వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డివిజన్లు పేజీలు సృష్టింపు
భారతదేశ పరిపాలనా వ్యవస్థలో రెవెన్యూ డివిజన్లు ప్రాముఖ్యత చాలా ఉంది.ప్రతి జిల్లాను ఆ జిల్లా భౌగోళిక పరిధి, జనాభా ప్రాతిపదికననుసరించి పరిపాలనా సౌలభ్యంకోసం రెవెన్యూ వ్యవస్థలో భాగంగా కొన్ని రెవెన్యూ డివిజన్లుగా విభజించారు. ఇవి మండలాలుకు , జిల్లాకు మధ్యలో వారధిగా ఉంటాయి.వీటిని ఉప జిల్లాలు అని కూడా అంటారు. ఇవి రెవెన్యూ డివిజనల్ అధికారి నేత్రత్వంలో పరిపాలన సాగిస్తాయి.జిల్లా వ్యాసాల పేజీలు, మండల వ్యాసాల పేజీలు ఎంత అవసరమో వీటి అవసరం కూడా అంత ఉంది.జిల్లా తరువాత అన్ని ఎన్నికల నిర్వహణలో రెవెన్యూ డివిజన్లు ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.
మాదిరి వ్యాసాలు
[మార్చు]పేజీ సృష్టింపు
[మార్చు]- పేజీలు సృష్టించే ముందు పైన వివరించిన మాదిరి వ్యాసాలు ఒకసారి పరిశీలించండి.
- ఈ ప్రాజెక్టు పేజీ లోని ఎర్ర లింకుపై క్లిక్ చేసి, పైన చూపిన మాదిరి వ్యాసాల లోని ప్రవేశిక ఆ రెవెన్యూ డివిజనుకు తగినట్లుగా రాసి పేజి సృష్టించండి.
- మాదిరి వ్యాసంలో చూపిన విధంగా "డివిజనులోని మండలాలు" అనే విభాగంలో ఈ ప్రాజెక్టు పేజీలో ఆ రెవెన్యూ డివిజనుకు చెందిన మండలాలు కూర్పు చేయండి.
- ఆసక్తి ఉన్న వాడుకరులు ఎవరైనా సృష్టించవచ్చు
మూలాలు సమకూర్పు
[మార్చు]- డివిజనులోని మండలాలు అనే విభాగం తరువాత మూలాలు అనే విభాగం పెట్టి మూలాలు మూస కూర్పు చేయండి.
- జిల్లా లోని అన్ని రెవెన్యూ డివిజన్లుకు ఆ జిల్లాకు చెందిన భారత జనాభా లెక్కల వెబ్సైటు లింకును చూపించాలి.దానిని కనుగొనటానికి Guntur District Revenue Divisions అని శోధించి, ఆ లింకును గమనించి మూలంగా ఇవ్వాలి. ఉదాహరణకు ఇక్కడ గుంటూరు జిల్లాకు చెందిన ఈ లింకును గమనించండిఆ లింకులోని PDF లో 23 వ పేజీ లో గుంటూరు జిల్లాలోని రెవెన్యూ డివిజన్లు, ఆ రెవెన్యూ డివిజన్లులోని మండలాలు వివరాలు ఇవ్వబడ్డాయి.
- రెండవ మూలంగా సంబందిత జిల్లాకు చెందిన ప్రభుత్వ వెబ్సైటు లింకు చూపించాలి.దానిని కనుగొనటానికి ఆంగ్లంలో Guntur District Revenue Divisions అని శోధించి ఆ జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్లుకు రెండవ మూలంగా చూపించాలి.
ఇన్‌కమింగు లింకులు ఇవ్యటం
[మార్చు]సృష్టించిన ప్రధాన పేరుబరి లోని పేజీలకు మరే ఇతర పేజీ నుండీ లింకు లేకపోతే దాన్ని అనాథ పేజీగా పరిగణిస్తారు.అనాథ వ్యాసాలకు వేరే ఇతర పేజీల నుండి లింకులేమీ లేనందున పాఠకులు ఇతర పేజీల నుండి ఈ పేజీలకు వెళ్ళే అవకాశం చాలా తక్కువుగాఉంటుంది.అందువలన ప్రధాన పేరుబరిలో సృష్టించిన ప్రతి పేజీకి వ్యాసం సృష్టించినప్పుడే ఇన్‌కమింగ్ లింకులు తప్పనిసరిగా కలిపే ప్రయత్నం చేయాలి.దీనికి ఎడమ వైపున ఉన్న ఇక్కడికి లింకున్న పేజీలు లింకు ద్వారా ఆపేజీలలో లింకును కలపవచ్చు.ఆ లింకులో ఎలాంటి పేజీలు లేకపోతే వ్యాసంలోని విషయసంగ్రహం ద్వారా ఒకటి,లేదా రెండు లింకులు ఇవ్వాలి. అయితే ఈ రెవెన్యూ డివిజన్లు పేజీలకు ఇన్‌కమింగ్ లింకులు ఇవ్యటానికి పెద్దకష్టపడాల్సిన పని లేదు. సృష్టించిన రెవెన్యూ డివిజను పరిధిలోని మండల వ్యాసం పేజీలోకి వెళ్లి లింకును తెలికగా కలుపవచ్చు. అలా ప్రతి మండల వ్యాసంలో లింకులు కలపవచ్చు.
డివిజను పరిధి లోని రెవెన్యూ గ్రామాలు సంఖ్య నమోదు
[మార్చు]డివిజను పరిధిలోని మండలాల లోని రెవెన్యూ గ్రామాలు లెక్కించి, మొత్తం రెవెన్యూ గ్రామాలు సంఖ్య కొత్తగా సృష్టించిన రెవెన్యూ డివిజను ప్రవేశికలో నమోదు చేయాలి.
వికీడేటా లింకు కలపాలి
[మార్చు]ఆంగ్ల వికీపీడియాలో (Category:Revenue divisions in Andhra Pradesh) కొన్ని రెవెన్యూ డివిజన్లుకు పేజీలు ఉన్నవి. వాటిని గమనించి లింకులు కలపాలి.లేనివాటికి కొత్తగా వికీడేటా లింకు సృష్టించి కలపాలి.
ప్రాజెక్టు కాలపరిమితి
[మార్చు]ప్రత్యేక కాలపరిమితి అంటూ ఏమిలేదు.
సందేహాలు, సూచనలు
[మార్చు]ఈ ప్రాజెక్టు మీద ఏమైనా సందేహాలు ఉంటే ప్రాజెక్టు చర్చాపేజీలో తెలపండి. అలాగే సూచనలు ప్రాజెక్టు చర్చాపేజీలో తెలపండి
పాల్గొనే వాడుకరులు
[మార్చు]పేజీ సృష్టించవలసిన రెవెన్యూ డివిజన్లు జాబితా
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "మండలాలు | శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం | భారతదేశం". Retrieved 2022-01-12.
- ↑ 2.0 2.1 2.2 https://srikakulam.ap.gov.in/revenue-villages/
- ↑ 3.0 3.1 https://www.censusindia.gov.in/2011census/dchb/2812_PART_B_DCHB_VIZIANAGARAM.pdf
- ↑ 4.0 4.1 https://www.censusindia.gov.in/2011census/dchb/2812_PART_B_DCHB_VIZIANAGARAM.pdf
- ↑ 5.0 5.1 https://vizianagaram.ap.gov.in/mandal-wise-villages/
- ↑ 6.0 6.1 6.2 https://www.censusindia.gov.in/2011census/dchb/2813_PART_B_DCHB_VISAKHAPATNAM.pdf
- ↑ "GO issued for creation of Anakapalle revenue division - The Hindu". web.archive.org. 2019-12-27. Retrieved 2019-12-27.
- ↑ 8.0 8.1 8.2 "Revenue Mandals | District YSR(Kadapa), Government of Andhra Pradesh | India". Retrieved 2022-01-25.
- ↑ 9.0 9.1 9.2 "Mandal | District Kurnool , Government of Andhra Pradesh | India". Retrieved 2022-01-26.
- ↑ 10.0 10.1 10.2 https://www.censusindia.gov.in/2011census/dchb/2823_PART_B_DCHB_CHITTOOR.pdf