నిజాముద్దీన్ లింకు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం హజరత్ నిజాముద్దీన్ ప్రతిరోజూ
12709/10 సింహపురి ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ గూడూరు సికింద్రాబాద్ రైల్వేస్టేషను ప్రతిరోజూ
12759/60 చార్మినార్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ చెన్నై సెంట్రల్ హైదరాబాద్ ప్రతిరోజూ
12703/04 ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషను హౌరా ప్రతిరోజూ
12621/22 తమిళనాడు ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ చెన్నై సెంట్రల్ హజరత్ నిజాముద్దీన్ ప్రతిరోజూ
12615/16 గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ చెన్నై సెంట్రల్ హజరత్ నిజాముద్దీన్ ప్రతిరోజూ
12839/40 హౌరా చెన్నై మెయిల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హౌరా చెన్నై సెంట్రల్ ప్రతిరోజూ
12841/42 కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హౌరా చెన్నై సెంట్రల్ ప్రతిరోజూ
12655/56 నవజీవన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అహ్మదాబాద్ చెన్నై సెంట్రల్ ప్రతిరోజూ
12863/64 హౌరా - యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ హౌరా యశ్వంతపూర్ ప్రతిరోజూ
12625/26 కేరళ ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ త్రివేడ్రం సెంట్రల్ హజరత్ నిజాముద్దీన్ ప్రతిరోజూ
12295/96 సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బెంగుళూరు సిటి రైల్వేస్టేషను పాట్నా జంక్షన్ ప్రతిరోజూ
12763/64 పద్మావతి ఎక్స్‌ప్రెస్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి సికింద్రాబాద్ రైల్వేస్టేషను ఆది, సోమ, మంగళ, శుక్ర, శని
17201/02 గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ గుంటూరు సికింద్రాబాద్ రైల్వేస్టేషను ప్రతిరోజూ
17015/16 విశాఖ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ భువనేశ్వర్ సికింద్రాబాద్ రైల్వేస్టేషను ప్రతిరోజూ
11019/20 కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ భువనేశ్వర్ లోకమాన్య తిలక్ టెర్మినస్ ప్రతిరోజూ
18519/20 విశాఖ - ముంబాయి లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ విశాఖపట్నం లోకమాన్య తిలక్ టెర్మినస్ ప్రతిరోజూ
17401/02 తిరుపతి - మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి మచిలీపట్నం ప్రతిరోజూ
17403/04 తిరుపతి - నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి నర్సాపూర్ ప్రతిరోజూ
17209/10 శేషాద్రి ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ బెంగుళూరు సిటి రైల్వేస్టేషను కాకినాడ ప్రతిరోజూ
17255/56 నర్సాపూర్ - హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ నర్సాపూర్ హైదరాబాద్ ప్రతిరోజూ
17049 మచిలీపట్నం - సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ మచిలీపట్నం సికింద్రాబాద్ రైల్వేస్టేషను ప్రతిరోజూ
18645/46 ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ హౌరా హైదరాబాద్ ప్రతిరోజూ
18463/64 ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ భువనేశ్వర్ బెంగుళూరు ప్రతిరోజూ
18189/90 టాటానగర్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ టాటానగర్ అలప్పుఝ ప్రతిరోజూ
13351/52 ధన్‌బాద్ జంక్షన్ - అలప్పుఝ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ ధన్‌బాద్ జంక్షన్ అలప్పుఝ ప్రతిరోజూ

విజయవాడ జంక్షన్ స్టేషను ప్రారంభమగు రైళ్ళు

[మార్చు]

మెమో, డెమో పాసింజర్ బండ్ల వివరాలు:

  1. 57212⇒77269 విజయవాడ - మచిలీపట్నం ప్యాసింజర్ వయా నిడమానూరు, గుడివాడ, పెడన - ప్యాసింజర్ - ప్రతిరోజు.
  2. 77210⇒57213 మచిలీపట్నం - విజయవాడ ప్యాసింజర్ వయా పెడన, గుడివాడ, నిడమానూరు - ప్యాసింజర్ - ప్రతిరోజు.
  3. 57225 విజయవాడ - విశాఖపట్నం ప్యాసింజర్, తిరుగు ప్రయాణం
  4. 57226 విశాఖపట్నం - విజయవాడ ప్యాసింజర్ - విశాఖపట్నం రైల్వే స్టేషను వయా ఏలూరు, తాడేపల్లిగూడెం, తుని, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ - ప్యాసింజర్ - ప్రతిరోజు.
  5. 57231 విజయవాడ - కాకినాడ ప్యాసింజర్, తిరుగు ప్రయాణం
  6. 57232 కాకినాడ - విజయవాడ ప్యాసింజర్ - కాకినాడ పోర్ట్ వయా ఏలూరు, తాడేపల్లిగూడెం, తుని, రాజమండ్రి,సామర్లకోట - ప్యాసింజర్ - ప్రతిరోజు.
  7. 57271 విజయవాడ - రాయగడ ప్యాసింజర్, తిరుగు ప్రయాణం
  8. 57272 రాయగడ - విజయవాడ ప్యాసింజర్ - రాయఘడ్ రైల్వే స్టేషను వయా ఏలూరు, రాజమండ్రి, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం - ప్యాసింజర్ - ప్రతిరోజు.
  9. 57241 బిట్రగుంట - విజయవాడ ప్యాసింజర్, తిరుగు ప్రయాణం
  10. 57242 విజయవాడ - బిట్రగుంట ప్యాసింజర్ - బిట్రగుంట వయా తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి - ప్యాసింజర్ - ప్రతిరోజు.
  11. 57253 భద్రాచలం రోడ్ - విజయవాడ ప్యాసింజర్, తిరుగు ప్రయాణం
  12. 57254 విజయవాడ - భద్రాచలం రోడ్ ప్యాసింజర్ - భద్రాచలం రోడ్డు వయా కొండపల్లి, ఎర్రుపాలెం, మధిర, ఖమ్మం, డోర్నకల్ - ప్యాసింజర్ - ప్రతిరోజు.
  13. 57237 కాజీపేట - విజయవాడ ప్యాసింజర్, తిరుగు ప్రయాణం
  14. 57238 విజయవాడ - కాజీపేట ప్యాసింజర్ - వయా కొండపల్లి, ఎర్రుపాలెం, మధిర, ఖమ్మం, డోర్నకల్, కేసముద్రం - ప్యాసింజర్ - ప్రతిరోజు.
  15. 56501 విజయవాడ - హుబ్లీ ప్యాసింజర్, తిరుగు ప్రయాణం
  16. 56502 హుబ్లీ - విజయవాడ ప్యాసింజర్ - ప్రతిరోజు.
  17. 56503 యశ్వంతపూర్ జంక్షన్ - విజయవాడ ప్యాసింజర్, తిరుగు ప్రయాణం
  18. 56504 విజయవాడ - యశ్వంతపూర్ జంక్షన్ ప్యాసింజర్ - ప్రతిరోజు.
  19. 67251 విజయవాడ - తెనాలి మెమో, తిరుగు ప్రయాణం
  20. 67253 తెనాలి - విజయవాడ మెమో మెమో - ప్రతిరోజు.
  21. 67281 విజయవాడ - తెనాలి మెమో, తిరుగు ప్రయాణం
  22. 67286 తెనాలి - విజయవాడ మెమో మెమో - ప్రతిరోజు.
  23. 67287 విజయవాడ - తెనాలి మెమో మెమో - ప్రతిరోజు.
  24. 67254 విజయవాడ - గుంటూరు మెమో - ప్రతిరోజు.
  25. 67259 గుంటూరు - విజయవాడ మెమో - ప్రతిరోజు.
  26. 67274 గుంటూరు - విజయవాడ మెమో - ప్రతిరోజు.
  27. 67261 విజయవాడ - రాజమండ్రి మెమో, తిరుగు ప్రయాణం
  28. 67262 రాజమండ్రి - విజయవాడ మెమో - వయా గన్నవరం, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు ద్వారా మెమో - ప్రతిరోజు.
  29. 67260 ఒంగోలు - విజయవాడ మెమో, తిరుగు ప్రయాణం
  30. 67263 విజయవాడ - ఒంగోలు మెమో - వయా తెనాలి, బాపట్ల, చీరాల ద్వారా మెమో - ప్రతిరోజు.
  31. 67271 డోర్నకల్లు జంక్షన్ - విజయవాడ మెమో, తిరుగు ప్రయాణం
  32. 67272 విజయవాడ - డోర్నకల్లు జంక్షన్ మెమో - వయా కొండపల్లి, ఎర్రుపాలెం, మధిర, ఖమ్మం ద్వారా మెమో - ప్రతిరోజు.
  33. 77206 భీమవరం - విజయవాడ డెమో - వయా నిడమానూరు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు ద్వారా మెమో - ప్రతిరోజు.
  34. 77207 విజయవాడ - మచిలీపట్నం డెమో, తిరుగు ప్రయాణం
  35. 77208 మచిలీపట్నం - విజయవాడ డెమో - వయా నిడమానూరు, గుడివాడ, పెడన ద్వారా మెమో - ప్రతిరోజు.

విజయవాడలోని ఇతర రైల్వేస్టేషనులు

[మార్చు]

విజయవాడ నగరంలో మరో ఎనిమిది రైల్వేస్టేషను లున్నాయి. అవి:

రైల్వేస్టేషను పేరు రైల్వేస్టేషను కోడ్ రైల్వే జోన్ రైల్వే డివిజన్ మొత్తం ప్లాట్‌ఫారములు
కృష్ణా కెనాల్ జంక్షన్ KCC దక్షిణ మధ్య రైల్వే గుంటూరు డివిజను 5
కొండపల్లి KI దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజను 3
రాయనపాడు RYP దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజను 3
ముస్తాబాద MBD దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజను 2
గన్నవరం GWM దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజను 2
రామవరప్పాడు RMV దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ 1
నిడమానూరు NDM దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజను 1
మధురానగర్ రైల్వేస్టేషను MDUN దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజను 1
గుణదల రైల్వేస్టేషను GALA దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజను 3

విజయవాడ జంక్షన్ నుండి ప్రారంభం , బయలుదేరు రైళ్ళు

[మార్చు]

విజయవాడ జంక్షన్ నుండి ప్రారంభం ఇతర రైళ్ళు జాబితా ఈ క్రింద విధంగా ఉన్నాయి. మూస:విజయవాడ జంక్షన్ నుండి బయలుదేరు రైళ్ళు

ఇవి కూడా చూడండి

[మార్చు]

సూచనలు

[మార్చు]
  1. "Indian Railways' Vijayawada Railway Junction set for Rs 40 crore revamp and renovation". The Financial Express. 2018-07-16. Retrieved 2019-05-20.
  2. "అమ్మకానికి.. బెజవాడ రైల్వేస్టేషన్!". ఆంధ్రజ్యోతి. Archived from the original on 2021-09-09. Retrieved 2021-09-09.
  3. "Vijayawada lays platform for Krishna fete". The Hindu. 23 Aug 2004. Retrieved 20 Sep 2012.
  4. "Plans to develop railway station". The Hindu. 24 Mar 2008. Archived from the original on 27 మార్చి 2008. Retrieved 20 Sep 2012.
  5. "Vijayawada division – A Profile" (PDF). South Central Railway. Retrieved 18 January 2016.
  6. "Jump in SCR Vijayawada division revenue". The Hindu. Vijayawada. 28 April 2015. Retrieved 29 May 2015.
  7. "Statement showing category-wise No.of stations" (PDF). South Central Railway. Retrieved 23 April 2017.
  8. "Vijayawada railway junction struggles to keep pace with increasing rush". The Hindu. 10 Feb 2009. Archived from the original on 5 నవంబరు 2012. Retrieved 20 Sep 2012.
  9. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-02-13. Retrieved 2014-12-06.

బయటి లింకులు

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూసలు , వర్గాలు

[మార్చు]